Bhadra
-
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
అప్పర్ భద్ర లెక్కలు తప్పు
సాక్షి, అమరావతి : అప్పర్ భద్రకు నీటి కేటాయింపులపై కర్ణాటక చెప్పిన మాయ లెక్కలను నమ్మి, ఆ ప్రాజెక్టుకు అనుమతులిచ్చారని, వాటిని పునఃసమీక్షించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండానే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం అధికారులు అనుమతులిచ్చారని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తుంగభద్ర ఆయకట్టుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇటీవల లేఖ రాశారు. చుక్క నీరూ కేటాయించకుండానే.. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 నీటి కేటాయింపులు చేయకున్నా, కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నట్లుగా కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కర్ణాటక ప్రభుత్వం నమ్మించింది. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనలను 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. తుంగభద్రలో ఆ మేరకు నీటి లభ్యత లేదని స్పష్టం చేసింది. కానీ.. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25 టీఎంసీలు, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర చానల్స్ ఆధునికకీరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటా నీరు 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని తెలిపింది. అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తామని, భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి.. దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. కానీ, అప్పర్ తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేసింది. అయినా, కర్ణాటక చెప్పిన తప్పుడు లెక్కలనే నమ్మిన సీడబ్ల్యూసీ దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండానే గతేడాది డిసెంబర్ 24న అప్పర్ భద్రకు హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ అనుమతులను చూపిస్తూ కర్ణాటక సర్కారు అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్ల (2018–19 ధరల ప్రకారం)తో పెట్టుబడి అనుమతి ఇవ్వాలని గత మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదన పెట్టింది. దీనికి కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించింది. ఈ అనుమతుల ఆధారంగా.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్రానికి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకపోవడాన్ని ఎత్తిచూపింది. మూడు రాష్ట్రాలకూ నష్టమే తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. కానీ 1976–77 నుంచి 2007–08 వరకూ ఏనాడూ 186.012 టీఎంసీలకు మించి ప్రవాహాలు రాలేదు. దాంతో దామాషా పద్ధతిలో కర్ణాటక, ఏపీ, తెలంగాణలకు తుంగభద్ర బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు వచ్చే ప్రవాహాలు మరింత తగ్గుతాయి. ఇది తుంగభద్ర డ్యామ్తోపాటూ కేసీ కెనాల్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి (వేదవతి)పై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని బీటీపీ (భైరవానితిప్ప ప్రాజెక్టు) మధ్యలో ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టంగా చెప్పింది. కానీ.. ఇప్పుడు అప్పర్ భద్రలో అంతర్భాగంగా ఆ రెండు జలాశయాల మధ్య వేదవతిపై మరో జలాశయం నిర్మిస్తే బీటీపీ ఆయకట్టు ఎడారిగా మారుతుంది. ఈ అంశాలన్నింటినీ విపులీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. -
నీళ్లు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదానా?
సాక్షి, అమరావతి: అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాకముందే ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడాన్ని ఆక్షేపించింది. దీన్ని తక్షణం రద్దు చేయాలని పట్టుబట్టింది. దీంతో రెండు రాష్ట్రాలతో చర్చించాకే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పనపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పష్టం చేశారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పంకజ్‌కుమార్ అధ్యక్షతన హైపవర్ కమిటీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పర్ భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 6.25 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ప్రాజెక్టు చేపట్టామని కర్ణాటక జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అంచనా వ్యయంలో 90 శాతం నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. చదవండి: ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పర్ భద్రకు నీటి కేటాయింపులే లేవని స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం 9 టీఎంసీలే కేటాయించిందని, ఆ తీర్పు ఇప్పటివరకు అమలులోకి రాలేదని గుర్తు చేశారు. అప్పర్ భద్ర వల్ల కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డిజైన్లు ఆమోదించాలి.. పోలవరం పనుల పురోగతిని హైపవర్ కమిటీకి అధికారులు వివరించారు. పెండింగ్ డిజైన్లను తక్షణమే ఆమోదించేలా డీడీఆర్పీ(డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీని ఆదేశించాలని కోరగా కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. ఎప్పటికప్పుడు నిధుల రీయింబర్స్మెంట్ ద్వారా పనులను మరింత వేగంగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్న రాష్ట్ర అధికారుల అభిప్రాయంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకీభవించారు. విభాగాల వారిగా పరిమితులు విధించకుండా అంచనా వ్యయాన్ని గంపగుత్తగా భావించి నిధులు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులు కోరారు. డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించిన సర్వే పూర్తయిందని త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. -
15 ఏళ్లు : జనాల గుండెల్లో ‘భద్ర’
కొన్ని సినిమాలు టీవీల్లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం.. ఎన్నేళ్లయినా చూస్తాం. అలాంటి సినిమాల జాబితాలోకి చేరే చిత్రం ‘భద్ర’. రవితేజ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ తొలి చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి రూపంలో టాలీవుడ్‌కు మరో మాస్ డైరెక్టర్ దొరికాడని అందరూ భావించిన ఈ చిత్రం విడుదలై నేటికి పదిహేనేళ్లవుతోంది. మాస్ మహారాజ్ రవితేజలోని ఓ విభిన్న ప్రేమికుడిని బోయపాటి తనదైన స్టైల్లో వైవిధ్యంగా చూపించాడు. ప్రేమ, త్యాగం, యాక్షన్, ఎమోషన్ ఇలా డిఫరెంట్ యాంగిల్స్‌లో కనిపించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇక పాటలకు మరో ప్రధాన బలం సంగీతం. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. ‘తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా’, ‘ఏమైంది సారు ఏంటా హుషారు’, ‘ఓ మనసా’ ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మీరాజాస్మిన్ మన పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో యువత డ్రీమ్ గర్ల్‌గా మారిపోయింది. ఇక రవితేజ, అర్జున్ బజ్వాల మధ్య సీన్స్ స్నేహితులను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక ప్రకాష్ రాజ్, మురళీమోషన్, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో సినిమాకు మరింత జీవం పోశారు. దిల్ రాజ్ నిర్మాత వ్యహరించిన ఈ చిత్రాన్ని తొలుత అల్లు అర్జున్‌తో తీయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కథ నచ్చినా కొత్త దర్శకుడు అనే కారణంతో బన్ని వెనకడుగు వేశాడు. దిల్ రాజ్ సూచనతో రవితేజను హీరో ఈ సినిమా పట్టాలెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. చదవండి: దేవిశ్రీ ఫిక్స్.. ప్రకటించిన క్రేజీ డైరెక్టర్ శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు -
ఈ కథకు శ్రీనివాస్ యాప్ట్ : బోయపాటి
‘‘కథకి నప్పే హీరోతో సినిమా చేయడం నా అలవాటు. నా దగ్గర శ్రీనివాస్‌కి నప్పే కథ ఉంది కాబట్టే, నా అంతట నేను అడిగాను. ఈ కథకు భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే, కథ విన్నాక, తానే నిర్మిస్తానని, బయటి బేనర్లో వద్దని బెల్లంకొండ సురేశ్ అన్నారు. ‘భద్ర’ తరహాలో లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ ప్రేమికుడు ఎలాంటి దారిలో వెళ్లాడన్నదే కథ’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేశ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్ ద్వారా హీరోగా పరిచయం కావడం, రెండో సినిమానే బోయపాటి శ్రీనుతో చేయడం తన అదృష్టమని శ్రీనివాస్ అన్నారు. బోయపాటితో మూడు హిట్ చిత్రాలకు పని చేశానని, తమ కాంబినేషన్లో మరో హిట్ ఖాయం అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ‘అల్లుడు శీను’తో శ్రీనివాస్‌ని వినాయక్ హీరోగా నిలబెట్టారని, ఆ సినిమా విడుదలకు ముందే బోయపాటి సినిమా చేస్తాననడం ఆనందంగా ఉందని బెల్లంకొండ సురేశ్ చెప్పారు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించడం ఖాయమని బెల్లంకొండ గణేశ్ అన్నారు. నవంబరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. ఓ ప్రత్యేక పాత్రలో ప్రముఖ కథానాయిక నటించనున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: రత్నం.