హాయిగా వెళ్లొచ్చు
భీమవరం నుంచి విజయవాడకు ఏసీ బస్ సర్వీస్
భీమవరం : భీమవరం నుంచి విజయవాడ నగరానికి ఆర్టీసీ ఏసీ బస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి గంటంపావుకు ఒక బస్సు చొప్పున నడుపుతున్నారు. ఈ బస్సులు ఆకివీడు, కలిదిండి, గుడివాడ మీదుగా విజయవాడ వెళతాయి. మెట్రో లగ్జరీ ఏసీ సర్వీస్‌గా నడుస్తున్న వీటిలో విజయవాడకు రూ.177 చొప్పున చార్జీ వసూలు చేస్తారు. భీమవ రం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 9.15, 10.30, 11.45, మధ్యాహ్నం ఒంటిగంట, 02.15, 03.45 సాయంత్రం 5, 6.15, రాత్రి 7.30, 8.45 గంటలకు బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సాయిచరణ్‌తేజ తెలిపారు. విజయవాడ నుంచి ఉదయం 6గంటలు, 7.15, 9.45, 11, 12.30, మధ్యాహ్నం 1.45, 3 గంటలు, 04.15, 5.30 గంటలకు బస్సు బయలుదేరుతుందని వివరించారు.