Bhallaladeva
-
‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు సోదరా... నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ" అంటూ రానా ప్రభాస్‌కు విషెస్ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు. -
బాహుబలి.. మరో ప్రశ్న!
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. వీటికి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సమాధానాలు దొరుకుతాయని భావించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదు. భల్లాలదేవుడి భార్య ఎవరు? అనేది అందులో ఒకటి. భద్ర(అడివి శేష్)ను భల్లాలదేవ కుమారుడిగా మొదటి భాగంలో చూపించారు. దేవసేనను భల్లాలదేవ చెర నుంచి విడిపించే సమయంలో భద్రను చంపుతాడు మహేంద్ర బాహుబలి(శివుడు). అయితే బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరో చూపిస్తారని ఆశించిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. భద్ర తల్లి ఎవరనే ప్రశ్నకు భల్లాలదేవ(దగ్గుబాటి రానా) సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘ సరోగసి(అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని, అతడికి తల్లి లేద’ని సరదాగా జవాబిచ్చాడు. మొత్తానికి భల్లాలదేవ ప్రేక్షకుల అనుమానాన్ని నివృత్తి చేశాడు. ప్రేక్షకుల ప్రశ్నల మాటెలావున్నా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ హవా కొనసాగుతోంది. రెండో వారంలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. -
రానా చెప్పిన షాకింగ్ నిజం.. వైరల్!
గతవారం విడుదలైన ‘బాహుబలి-2’ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో ‘బాహుబలి’గా కనిపించిన ప్రభాస్‌కు ఎంతైతే పాపులారిటీ వచ్చిందో.. విలన్ ‘భల్లాల దేవ’గా కనిపించిన రానాకు కూడా అంతే ప్రశంసలు దక్కుతున్నాయి. కండలు తిరిగిన భారీ దేహంతో బాహుబలికి దీటైన విలన్‌గా రానా మెప్పించాడు. ఈ నేపథ్యంలో రానా చెప్పిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అది సినిమా గురించి కాదు.. తన గురించే.. రానాకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఆయన కుడి కన్ను పనిచేయదు. గతంలో మంచు లక్ష్మి ‘నేనుసైతం’ టీవీ షోకు హాజరైన రానానే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో బాధితులకు ధైర్యం చెప్తూ రానా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘దేవుడు ధైర్యం ఉన్నవాళ్లకే కష్టాలు ఇస్తాడు. నీకోటి తెలుసా నాకు ఒక కన్ను లేదు. ఒక కంట్లోంచి నాకు కనిపించదు’ అని చెప్పి రానా ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాడు. రానాకు కుడి కన్ను కనిపించదన్న విషయాన్ని మంచు లక్ష్మి చెప్పగా.. ఎడమ కన్ను మూసివేస్తే తనకేమీ కనిపించదని, ప్రస్తుతమున్న కుడికన్ను ఎవరో చనిపోయిన తర్వాత తనకు దానం చేశారని చెప్పాడు. షోలో పాల్గొన్న ఇద్దరు చిన్నారులకు ధైర్యవచనాలు చెప్పి.. అండగా ఉంటానని రానా హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతోపాటు, జాతీయ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. -
బాహుబలి 2లో సమాధానం దొరకని ప్రశ్నలు
బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి సినీ జనాలను వేదిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అయితే ఈ ప్రశ్నకు బాహుబలి 2 సమాధానం ఇచ్చిన దర్శకుడు రాజమౌళి, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే బాహుబలి 2వ భాగాన్ని ముగించేశాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బాహుబలి తొలి భాగంలో శివుడు, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపాడు. అయితే రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయి భావించిన ప్రేక్షకులకు ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. రెండో భాగంలోనూ భల్లాలదేవుడి కొడుకు ప్రస్థావన ఉన్నా భార్యను మాత్రం చూపించలేదు. తొలిభాగంలో కాలకేయల నేపథ్యం వాళ్ల నాయకుడికి వివరాలను సవివరంగా చూపించిన చిత్రయూనిట్ రెండో భాగంలో కుంతల రాజ్యం మీద దాడిచేసిన పిండారీల నేపథ్యం నాయకుడిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో తొలిభాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడంటూ కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ రెండో భాగంలో కనిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. క్లైమాక్స్ మహిష్మతి మీద దండెత్తడానికి శివుడికి సైనికబలం పెద్దగా లేకపోయినా అస్లాం ఖాన్ సాయం మాత్రం తీసుకోలేదు. అంతేకాదు దేవసేనను విడిపించడానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన అంవతిక నేపథ్యం కుటుంబం లాంటి వివరాలను కూడా ఎక్కడా ప్రస్థావించలేదు. ఇప్పటికే సినిమా నిడివి పెరిగిపోవటంతో కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేశారో..? లేక అవి అంత ముఖ్యం కాదనుకున్నారోగాని..? సోషల్ మీడియాకు మాత్రం మంచి టాపిక్ ఇచ్చారు బాహుబలి టీం. -
అప్పుడు110.. ఇప్పుడు 93!
‘బాహుబలి: ద కంక్లూజన్’లో పదవీ కాంక్షతో కూడిన శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తానని దగ్గుబాటి రానా చెప్పారు. ‘బాహుబలి: ద బిగినింగ్’లో మాహిష్మతి మహారాజుగా రానా నటన, క్రూరత్వం చూసిన ప్రేక్షకులు ‘భళా.. భల్లాల దేవ’ అన్నారు. ఇప్పుడీ సీక్వెల్లో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నకు సమాధానంతో పాటు ఎక్కువగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను చూపించనున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో భల్లాల దేవ పాత్రలో యువకుడిగా రానా కనిపించనున్నారు. అందుకోసం సుమారు 15 కేజీల బరువు తగ్గడంతో పాటు మరింత ధృడంగా తయారయ్యారు. ఫొటోలో మీరు చూస్తున్న ఫిజిక్‌లోకి వచ్చేశారు. మరో ఐదు రోజులు షూటింగ్ చేస్తే ‘బాహుబలి: ద కంక్లూజన్’లో నా పార్ట్ కంప్లీట్ అవుతుందన్నారు రానా. ఈ పాత్ర కోసం బరువు ఎలా తగ్గారో రానా వివరించారిలా... ‘బాహుబలి’ షూటింగ్ ప్రారంభానికి ముందే మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అది కంటిన్యూ చేశా. దాంతో పాటు కార్డియో, వెయిట్ ట్రైనింగ్‌లలో శిక్షణ తీసుకున్నా. యువకుడిగా భల్లాల దేవ మరింత స్ట్రాంగ్‌గా, అదే సమయంలో కాస్త సన్నగా కనిపించాలి. అందుకే, బరువు తగ్గా. ఇప్పుడు నా బరువు 92-93 కేజీల మధ్య ఉంది. ‘బాహుబలి’లో 110 కేజీల భారీ దేహంతో కనిపించా. ప్రతి రెండున్నర గంటలకు ఓసారి ఆహారం తీసుకునేవాణ్ణి. న్యూట్రీషియన్ ఎప్పుడూ పక్కనే ఉండేవారు. రెగ్యులర్‌గా చెకప్స్ చేస్తూ.. రైట్ ట్రాక్‌లో ఉన్నామా? లేదా? అని చూసేవారు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువుండే ఆహారం మాత్రమే తీసుకునేవాణ్ణి. ఆయిల్ ఫుడ్‌ను అస్సలు దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. నా ఫిట్నెస్ ట్రైనర్ కునాల్ గిర్ కూడా నేను తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించేవారు. -
సీరియస్ కామెడీ!
అతని పేరు భల్లాలదేవ. పేరు పవర్‌ఫుల్‌గా ఉంది కదా.. చాలా సీరియస్ టైప్ అనుకోకండి. ఫుల్ సరదా మనిషి. రెండు ఊళ్ల మధ్య తగాదాలను తీర్చడానికి, తన ప్రేమను గెల్చుకోవడానికి అతనేం చేశాడనే కథతో రూపొందిన తమిళ చిత్రం ‘దేశింగు రాజా’. విమల్, బిందుమాధవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘భల్లాలదేవ’ పేరుతో నిర్మాత రావిపాటి సత్యనారాయణ తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఎళిల్ దర్శకుడు. ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘రీమేక్ చేయడానికి దమ్మున్న కథ ఇది. మంచి ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ చిత్రం తమిళంలో లానే తెలుగులో మంచి విజయం సాధిస్తుంది. ఇందులో హీరో పాత్ర అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, సాహిత్యం: వనమాలి, మాటలు: కృష్ణతేజ.