కొంచెం నీరు.. కొంచెం నిప్పు..
అగ్నిపర్వతం పేలి లావా సముద్రుడిలో ఒదిగిపోతున్న అద్భుత సన్నివేశం.. నీరు, నిప్పు కలుస్తున్న సమయంలో బుస్సుమంటూ లేస్తున్న పొగలు.. ఈ ఫొటోను అమెరికాకు చెందిన ఆండ్రూలీ తీశారు. నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలిసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో ‘ప్రకృతి సృష్టించిన డిజైన్’ కేటగిరీలో ఇది ఫైనలిస్టుగా నిలిచింది. హవాయిలోని హిలో పట్టణ సమీపంలో అగ్నిపర్వతం పేలి లావా సముద్రంలో కలవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారని.. ఆ విషయం తెలియగానే తానక్కడికి చేరుకున్నానని.. భారీ వర్షం, గాలుల మధ్య ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. ఈ చిత్రాన్ని తీశానని ఆండ్రూలీ చెప్పారు.