benami transactions
-
‘ఈ కుంభకోణంలో బాబు హ్యాండ్ ఉంది’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు తమ మెదడును ఉపయోగించి రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లను ఎంచుకుని చేసిన బ్రహ్మాండమైన మోసమని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. ఆయన దగ్గర పనిచేసిన పీఎస్ శ్రీనివాస్ వద్ద ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు దొరకడం అందరినీ షాక్‌కు గురిచేసిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి సింగపూర్ సింగపూర్ అంటున్న బాబు అక్రమార్జన అంతా సింగపూర్ వెళ్లుంటుందని విమర్శించారు. హవాల ద్వారా పంపిన బ్లాక్‌మనీ.. విదేశీ పెట్టుబడుల రూపంలో మనకు వైట్‌మనీగా వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక టీడీపీ పాలనలో అమరావతి, విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎందుకంటే సదస్సుకు వచ్చిన వారంతా బాబు మనుషులేనని పేర్కొన్నారు. అవన్నీ బాబు షెల్ కంపెనీలే ‘చంద్రబాబు సీఎం కాగానే లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని పలు కంపెనీలు, పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ బాబు షెల్ కంపెనీలే. ఆయన అవినీతి బాగోతం, మనీ లాండరింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలి. చంద్రబాబు, లోకేష్ దగ్గర ఐటీ దాడుల్లో ఏమీ దొరకలేదు కధా? వారికేం సంబంధం అని చాలామంది అంటారు. కానీ దీనినే బినామీ ట్రాంజాక్షన్ అంటాము. అలాగే చంద్రబాబు సూపర్వైజింగ్ ఫెయిల్యూర్ అని కూడా అనవచ్చు. మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత యాజమానిపై ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో తన వద్ద పని చేసిన వ్యక్తి వద్ద పెద్ద మొత్తం సొమ్ము పట్టుబడిందంటే చంద్రబాబు సూపర్వైజింగ్ ఫెయిల్యూరా? లేదా కుమ్మక్కుతో కూడిన కుంభకోణమా? అనేది తేలాల్సి ఉంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు హ్యండ్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉంటుంది. అందువల్ల ఇది పూర్తిగా బయటపడాలంటే వెంటనే ఐటీ శాఖ శ్రీనివాస్ కేసును తక్షణమే సిబిఐకి అప్పగించి విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు) చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం! ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’ లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! (చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు) -
బినామీ లావాదేవీలపై వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : బినామీ లావాదేవీలకు దూరంగా ఉండాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలను హెచ్చరించింది. నూతన బినామీ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో పాటు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. బినామీ లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ ఐటీ శాఖ జాతీయ దినపత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. బినామీదారు, లబ్ధిదారుడుతో పాటు దీనికి సంబంధం ఉన్నవారంతా బినామీ చట్టం ఉల్లంఘనల కింద కఠిన శిక్షను ఎదుర్కొంటారని, అంతేకాకుండా మార్కెట్ విలువలో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఈ ప్రకటనలో ఐటీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక 2016 నవంబర్ 1 నుంచి అక్టోబర్ 2017 వరకూ దేశవ్యాప్తంగా పన్ను అధికారులు రూ 1833 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేసి 517 నోటీసులు జారీ చేశారు. 2016 నవంబర్ 1 నుంచి నూతన బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోవడాన్ని ఐటీ అధికారులు ప్రారంభించారు. -
బినామీ లావాదేవీలకు ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశంలో బినామీ లావాదేవీలు జరిపితే ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ హెచ్చరించింది. వీరు బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం – 1988తో పాటు ఐటీ చట్టం ప్రకారం కూడా శిక్షార్హులని పేర్కొంది. ఎవరూ బీనామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని, ఇది 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సహాయం చేసినవారు అందరూ శిక్షార్హులేనని, వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా విధించాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒకవేళ అధికారులకు బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం గతేడాది అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు నమోదు కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. -
మోదీ తదుపరి టార్గెట్ ఏంటో తెలుసా?
రాత్రికి రాత్రే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. త్వరలోనే మరో సంచలనం రేపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న బినామీ లావాదేవీలపై కొరడా ఝళిపించడానికి మోదీ సై అంటున్నారు. లెక్కల్లోకి రాకుండా పోతున్న డబ్బు మొత్తాన్ని పన్ను పరిధిలోకి తేవాలని చేస్తున్న విప్లవాత్మక చర్యలలో భాగంగా బినామీ లావాదేవీలపై కన్ను పెట్టబోతున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచే బినామీ లావాదేవీలపై కఠిన చర్యలు మొదలవుతాయని సమాచారం. ఒకపక్క ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి అన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలన్నది మోదీ వ్యూహంలా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పథకాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలను చేపట్టాలని, అది కూడా శరవేగంగా చేపట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది. బినామీ ఆస్తుల విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గే సమస్య లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనివల్ల తాత్కాలికంగా రాజకీయ వ్యతిరేకత వచ్చినా, దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయన్నది సర్కారు భావనగా తెలుస్తోంది. ఈ విషయమై సోమవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా విస్తృతంగా చర్చ జరిగిందంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జాతీయవ్యాప్తంగా మద్దతు కనిపిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సమావేశం తర్వాత తెలిపారు. నల్లధనంపై సిట్ వేయడం, రెండుసార్లు పన్నులు విధించే పద్ధతిని రద్దుచేయడం, బినామీ లావాదేవీల రద్దు బిల్లు ప్రవేశపెట్టడం లాంటి చర్యలుంటాయని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.