మోర్తాడ్: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున పురస్కారాలు అందించడం ఆనవాయితీ. అయితే ఈ అవార్డుల ప్రదానం కోసం సరైన కమిటీ లేక పోవడం, ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఎవరికి వారు దరఖాస్తు చేసుకుని పైరవీలు చేయడంతో అవార్డుల ప్రదానం అభాసుపాలవుతోంది. జిల్లాలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవంలో జిల్లా విద్యాశాఖ తరపున సత్కరించారు.
అయితే ఇందులో 14 మండలాల నుంచి ఉపాధ్యాయులకు చోటు దక్కకుండా పోయింది. జిల్లాలోని 36 మండలాలకు గాను 22 మండలాల్లోని ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం లభిం చింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సరైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించడంలేదు. మం డల స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారితో సమావేశం నిర్వహిం చి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు.
మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన వారు జిల్లా స్థాయి పురస్కారం కోసం దరఖాస్తు చేసుకుని తమ పలుకుబడిని ప్రయోగిస్తేనే ఉత్తమ పురస్కారం లభిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం కోసం అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపక పోవడంతో అలాంటి వారికి అవార్డు లభించే అవకాశం లేదు. ప్రత్యేకంగా కమిటీ ఉంటే కమిటీ సభ్యులు ఉత్తమ ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి అవార్డుకు ప్రతిపాదిస్తే అర్హులకు పురస్కారం దక్కే అవకాశం ఉంది. కమిటీ అంటూ ఏమి లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల కనుసన్నుల్లో ఉత్తముల ఎంపిక జరగడం కొంత వివాదాలకు దారి తీస్తోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కమిటీని ఏర్పాటు చేసి పారదర్శకంగా నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. జిల్లాలోని లింగంపేట్, నిజామాబాద్, ధర్పల్లి, నిజాంసాగర్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బోధన్, ఎడపల్లి, బాల్కొండ, మాక్లూర్, బాన్సువాడ, డిచ్‌పల్లి, తాడ్వాయి, వేల్పూర్, సదాశివ్‌నగర్, భీమ్‌గల్, నం దిపేట్, కోటగిరి, రెంజల్, నవీపేట్, గాంధారి, కామారెడ్డి మండలాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. మోర్తాడ్, కమ్మర్‌పల్లి, సిరికొండ, మాచారెడ్డి, భిక్కనూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, పిట్లం, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, వర్ని, నాగిరెడ్డిపేట్ మండలాల ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం అవార్డు లభించలేదు.
ఆ మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయులు లేరా?
Published Sun, Sep 7 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement