bengaluru municipal corporation
-
ఏరో ఇండియా.. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు
బెంగళూరు: ఏరో ఇండియా షో 2025 నేపథ్యంలో బెంగళూరు మహానగరపాలక సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగర శివారులో దాదాపు ఇరవై రోజులపాటు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీల మధ్య బెంగళూరు శివారు యలహంకలో 15వ ఎడిషన్ ఎరో ఇండియా షో జరగనుంది. అయితే.. ఎయిర్‌షో జరిగే ఈ ప్రాంతం నుంచి 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ బెంగళూరు పాలక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.ಬಿಬಿಎಂಪಿ ವಲಯದ ಏರ್ಪೋರ್ಸ್ ಸ್ಟೇಷನ್ ನಿಂದ 13 ಕಿ.ಮೀ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರುವ ಎಲ್ಲಾ ಮಾಂಸ ಮಾರಾಟದ ಉದ್ದಿಮೆಗಳನ್ನು ದಿನಾಂಕ: 10.02.2025 ರಿಂದ 14.02.2025 ರವರೆಗೆ ಏರ್ಶೋ ಪ್ರದರ್ಶನದ ಪ್ರಯುಕ್ತ ಮುಚ್ಚಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ.#BBMP #BBMPCares #bbmpchiefcommissioner #Yelahanka #AeroIndia2025 #AeroIndia #airshow… pic.twitter.com/0Xuq3eA8Hd— Bruhat Bengaluru Mahanagara Palike (@BBMPofficial) January 18, 2025కారణం..ఏరో ఇండియా సందర్భంగా గగనతలంలో వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అయితే మాంసాహారం కోసం వచ్చే పక్షులు, మరీ ముఖ్యంగా కైట్స్ లాంటి పక్షుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో.. కేవలం విక్రయాలు జరిపేవాళ్లకు మాత్రమే కాదు మాంసాహారాన్ని వడ్డించే హోటల్స్, రెస్టారెంట్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. నగరంలోని చెత్తాచెదారాన్ని యలహంక పరిధిలో డంప్ చేయకూడదని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. బీబీఎంపీ యాక్ట్ 2020, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 రూల్ 91 ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది.1994 నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన విమానాలు, యుద్ధ విమానాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే సమయంలో.. రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఎరోస్పేస్ కంపెనీల నడుమ భారీ ఒప్పందాలకు ఏరో ఇండియా కేంద్రం కానుంది.🚀 The countdown begins!Hon'ble Raksha Mantri Shri #RajnathSingh launched the official #AeroIndia2025 teaser video today at the Ambassadors' Round Table.Mark your calendars for Asia's premier biennial airshow, taking flight in Bengaluru from 10th-14th February 2025!… pic.twitter.com/UCu5iXSsgN— Aero India (@AeroIndiashow) January 10, 2025 -
ఈ పెంపుడు కుక్కలపై నిషేధం
బెంగళూరు: నగరంలోని అపార్ట్మెంట్లలో పొడవాటి బ్రీడింగ్ కుక్కల పెంపకాన్ని నిషేధించాలని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. గ్రేట్ డేన్, ఇంగ్లీష్ మస్తిఫ్, బుల్డాగ్, బాక్సర్, రాట్‌వీలర్, సెయింట్ బెర్నార్డ్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్ బ్రీడింగ్ కుక్కలను పెంపుడు కుక్కల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇతర జాతులకు చెందిన కుక్కలను మాత్రం ఒక్కో ఫ్లాట్‌కు ఒక్క కుక్క పెంపకాన్ని మాత్రమే పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. ప్రతి కుక్కకు లైసెన్స్ తీసుకోవడమే కాకుండా సంతాన నియంత్రనకు చర్యలు తీసుకున్నట్లు కూడా యజమాని నిరూపించాలని మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కల మల, మూత్ర విసర్జనను యజమానులు వెంటనే శుభ్రం చేయాలని, లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని కూడా పేర్కొంది. ఈ మేరకు సిద్ధమైన ఉత్తర్వులను నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా ఇంకా విడుదల చేయాల్సి ఉంది. పెంపుడు కుక్కల జాబితా నుంచి తొలగించిన కుక్కల బ్రీడర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నగరంలోని జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కుక్కల బ్రీడర్లకు కూడా కొత్త నిబంధనల్లో లైసెన్స్‌ను తప్పనిసరి చేశారు. నగరంలో దాదాపు 15 బ్రీడింగ్ సెంటర్లు అనధికారికంగా నడుస్తున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు తెలిపారు.