Best Student
-
Teachers' Day 2024: నా బెస్ట్ స్టూడెంట్స్..
ఉపాధ్యాయురాలిగా నేను 1992లో చాక్‌పీస్ పట్టుకున్నాను. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చిన్నారులు, అందులోనూ పేదింటి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. నా కన్నపిల్లలు ఇద్దరైతే 32 ఏళ్ల సర్వీస్‌లో దేవుడిచ్చిన పిల్లలు ఇరవై వేలకు పైనే.జ్వరంతో పరీక్ష రాసింది..లక్ష్మి... చక్కగా చదివే అమ్మాయి. నేను వాళ్లకు మాథ్స్ టీచర్ని, హౌజ్ పేరెంట్‌ని కూడా. మాథ్స్ పరీక్షకు ముందు లక్ష్మికి అమ్మవారు ΄ోసింది. ఒళ్లంతా కాలి΄ోతూ ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లి సెలైన్ పెట్టించి, బెడ్ పక్కనే ఉండి ధైర్యం చెపుతూ ఉన్నాను. ఉదయానికి జ్వరం కొంచెం తగ్గింది.‘పరీక్ష రాయగలవా?‘ అని అడిగాను. ‘మీరు పక్కన ఉంటే రాస్తాను‘ అంది ధైర్యంగా. మెల్లిగా సెంటర్‌కి తీసుకొని వెళ్ళాను. మా అబ్బాయికి కూడా ఆ రోజు పదో తరగతి పరీక్ష. కానీ ఈ పిల్లలే నా తొలి ్రపాధాన్యం. మొదటి అంతస్తు లో లక్ష్మి పరీక్ష గది.‘ఎక్కగలవా లక్ష్మీ?‘ అడిగాను. నీరసంగా బదులిచ్చింది. కొబ్బరి నీళ్లు తాగించి ఎగ్జామ్ హాల్లో పక్క పిల్లలకి లక్ష్మి గురించి చెప్పి కిందకు వచ్చాను. రిజల్ట్ వచ్చింది. చక్కటి మార్క్స్. పదో తరగతి మార్కులతోనే ΄ోస్ట్ ఆఫీస్ ఉద్యోగంలో చేరిందని తెలిసి ఎంత సంతోషం వేసిందో! ఓల్డ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘పక్క వాళ్లకు మంచి చేస్తున్నారా? చెడు అలవాట్లు చేసుకున్నారా?‘ అని రెండు ప్రశ్నలు వేస్తాను. వాళ్లు ‘మేము మీ స్టూడెంట్స్ మేడం’ అంటారు. నా పిల్లలు ఇంజినీర్లు, టీచర్స్, నర్స్‌లు, ఎస్.ఐ, ్రపాజెక్ట్ మేనేజర్ లు, ఫిజియో థెరపిస్టులు... ఇందరికి అమ్మగా ఉండగల వరం ఇదిగో ఈ ఉపాధ్యా వృత్తిలోనే సాధ్యం. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో నడిచే నాకు ఇంతకంటే కావలసింది ఏముంది! చివరి క్షణం వరకూ అధ్యాపకురాలిగానే ఉంటాను.చదువు కోసం పెళ్లిని వాయిదా వేసింది..‘ఉమ‘. పదో తరగతి మంచి మార్క్స్‌తో పాస్ అయింది. మా గురుకుల పాఠశాలలోనే ఇంటర్ చదివింది. రోజూ నా క్లాస్‌కి వచ్చి కొద్దిసేపు ఉండేది. ఎందుకలా అని అడిగినప్పుడు ‘మా అమ్మను చూసినట్లు ఉంటుంది. ఇప్పుడు మీరు క్లాసుకు రావడం లేదు కదా! అందుకే రోజూ వచ్చి చూసి వెళ్తున్నాను’ అని ఉమ చెప్తుంటే నాకు కన్నీళ్లాగలేదు. ఇంటర్ తరువాత మా ఇంటికి వచ్చి ‘బీటెక్‌లో చేరడానికి కాలేజ్‌లు ఆప్ష¯Œ ్స పెట్టండి... పదో తరగతి తరువాత పెళ్లి చేసుకోవద్దు... ఇంట్లో ఒప్పించి చదవండి అని మీరు చెప్పేవారు కదా. నేను మా నాన్నను అలాగే ఒప్పించి చదువుకోబోతున్నాను. చదువు తరువాతే పెళ్లి అని చెప్పేశాను’ అంటున్న ఉమని చూస్తే తృప్తి. ఉమ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. మరో ఇంజినీర్ నే పెళ్లి చేసుకున్నది... అని తెలిసినప్పుడు సంతృప్తి. – తన్నీరు శశి, గణిత అధ్యాపకురాలు, పుదూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, తిరుపతి జిల్లా -
Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
కౌశంబీ ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌశంబీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్ణికకు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత.ఆరుగురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చలించింది. అయినా దూరం నుంచే ‘అమ్మాయీ.. దారి తప్పుకో.. మేము వాగు దాటి వెళ్ళాలి’ అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి ‘చీకటి పడుతోంది.. నేనూ వెళ్ళాలి. నన్ను వాగు దాటించండి’ అని అడిగింది. ‘మేము సర్వసంగ పరిత్యాగులం.పర స్త్రీని తాకము’ అంటూ ముందుకు కదిలారు ఆ ఐదుగురు. ‘బాబ్బాబులూ.. దయచేసి నన్ను వాగు దాటించండి’ అంటూ ఆ యువతి వేడుకుంది. ‘వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు’ అని చెప్పనైతే చెప్పారు కానీ.. ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్లు. ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం ‘నేను వాగు దాటిస్తాను రండమ్మా..’ అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన ఐదుగురు ‘ఆ పాపం మాకొద్దు’ అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. ‘అమ్మా.. వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మీరు నా భుజాల మీదకు ఎక్కండి’ అన్నాడు.మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి.. తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ ఐదుగురు మాత్రం కౌకర్ణిక దారెంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. ‘స్త్రీని తాకావు.. భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు’ అంటూ! విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు.ఆ ఆరుగురినీ చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చేప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ‘ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్నీ మరచిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు’ అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌశంబీకీ కబురుపెట్టాడు. – కనుమ ఎల్లారెడ్డిఇవి చదవండి: వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో.. -
ఉత్తమ విద్యార్థులకు సన్మానం
సాక్షి, ముంబై: దాదర్‌లోని ది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానాలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ విద్యార్థులకు సన్మాన సభ నిర్వహించారు. 2014 లోజరిగిన ఎస్ఎస్సి, హెచ్ఎస్సి పరీక్షల్లో ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబై ఉప మేయర్ అల్కా కేర్కర్ విచ్చేశారు. ముందుగా రాధా మోహన్ శిష్య బృందం, రాజ్యలక్ష్మి శిష్య బృందం నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. తదనంతరం సభ అధ్యక్షుడు సంకు సుధాకర్ అతిథులను సన్మానించారు. కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. హెచ్‌ఎస్‌సిలో చావేలి వెంకటసాయికి మొదటి బహుమతి, మద్దిరెడ్డి దివ్యకు రెండవ బహుమతి, కొక్కుల గౌతమికి మూడవ బహుమతిని, ఎస్ఎస్సిలో మద్దిరెడ్డి అంజలికి మొదటి బహుమతి, కె. స్థితప్రజ్ఞకి రెండవ బహుమతి, కుంటా స్మృతికి మూడవ బహుమతిని అల్కా కేర్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయిత సంగినేని రవీంద్ర, ఎం. నారాయణ, మంతెన రమేశ్, కాసిరెడ్డి, ఎ. జయశ్రీ, టి. జయశ్యామల, అనుమల్ల రమేశ్, బడుగు విశ్వనాథ్, ఎలిగేటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.