The best teachers
-
ఉత్తమ అధ్యాపకులు
యూనివర్సిటీక్యాంపస్: జిల్లాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 11 మంది అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ టీచర్స అవార్డులు ప్రకటించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో చేసిన సేవలకు ఈ అవార్డులను అందజేస్తోంది. అవార్డు పొందిన వారిలో ఎస్వీయూ ప్రొఫెసర్లు పీ.ఆదినారాయణరెడ్డి(అడల్ట్ ఎడ్యుకేషన్), జీ.స్టాన్లీజయకుమార్ (సోషియాలజీ), ఎం.భాస్కర్(జువాలజీ), శ్రీపద్మావతి మహిళా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు టీ.భారతి (ఇంగ్లిషు), జి.సావిత్రి (సిరికల్చర్), వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు సీహెచ్ శ్రీలత(వెటర్నరీ పాథాలజీ), టీ.మాధవరావు (అసోసియేట్ డీన్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్), ఓ.సుధాకర్(ఫిషరీ ఇంజనీరింగ్), స్విమ్స్‌కు చెందిన అధ్యాపకులు డీ.రాజశేఖర్ (కార్డియాలజీ), ఎ.ఉమామహేశ్వరి (బయో టెక్నాలజీ), ద్రవిడ యూనివ ర్సిటీకి చెందిన పీ.సుబ్బాచారి ఉన్నారు. శ్రీహరిరెడ్డికి బెస్ట్ టీచర్ అవార్డు యూనివర్సిటీ క్యాంపస్: చవటగుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎన్.శ్రీహరిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్టీచర్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర కళాశాల విద్య కమిషనర్ ఆర్పీ సిషోడియా జీవోనెం.431 విడుదల చేశారు. రాష్ట్రంలోని 14 మంది జూనియర్ లెక్చరర్లకు బెస్ట్ టీచర్ అవార్డును ప్రకటించగా చిత్తూరు జిల్లా నుంచి శ్రీహరిరెడ్డి ఈ వార్డుకు ఎంపికయ్యారు. ఈయన సెప్టెంబర్ 5న ఈ అవార్డును అందుకుంటారు. 31టిపిఎల్261-21110007ః టి.ఆదినారాయణరెడ్డి( ఎస్వీయూ) 262ఃస్టాన్లీజయకుమార్ (ఎస్వీయూ) 263ః ఎం.భాస్కర్ (ఎస్వీయూ) -
మాస్టర్ ...
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్దరి ఎంపిక 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉత్తమ బోధన.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు జిల్లా నుంచి ఇద్దరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యూరు. ఒకరు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎండీ రాజ్‌మహ్మద్ కాగా, మరొకరు తొర్రూరు మండలం మాటేడు పీఎస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న పరాంకుశం రఘునారాయణ. వీరిద్దరు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. - విద్యారణ్యపురి నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన పరాంకుశం రఘునారాయణ 1984లో ఎస్జీటీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. నాటి నుంచి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. విద్యబోధనతోపాటు సామాజిక సేవలోనూ ఈయన ముందుంటున్నారు. అంతర్జిల్లా బదిలీల్లో పాలకుర్తితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. 2013లో తొర్రూరు మండలం మాటేడు యూపీఎస్‌లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా నియమితులయ్యూరు. పాఠశాలల్లో వసతుల కోసం కృషి వివిధ స్వచ్ఛంద సంస్థల సహాకారంతో పాఠశాలలో ఫర్నీచర్ ఇతర పరికరాలను రఘునారాయణ సేకరించారు. నోటు పుస్తకాలు, టై బెల్టులు నగదు, వస్తు రూపేణ బహుమతులు ఇచ్చే వారిని ప్రోత్సహించేవారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఇంటింటి ప్రచారం చేసేవారు. ఉపాధ్యాయులతో ప్రభావవంతంగా విద్యాబోధన చే రుుంచేవారు. పాఠశాలల్లో మొక్కలను నాటించారు. బడితోటకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రచయితగానూ ముద్ర.. బాలరంజని గేయమాలిక రచించటంతోపాటు ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు కూడా చేశారు. పలు దిన,వార,మాసపత్రికల్లో వ్యాసాలు, 50 కవితలు రాశారు. తెలుగు ప్రపంచ సభలకూ ప్రతినిధిగా వెళ్లారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుండేవారు. 2007లో జిల్లాస్థాయిలో, 2008లో రాష్ర్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో డైమండ బెస్టిజిన్ అవార్డు అందుకున్నారు. భద్రాచంలో సర్వేపెల్లి వాలంటరీ ఆర్గనైజేషన్‌ద్వారా సర్వేపెల్లి పురస్కారం, సాహిత్యసంస్కృతిక అకాడమీ ద్వారా గురజాడ అవార్డు అందుకున్నారు. అంకితభావం రఘునారాయణ ఆస్తి మరింతగా బాధ్యత పెరిగింది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటంతో నా బాధ్యత మరింత పెరిగింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మరింత గా శ్రమిస్తాను. విద్యార్థుల్లోనూ సామాజిక స్పృహ అలవర్చేలా ప్రయత్నిస్తాను. నేను అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం ఆనందంగా ఉంది. అవార్డు కింద వచ్చే రూ. 50 వేలను మాటేడు ప్రాధమిక పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం వినియోగిస్తా. - రఘునారాయణ -
ఆ మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయులు లేరా?
మోర్తాడ్: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున పురస్కారాలు అందించడం ఆనవాయితీ. అయితే ఈ అవార్డుల ప్రదానం కోసం సరైన కమిటీ లేక పోవడం, ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఎవరికి వారు దరఖాస్తు చేసుకుని పైరవీలు చేయడంతో అవార్డుల ప్రదానం అభాసుపాలవుతోంది. జిల్లాలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా విద్యాశాఖ తరపున సత్కరించారు. అయితే ఇందులో 14 మండలాల నుంచి ఉపాధ్యాయులకు చోటు దక్కకుండా పోయింది. జిల్లాలోని 36 మండలాలకు గాను 22 మండలాల్లోని ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం లభిం చింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సరైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించడంలేదు. మం డల స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారితో సమావేశం నిర్వహిం చి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన వారు జిల్లా స్థాయి పురస్కారం కోసం దరఖాస్తు చేసుకుని తమ పలుకుబడిని ప్రయోగిస్తేనే ఉత్తమ పురస్కారం లభిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం కోసం అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపక పోవడంతో అలాంటి వారికి అవార్డు లభించే అవకాశం లేదు. ప్రత్యేకంగా కమిటీ ఉంటే కమిటీ సభ్యులు ఉత్తమ ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి అవార్డుకు ప్రతిపాదిస్తే అర్హులకు పురస్కారం దక్కే అవకాశం ఉంది. కమిటీ అంటూ ఏమి లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల కనుసన్నుల్లో ఉత్తముల ఎంపిక జరగడం కొంత వివాదాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కమిటీని ఏర్పాటు చేసి పారదర్శకంగా నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. జిల్లాలోని లింగంపేట్, నిజామాబాద్, ధర్పల్లి, నిజాంసాగర్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బోధన్, ఎడపల్లి, బాల్కొండ, మాక్లూర్, బాన్సువాడ, డిచ్పల్లి, తాడ్వాయి, వేల్పూర్, సదాశివ్‌నగర్, భీమ్‌గల్, నం దిపేట్, కోటగిరి, రెంజల్, నవీపేట్, గాంధారి, కామారెడ్డి మండలాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, మాచారెడ్డి, భిక్కనూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, పిట్లం, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, వర్ని, నాగిరెడ్డిపేట్ మండలాల ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం అవార్డు లభించలేదు.