Bhavanisankar
-
నిజమైన ప్రేమంటే...
భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పి. రామ్మోహనరావు నిర్మించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తాత్కాలిక సంతోషాల కోసం అబ్బాయిలకు ఎరవేసి వారి వద్ద డబ్బులు గుంజే కొంతమంది అమ్మాయి లకు ఏ విధంగా కనువిప్పు కలిగింది? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయిమురళీ కృష్ణ, సహనిర్మాతలు: పంటా సుబ్బారావు, ఎడ్ల మల్లేష్. -
ఏడు జన్మల బంధం
జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడనివాళ్లుండరు. ఆ ఇద్దరికీ కూడా అది తొలి ప్రేమ. ఆ ప్రేమను పండించుకోవడానికి ఆ అమ్మాయీ, అబ్బాయీ ఏం చేశారు? అనే కథాంశంతో మురళి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. ఏడు జన్మల బంధం అనేది ఉపశీర్షిక. పొందూరు లక్ష్మీదేవి సమర్పణలో పొందూరు రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భవానీశంకర్, జయంతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణ్‌సాయి, నిర్మాణ నిర్వహణ: కన్నా రవి దేవరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పొందూరు సాయిమురళీ కృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు. -
ఆయిల్ దుకాణం దగ్ధం
=బీటుబజార్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఘటన =రూ.10 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు బుగ్గిపాలు =పక్కనే ఉన్న ఉల్లిగడ్డ దుకాణం కూడా దగ్ధం మట్టెవాడ, న్యూస్‌లైన్ : నగరంలోని వరంగల్ బీట్‌బజార్‌లో ఆయిల్ దుకాణం దగ్ధమైన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మట్టెవాడ ఫైర్ ఆఫీసర్ రాజులు, ఆయిల్ దుకాణం యజమాని దోమల భవానీశంకర్ కథనం ప్రకారం.. వరంగల్ బీటుబజార్లోని శ్రీరాజేశ్వరీ ఆయిల్ మర్చంట్స్ దుకాణంలో నుంచి శుక్రవారం అర్ధరాత్రి దట్టమైన పొగలు, మంటలు వస్తుండడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో మట్టెవాడ, హన్మకొండ ఫైర్ ఇంజన్లతో శనివారం తెల్లవారుజామున 5 గంటల వరకు మంటలు ఆర్పారు. ఈ ఘటన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ రాజులు తెలి పారు. ఆయిల్ దుకాణంలో రూ.10 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు, టిన్ లు ఉన్నాయని, అవన్నీ కాలిపోయినట్లు దుకాణం యజమాని భవానీ శంకర్ తెలిపారు. ఇదే దుకాణం పక్కనే ఉన్న ఉల్లిగడ్డ, ఎల్లిగ డ్డ దుకాణం కూడా మంటల్లో కాలిపోగా రూ.2 లక్షల నష్టం జరిగినట్లు దుకాణ యజమాని కోటేశ్వర్రావు తెలిపారు.