సాక్షి, ముంబై: దాదర్‌లోని ది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానాలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ విద్యార్థులకు సన్మాన సభ నిర్వహించారు. 2014 లోజరిగిన ఎస్‌ఎస్‌సి, హెచ్‌ఎస్‌సి పరీక్షల్లో ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబై ఉప మేయర్ అల్కా కేర్‌కర్ విచ్చేశారు. ముందుగా రాధా మోహన్ శిష్య బృందం, రాజ్యలక్ష్మి శిష్య బృందం నాట్య ప్రదర్శనలు ఇచ్చారు.
తదనంతరం సభ అధ్యక్షుడు సంకు సుధాకర్ అతిథులను సన్మానించారు. కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్ జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. హెచ్‌ఎస్‌సిలో చావేలి వెంకటసాయికి మొదటి బహుమతి, మద్దిరెడ్డి దివ్యకు రెండవ బహుమతి, కొక్కుల గౌతమికి మూడవ బహుమతిని, ఎస్‌ఎస్‌సిలో మద్దిరెడ్డి అంజలికి మొదటి బహుమతి, కె. స్థితప్రజ్ఞకి రెండవ బహుమతి, కుంటా స్మృతికి మూడవ బహుమతిని అల్కా కేర్‌కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయిత సంగినేని రవీంద్ర, ఎం. నారాయణ, మంతెన రమేశ్, కాసిరెడ్డి, ఎ. జయశ్రీ, టి. జయశ్యామల, అనుమల్ల రమేశ్, బడుగు విశ్వనాథ్, ఎలిగేటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ విద్యార్థులకు సన్మానం
Published Sun, Nov 16 2014 10:05 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement