Best Mother
-
మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!
న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జెసిండా వెల్లింగ్టన్లోని పార్లమెంట్లో ప్రసంగిస్తూ.. నేను మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. నాయకత్వానికి మాతృత్వం అడ్డు కాకూడదని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నంట్లు వివరించారు. ఆమె గత జనవరి నెలలో ప్రధాని పదవికి రాజీనామ చేస్తూ అందర్నీ షాక్ గురి చేసిన సంగతి తెలిసిందే. ఆమె తన ఐదేళ్ల పాలనలో దేశం ఎన్నో సంక్షోభాలను లోనైంది. కొన్ని చీకటి రోజులను ఎదుర్కొనక తప్పలేదు. సరిగ్గా 2019 క్రైస్ట్‌చర్చిలోని రెండు మసీదులపై జరిగి తీవ్రవాద దాడిలో 51 మంది మరణించారు. అదే ఏడాది అగ్నిపర్వతం విస్పోటనం చెంది సుమారు 22 మంది మరణించారు. తర్వాత కరోనా ఇలా వరుస సంక్షోభాలను జెసిండా పాలన ఎదుర్కొంది భయంకరమైన క్షణాల్లో మన దేశాన్ని విచారంగా చూశానని, అలాగే దుఃఖభరితంగా ఉన్నప్పుడూ దేశాలు ముందుకు సాగలేవని తెలుసుకున్నానని జెసిండా తన ప్రసంగంలో చెప్పారు. ఆ ఘటనలు మన మనస్సులో మెదులుతాయన్నారు. కానీ ఆ క్షణాలు మన ఉనికిలో భాగమవడమేగాక వాటిని ఎదుర్కొనేలా కూడా సన్నద్ధమవ గలగుతామని ఆమె చెప్పారు. 2018లో జెసిండా శ్రామిక మహిళలకు పెద్ద పీట వేస్తూ.. బెనజీర్ బుట్టో తర్వాత శక్తిమంతమైన రెండో ప్రపంచ నాయకురాలిగా పేరుగాంచారు. ఈ సందర్భంగా తన మాతృత్వ ప్రయాణం గురించి కూడా చెబుతూ.. ప్రధాని హోదాలో ఉన్న ఒత్తిడి కారణంగా తల్లి కాలేకపోయినట్లు పేర్కొంది కూడా. చాలా కాలం అందుకోసం నిరీక్షించానని తెలిపింది. ఎట్టకేలకు తాను తల్లి కాబోతున్నానని తెలిసి ఆశ్చర్యంగా అనిపించిందని అందుకే వెంటనే పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కాగా, జెసిండా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. తిరిగి ఎన్నికయ్యే సామర్థ్యం లేక బెదిరింపుల కారణాంగా ఇలా రాజీనామ చేస్తున్నారంటూ ..విమర్శలు గుప్పుమన్నాయి. దీనికితోడు ఆమె లేబర్ పార్టీ ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు జరిగే ఓపీనియన్ పోల్‌లో దారుణంగా పడిపోయింది కూడా! (చదవండి: అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే! నివేదిక విడుదల) -
మంచి తల్లిని అవుతా
‘‘జీవితంలో నేను సాధించాల్సింది ఎంతో ఉంది’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన జీవిత లక్ష్యాల గురించి శ్రుతీ మాట్లాడుతూ –‘‘కేవలం నటిగానే కాదు.. పాటలు, కవితలు రాయడం, సినీ నిర్మాణ రంగం పట్ల కూడా నాకు ఆసక్తి ఎక్కువగానే ఉంది. నా జీవితంలో నేను సాధించాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇందుకు చాలా సమయం కూడా ఉంది. కానీ భవిష్యత్‌లో నేను ఒక మంచి తల్లిని కావాలనుకుంటున్నాను. అదే నా అంతిమ లక్ష్యం. మంచి తల్లిగా ఉండటం మహిళల జీవితాల్లో ఓ గొప్ప విజయమని నా అభిప్రాయం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
ఆమెకు బెస్ట్ మమ్మీ అవార్డు ఇవ్వాలి!
చిన్న పిల్లలు గీసే చిత్రాలు ఎలాగుంటాయి? అబ్బో అసలు ఏం గీశారో ఆ చిన్ని మేధావులకు తప్ప మనలాంటివారికి అంతుచిక్కదు. తీరా వాళ్లు మేము గీసింది ఇదీ అని వివరించి చెప్తేగానీ తెలియదునుకోండి. అదేవిధంగా ఓ చిన్నారి కూడా ఆర్టిస్టు అవతారమెత్తి తన తల్లి బొమ్మ గీద్దామనుకుంది. అనుకున్నదే తడవుగా కుంచె పట్టి ఓ చిత్రాన్ని ఆవిష్కరించింది. ఇది చూసిన ఆమె తల్లి ఎస్క్ర్టాండ్ తనను తాను పోల్చుకోలేక అయోమయానికి లోనైంది. ఏమైతేనేం.. తన గారాలపట్టి గీసిన బొమ్మ తనకు అద్భుత చిత్రకావ్యమే అనుకుని దాన్ని భద్రంగా దాచుకుంది. అరుదైన కానుకగా దాన్ని ఫ్రేము చేయించి మరీ పెట్టుకుంది. సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే ఈమధ్యే ఆమె ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ ఈసారి ఆ తల్లి అచ్చంగా కూతురు గీసిన బొమ్మలానే ఉంది. తన మేకప్ వేసుకుని మరీ ఫొటోలో ఉన్నట్టుగా రావడానికి ఎంతగానో కష్టపడింది. అనంతరం పెయింటింగ్‌తో పాటు కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ తల్లిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మీ కూతురు గీసిన బొమ్మను ఫ్రేము కట్టించి మరీ దాచుకోవడం నిజంగా అద్భుతం’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. దానికి ఆమె స్పందిస్తూ ‘ఇది వెలకట్టలేని ఆస్తి, నాకు మాత్రమే దక్కిన అరుదైన బహుమానం’ అని చెప్పుకొచ్చింది. ‘ఆమెకు బెస్ట్ మమ్మీ అవార్డు ఇవ్వాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా ఈ చిత్రాన్ని గీసిన చిన్నారికి ఇప్పుడు పంతొమ్మిదేళ్లు. -
ఉల్లాసం... ఉత్సాహం... ఉద్వేగం
సాక్షి ఫ్యామిలీ నిర్వహించిన ‘మార్చి 8 మహిళ’ పురస్కారాల పోటీలో అంతిమ విజేతలుగా నిలిచిన ఆరుగురు మహిళలకు శనివారంనాడు హైదరాబాద్‌లో సాక్షి అవార్డులు అందజేసింది. ఈ సందర్భంగా విజేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలివి... దేశానికి వెన్నెముక అమ్మ బెస్ట్ మదర్‌గా నాకు వచ్చిన గుర్తింపు మాతృత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ‘‘నలుగురు ఆడకూతుళ్లకు తల్లిగా ఏనాడూ భయపడలేదు. నా పిల్లలను బాగా చదివించాలని, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడాలని కోరుకున్నా. అనుకున్నట్టే నా చిట్టితల్లులు ఈ రోజు చదువుల తల్లులయ్యారు. అందరూ పీజీలు పూర్తి చేసి, స్వయం ప్రతిపత్తి సాధించగలిగారు. ఓ తల్లిగా నాకింతకన్నా ఏం కావాలి? ఒక మహిళ కు మాతృత్వం కన్నా మధురమైన అనుభూతి మరొకటి ఉండదు. ఆ భాగ్యాన్ని కల్పించిన పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడం ఆ తల్లి బాధ్యత. ఒక తల్లి పెంపకం బాగుంటే ఒక తరం ఉన్నతంగా మారుతుంది. అందుకే మదర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కంట్రీ అంటాన్నేను. పిల్లలపై ప్రేమ చూపడం అంటే వారు అడిగినవన్నీ కొనివ్వడం కాదు. వారిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం. బెస్ట్ మదర్‌గా నాకు అవార్డు అందజేసినందుకు సాక్షికి థ్యాంక్స్. - సుశీల, ‘అమ్మ’ కేటగిరీ విజేత నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను నా గురించి మా పెద్దమ్మాయి రాసి పంపించింది. అది పేపర్లో చూసిన బంధువులు, మా ఊరి వాళ్లు మా అమ్మాయిని బాగా మెచ్చుకున్నారు. అమ్మ చేసిన పనులను అంత చక్కగా రాసి పంపించావన్నారు. నాకు బహుమతి వచ్చిందని తెలిసిన తరవాత అందరి నుంచి ఒకటే ప్రశంసలు. నేను నా కుటుంబానికి చేతనైనంత చేశాను. ఆ పని ఇంతమంది మెప్పును చూరగొంటుందని నాకు తెలియదు. ఇలాంటి అవకాశాన్ని సాక్షి ఇచ్చింది. కృతజ్ఞతలు. ఇలా బహుమతి అందుకోవడం నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. - శివమ్మ, ‘అమ్మ కేటగిరీ విజేత రేపు మనదే అనుకొని ముందుకు సాగాలి బెస్ట్ వైఫ్‌గా నాకు వచ్చిన గుర్తింపు ఓ ఇల్లాలికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఏ మహిళైనా కష్టాలు వచ్చాయని నిరాశ చెందకుండా ఓర్పుతో, సహనంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. - తోట మాధవి, ‘అర్ధాంగి’ కేటగిరీ విజేత కష్టాలకు ఎదురు నిలవాలి బెస్ట్ వైఫ్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా లైఫ్‌లో హ్యపీయెస్ట్ మూమెంట్. నేనే కాదు.. నన్ను మించి కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతో మంది మహిళలు ఉన్నారు. వారిని గుర్తించాల్సిన అవసరముంది. - ఇందిర ‘అర్ధాంగి’ కేటగిరీ విజేత కష్టాన్ని నమ్ముకుంటే నష్టపోము నా శ్రమను గుర్తించి సాక్షి నాకిచ్చిన అవార్డు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగుతాను. నేను చెప్పేది ఒక్కటే కష్టాన్ని నమ్ముకుంటే ఎన్నడూ నష్టపోము. - క్రాంతి, ‘మహిళారైతు’ కేటగిరీ విజేత స్వేదం చిందితే సిరులు కురుస్తాయి అందరి బతుకుల్లోనూ కష్టాలుంటాయి..వాటిని ఎదిరించి నిలిచినపుడే జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఈ పురస్కారం లభించడం నాకెంతో ఆనందంగా ఉంది. స్వేదం చిందితే సేద్యంలో సిరులు కురుస్తాయి. నాకుంది అరెకరం మాత్రమే. మా ఇంటాయన కాలం చేసిన తర్వాత మా పుట్టింటి వాళ్లు ఇచ్చారది. కొన్నాళ్లకు మా నాన్న కూడా పోయారు. పిల్లలూ లేరు. నేనొక్కదాన్నే అరక పట్టి పొల ంలోకి దిగాను. రాబడితో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తూ వచ్చాను. నా శ్రమను గుర్తించి సాక్షి నాకిచ్చిన అవార్డు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాను. - పువ్వుల చంద్రమ్మ, ‘మహిళారైతు’ కేటగిరీ విజేత