యూనివర్సిటీక్యాంపస్: జిల్లాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 11 మంది అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ టీచర్‌స అవార్డులు ప్రకటించింది. సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో చేసిన సేవలకు ఈ అవార్డులను అందజేస్తోంది. అవార్డు పొందిన వారిలో ఎస్వీయూ ప్రొఫెసర్లు పీ.ఆదినారాయణరెడ్డి(అడల్ట్ ఎడ్యుకేషన్), జీ.స్టాన్లీజయకుమార్ (సోషియాలజీ), ఎం.భాస్కర్(జువాలజీ), శ్రీపద్మావతి మహిళా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు టీ.భారతి (ఇంగ్లిషు), జి.సావిత్రి (సిరికల్చర్), వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు సీహెచ్ శ్రీలత(వెటర్నరీ పాథాలజీ), టీ.మాధవరావు (అసోసియేట్ డీన్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్), ఓ.సుధాకర్(ఫిషరీ ఇంజనీరింగ్), స్విమ్స్‌కు చెందిన అధ్యాపకులు డీ.రాజశేఖర్ (కార్డియాలజీ), ఎ.ఉమామహేశ్వరి (బయో టెక్నాలజీ), ద్రవిడ యూనివ ర్సిటీకి చెందిన పీ.సుబ్బాచారి ఉన్నారు.
శ్రీహరిరెడ్డికి బెస్ట్ టీచర్ అవార్డు
యూనివర్సిటీ క్యాంపస్: చవటగుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎన్.శ్రీహరిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్‌టీచర్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర కళాశాల విద్య కమిషనర్ ఆర్‌పీ సిషోడియా జీవోనెం.431 విడుదల చేశారు. రాష్ట్రంలోని 14 మంది జూనియర్ లెక్చరర్లకు బెస్ట్ టీచర్ అవార్డును ప్రకటించగా చిత్తూరు జిల్లా నుంచి శ్రీహరిరెడ్డి ఈ వార్డుకు ఎంపికయ్యారు. ఈయన సెప్టెంబర్ 5న ఈ అవార్డును అందుకుంటారు.
31టిపిఎల్261-21110007ః టి.ఆదినారాయణరెడ్డి( ఎస్వీయూ)
262ఃస్టాన్లీజయకుమార్ (ఎస్వీయూ)
263ః ఎం.భాస్కర్ (ఎస్వీయూ)
ఉత్తమ అధ్యాపకులు
Published Tue, Sep 1 2015 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM
Advertisement
Advertisement