Bharat Thakur
-
విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన భూమిక
'యువకుడు' సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టిన హీరోయిన భూమిక చావ్లా. ఖుషీ, వాసు, ఒక్కడు, సింహాద్రి వంటి సినిమాలతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తన పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కానీ ఆ పాపులారిటీని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయారు. వరస సినిమాలు చేశారన్న మాటే కానీ కెరీర్లో డల్ అయిపోయారు. 2007లో తన యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరికి ఒక బాబు పుట్టారు. అయితే సోషల్ మీడియాలో భర్తతో కలిసి దిగిన ఫొటోలు పెట్టనందుకు, బయట పబ్లిక్‌లో ఒంటరిగా కనిపించినంత మాత్రానికే ఆమె విడాకులు తీసుకుందంటూ పుకార్లు మొదలయ్యాయి. (చదవండి: బాలయ్య సినిమాలో లేడీ విలన్?) తాజాగా ఈ వార్తలకు భూమిక చెక్ పట్టారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.., ఒకరి గురించి ఒకరం మరింత లోతుగా అర్థం చేసుకోవడమే. మన గురించి మనం ఇంకా తెలుసుకోవడమే. మనల్ని, మన జంట ప్రయాణాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలి. నిన్ను, నీ అంకితభావాన్ని, కష్టపడే మనస్తత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది" అని రాసుకొచ్చారు. ఈ పోస్టుతోనైనా ఆమె విడాకులు తీసుకుంటుందనే రూమర్లకు స్వస్తి పలకాలని ఆశిద్దాం.. (చదవండి: అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక) View this post on Instagram A journey of a thousand miles begins with a single step .... LOVE ....... and it’s love , learning , understanding , a journey of laughter and moments .... discovering more about each other And ourselves ... Thank you for Everything 🌺 ...... may God bless us and our journey together .. Proud of you and your hard work and your dedication to whatever you do in life 😊 .. 🌸💕💐 Happy Anniversary 💐🌻 A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on Oct 20, 2020 at 6:30pm PDT -
ఆత్మను, మనసును, శరీరాన్ని అనుసంధానం చేయడమే యోగా!
భరత్ ఠాకూర్, యోగా గురు యోగాలో ఎన్నో విభిన్నమైన పద్ధతులు చూస్తున్నాం. వీటి గురించి మీరేమంటారు? వేదకాలం నాటిది మన యోగా! పాశ్చాత్యులు ‘హాట్’యోగా అనేది చేస్తున్నారు. దానిని మనవారూ అనుకరిస్తున్నారు. వాళ్ల (విదేశాలు) దేశాల వాతావరణం చల్లగా ఉండటం మూలాన, శరీరాలు బిగుసుకుపోయి ఉంటాయి. దీంతో హాట్ హీటర్లు పెట్టుకొని శరీరాన్ని వేడి చేసి యోగా చేస్తారు. ఇది మనవాళ్లు క్రేజ్‌గా మొదలుపెడుతున్నారు. హఠయోగా అనే పదాన్ని హాట్ యోగాగా మార్చేశారు. ఒళ్లు కరిగించుకోవడానికి ఇష్టమొచ్చినట్టు ఎగిరితే అది యోగా అవదు. మరి యోగా అంటే ఏంటి? స్వేచ్ఛగా ఉండేవాడు యోగి. మనసులో వైరాగ్యం, భగవంతుని పట్ల ప్రేమ ఉండేవాడు యోగి. నాలుగు ఆసనాలు వేసినవాడు యోగి కాదు. ఆత్మను, మనసును, శరీరాన్ని అనుసంధానం చేయడమే యోగా! ఈ స్థితి ప్రకృతిలో మమేకం అయితేనే కలుగుతుంది. అందుకే, ప్రస్తుతం రిషీకేష్, హరిద్వార్, హిమాలయాల పర్యటనలో ఉన్నాను. గృహస్థాశ్రమంలో యోగిగా ఉండటం సాధ్యమా? సాధనకు ఎంత సమయం కేటాయిస్తారు? సాధన అనేది గంటో, రెండు గంటలకో పరిమితం కాదు. నిరంతరం యోగస్థితిలో ఉండటమే! గృహస్థాశ్రమంలో ఉంటూ పాతికేళ్లుగా నేను యోగాకే అంకితమయ్యాను. ఆర్టిస్టిక్ యోగా అనే ఆధునిక ప్రక్రియను సమాజానికి పరిచయం చేశాను. ఆర్టిస్టిక్ యోగా అంటే ఏంటి? చాలా వరకు ప్రాచీన యోగా పద్ధతులలో ‘ఇలా చేయాలి, అలా చేయకూడదు’ అనే నిబంధనలు ఉన్నాయి. ఆర్టిస్టిక్ యోగాలో ‘ఇలాగే చేయాల’నే బలవంతపు నిబంధనలు ఉండవు. ఇది ఇప్పటి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించినది. ఇది వారి వారి ఇష్టానుసారం ఉంటుంది. ఆహారనియమాలు పాటించాలనే నిబంధనలు కూడా లేవు. అతి సాధారణంగానే బాడీ ఫిట్నెస్, ఫ్లెక్స్బులిటీ, శక్తితో పాటు ఆనందస్థాయిలను పెంచుకోవచ్చు. చెడు అలవాట్లకు దూరం కావచ్చు. సంప్రదాయ యోగాకు ఆర్టిస్టిక్ యోగాకు ఉన్న తేడా ఏంటి? సంప్రదాయ యోగా పద్ధతులలో శ్వాస, ధ్యానం మీదనే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆర్టిస్టిక్ యోగా టోటల్ ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఉంటుంది. కార్డియోవాస్క్యులర్ వర్కవుట్స్‌తో పాటు శ్వాస, ధ్యానం మిశ్రమంగా ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలోని మైండ్–చైల్డ్ నిర్దుష్టభాగాలపైనా దృష్టిపెడుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. -
భూమికకు కొడుకు పుట్టాడు!
బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తినట్లే. ఇటీవలే భూమికకు ఇది అనుభవంలోకొచ్చింది. జస్ట్ రెండు వారాల క్రితమే ఆమె ఓ బాబుకి జన్మనిచ్చారు. ‘బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే.. ఆ తల్లికి జన్మనిచ్చేది ఆ బిడ్డే. బిడ్డతో పాటు ఆ తల్లీ పుట్టినట్లే’ అంటున్నారు భూమిక. భరత్ ఠాగూర్ని వివాహం చేసుకున్న తర్వాత భూమిక పెద్దగా సినిమాలు చేయలేదు. ఆ మధ్య ‘ఏప్రిల్ ఫూల్’ అనే చిత్రంలోనూ. రవిబాబు దర్శకత్వంలో ‘లడ్డూబాబు’లోనూ నటించారు. ఈ రెండూ విడుదలకు సిద్దమయ్యాయి. భూమిక తెరపై కనిపించి చానాళ్లయ్యింది కాబట్టి, ఆమె సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారని చాలామంది ఊహించారు. కానీ, సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని, గర్భవతిగా ఉన్నప్పుడే ‘ఏప్రిల్ ఫూల్’లో చేశానని భూమిక తెలిపారు. ప్రస్తుతం మాతృత్వం తాలూకు ఆనందాన్ని అనుభవిస్తున్నారామె. త్వరలో మా అబ్బాయికి నామకరణ మహోత్సవం జరపనున్నామని చెబుతూ -‘‘ప్రెగ్నెన్సీ నుంచి తల్లయిన వరకు జరిగిన ప్రయాణానికి సంబంధించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. పుట్టిన బిడ్డను చూసిన క్షణంలో నేను, భరత్ ఆనందం పట్టలేక ఏడ్చేశాం. బాబుకి ఏ పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు. జీవితంలో వచ్చిన ఈ కొత్త దశ చాలా చాలా బాగుంది’’ అని తెలిపారు.