bhasker rao
-
ఏ ఎన్నికలైనా విజయం టీఆర్ఎస్దే: మంత్రి జగదీష్
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని, ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మిర్యాలగూడలో శనివారం టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాను తెరాస కంచుకోటగా మార్చామని ఆయన తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పగటి కలలు కన్నారని విమర్శించారు. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని.. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యిందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల తీర్పుతో రాష్ట్ర ప్రజలు తెరాసవైపే ఉన్నారని తేలిపోయిందని మంత్రి అన్నారు. (సీపీ అంజనీ కుమార్‌పై విరుచుకుపడ్డ ఉత్తమ్) గతంలో నల్గొండ జిల్లాలో అనేక మంది మంత్రులుగా చేసిన జిల్లాలో అభివృద్ధి జరిగిందేమి లేదని, కేవలం తెరాస పాలనలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. సొంత ఊరిని కూడా అభివృద్ధి చేసుకోలేదని విమర్శించారు. ప్రజల కోసం అనునిత్యం తపనపడే వ్యక్తిగా ఎమ్మెల్యే భాస్కర్ రావు ముందుటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే మిర్యాలగూడ రూపురేఖలు మారుతాయన్నారు. వార్డు సభ్యులుగా అవతలి పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. సోనియా గాంధీ, మోదీ సొంత రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి జగదీష్ పేర్కొన్నారు. -
నిర్మలభక్తి.. దృఢ సంకల్పం
తమిళనాడులోని శ్రీవిల్లి వుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయన నిరంతర ం వటపత్రశాయికి మాలా కైంకర్యం చేసేవాడు. అందుకు కావలసిన తులసి వనం కోసం భూమిని దున్నుతుండగా ఒక శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను పిల్లలు లేని ఆ దంపతులు భగవత్ప్రసాదంగా భావించి గోదాదేవి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆ బాలిక చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణుని మీద అమితమైన భక్తితో ఉంటూ, స్వామికి సేవించుకుంటూ ఉండేది. తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యం చేస్తుండటం చూసి గోదాదేవి తండ్రి కట్టిన మాలలు ఆయనకు తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతినీటిలో పడిన తన ప్రతిబింబంలో తన సౌందర్యం చూసుకుంటూ తిరిగి ఆ మాలలను యథాస్థానంలో ఉంచేది. ఒకనాడు మాలలో పొడవాటి వెంట్రుక ఉండడం గమనించిన తండ్రి, చాటుగా ఉండి ఏం జరుగుతోందో చూసి నివ్వెరపాటుతో గోదాదేవిని ‘‘అమ్మా! స్వామికి సమర్పించవలసిన పూలదండను నీవు ముందర ధరించటం అపచారం’’ అంటూ మందలించాడు. నిర్మాల్యమైన ఆ మాలను స్వామికి సమర్పించడానికి మనసొప్పక ఆనాడు పూమాలలు సమర్పించలేకపోయానన్న దిగులుతో నిద్రపోయాడు. విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి కనిపించి తనకు మాలను ఎందుకు సమర్పించలేదని అడిగాడు. విష్ణుచిత్తుడు తన తనయ చేసిన అపరాధాన్ని వివరించి అందుకే మీకు మాలలను సమర్పించలేక పోయానని విన్నవించుకున్నాడు. వటపత్రశాయి చిరునవ్వుతో విష్ణుచిత్తుని చూసి ‘‘ఈ విషయంలో నీవు చింతించవద్దు. గోదాదేవి ధరించిన దండనే నేను రోజూ ఎంతో ఇష్టంతో స్వీకరిస్తున్నాను. ఇకపై ఆమె కొప్పులో ధరించని పూమాలికలు మాకు వద్దు.’’ అని చెప్పాడు. గోదాదేవి యుక్త వయస్సుకు రాగానే గోపికలు కృష్ణుని పట్ల చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు శ్రీ కృష్ణుని కోసం కాత్యాయన వ్రతమాచరించారని విన్న గోదాదేవికి మంచి మార్గం దొరికినట్లయింది. ధనుర్మాసంలో తెల్లవారు ఝామున చన్నీటి స్నానం చేసి వటపత్రశాయిని శ్రీ కృష్ణునిగాను, తనను తాను ఒక గోపాంగనగానూ భావించి రోజుకో పాశురాన్ని ద్రావిడ భాషలో రాసి కమనీయంగా పాడుతూ వటపత్రశాయికి ధూప దీప నైవేద్యాలతో కాత్యాయనీ వ్రతం చేసింది. చివరి రోజున రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని కలలో కనిపించి ‘నేను నీ పుత్రికను వివాహమాడతాను, సిద్ధంగా ఉండు’ అని చెప్పాడు. మరుసటిరోజు శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళాలతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని, విష్ణుచిత్తుని పల్లకిలో కూర్చుండబెట్టుకుని సగౌరవంగా శ్రీరంగానికి తీసుకొని వెళ్లారు. స్వామి సూచన మేరకు శ్రీరంగనాథుని అర్చావిగ్రహానికి గోదాదేవినిచ్చి వివాహం చేశారు. గోదాదేవి అందరూ చూస్తుండగా శ్రీరంగనాథుని గర్భాలయం లోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది. శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని ‘మామా’ అని సంబోధించి ఆయనకు తిరుప్పరి పట్టం, తోమాల, శఠకోపం, ఇతర సత్కారాలు చేసి సగౌరవంగా పంపాడు. నిర్మలమైన భక్తి, దృఢసంకల్పం ఉంటే సాధించరానిదేమీ ఉండదని గోదాదేవి ఇతివృత్తం మనకు చాటి చెబుతోంది. అదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆ సమయంలో రెండో ఆప్షన్ ఉండదు: సీపీ
బెంగళూరు : షాద్‌నగర్ దిశ హత్యకేసులో నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని బెంగుళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు సమర్థించారు. ‘సరైన సమయంలో సరైన చర్య’ అంటూ హైదరాబాద్ పోలీసులను ఆయన ప్రశంసించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్రిస్తే రెండవ అభిప్రాయం ఉండదని, నిందితులను చంపేయడమే సరైన పని అన్నారు. నవంబర్ 27న దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగుళూరు కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజధానిలో జరిగిన ఈ దారుణ సంఘటన ఎక్కడైనా జరగవచ్చని, ఇలాంటి ఘటనల్లో నేరస్థులను పట్టుకుని సమస్యలను పరిష్కరించడానికి పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కస్టడీ నుంచి నేరస్థులు తప్పించుకుంటే పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారని, హైదరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయం అనివార్యమని తెలిపారు. అలాగే సైబర్‌బాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కర్ణాటకలోని హుబ్బల్లి ప్రాంతానికి చెందినవారని గుర్తు చేశారు. ఒకప్పుడు తాను, సజ్జనార్ కలిసి పని చేశామని భాస్కర్ రావు ప్రస్తావించారు. చదవండి : చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్కౌంటర్ నలుగురు మృగాళ్ల కథ ముగిసింది.. -
విజిలెన్స్ ఎస్పీ లంచావతారం బట్టబయలు
ఆయన ఎక్కడా అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాల్సిన విజిలెన్స్ శాఖలో ఎస్పీ ర్యాంకులో ఉన్న అధికారి. కానీ అలాంటి వ్యక్తే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అది కూడా చిన్నా చితకా కాదు.. లక్ష రూపాయలు! నల్లగొండ విజిలెన్స్ ఎస్పీ భాస్కర్‌రావు తన ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. 12 మంది రైస్ మిల్ వ్యాపారులను ఆయన గత కొంత కాలంగా లంచం డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తాను వచ్చి ఇన్స్పెక్షన్ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందేని ఆయన తరచు డిమాండ్ చేస్తున్నట్లు మిల్లర్లు తెలిపారు. అసలే పెద్దనోట్ల రద్దుతో తమ వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే.. మద్యలో ఈ లంచాల గొడవేంటని తలపట్టుకున్న రైస్ మిల్లర్లు, చివరకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రైస్ మిల్లర్ల సంఘానికి చెందిన భద్రాద్రి అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం భాస్కర్‌రావు తన ఇంట్లో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా వలపన్నిన ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భాస్కర్‌రావు సొంత జిల్లా అయిన వరంగల్‌లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. విజిలెన్స్ శాఖలోనే.. అది కూడా ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి ఇలా పట్టుబడటం సంచలనాన్ని సృష్టించింది.