bhu
-
ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్న సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. ఐఐటీలో సీటు వస్తే ఆ విద్యార్థి అతను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గం ఏర్పడినట్టే. అత్యున్నత శిక్షణలో రాటు దేలే ఐఐటీ విద్యార్థులంటే విదేశీ సంస్థలకూ క్రేజే. అందుకే భారత ఐఐటీ విద్యార్థులకు విదేశాలు రాచబాట పరుస్తున్నాయి. వారికి విదేశీ సంస్థలు ఉద్యోగ, ఉన్నత విద్యాభ్యాసం అందించేందుకు పోటీ పడుతున్నాయి. తత్ఫలితంగా దేశం నుంచి మేధో వలసలో ఐఐటీ విద్యార్థులే అత్యధిక శాతం ఉంటున్నారు. దేశంలో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో మూడోవంతు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల ద్వారా దేశంలో అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. అక్కడ శిక్షణ పొందిన వారిని అత్యుత్తమ మానవ వనరులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు భారత ఐఐటీ విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నాయని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్‌బీఈఆర్) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలలోని 16,598 సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నిర్వహించిన పరీక్ష కోసం 1,89,744 మంది విద్యార్థులు పోటీ పడ్డారని ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఐఐటీలలో కూడా చెన్నై, ముంబై, ఖరగ్‌పూర్, ఢిల్లీ, కాన్పూర్ ఐఐటీల విద్యార్థులకు మల్టీ నేషనల్ కంపెనీలు మరింత పెద్దపీట వేస్తున్నాయని తెలిపింది. ఎన్‌బీఈఆర్ నివేదికలోని ప్రధాన అంశాలు సంక్షిప్తంగా.. ► భారత్‌లో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో 35 శాతం విదేశాలకు వెళ్లిపోతున్నారు ► ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో టాప్–1000లో నిలుస్తున్న విద్యార్థుల్లో 36 శాతం మంది విదేశాల బాట పడుతున్నారు. ► భారత ఐఐటీయన్ల ప్రధాన గమ్యస్థానం అమెరికా. విదేశాలకు వెళుతున్న ఐఐటీయన్లలో 65 శాతం అమెరికాకే వెళ్తున్నారు. వారిలో 85 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ప్రముఖ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సీఈవోల వరకు బాధ్యతలు చేపడుతున్నారు. ► ప్రపంచంలో 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాలు జారీ చేస్తోంది. వారిలో భారత ఐఐటీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారు. ► భారత ఐఐటీ అంటే విదేశీ సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయమే (బీహెచ్‌యూ) తార్కాణం. బీహెచ్‌యూకు ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ సంస్థలోని విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్ ఏకంగా 540 శాతం పెరగడం విశేషం. -
చదువుల తల్లికి కోర్టు అండ.. అడ్మిషన్ ఫీజు అందించిన వైనం
లక్నో: ప్రతిష్టాత్మక ఐఐటీ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)కి అర్హత సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అడ్మిషన్ కోల్పోతున్నాను అంటూ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలిక సంస్కృతి రంజన్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే ఆమె జేఈఈ ఉమ్మడి పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, షెడ్యూల్డ్ కులాల విభాగంలో రెండు వేల ర్యాంకును సాధించింది. ఈ మేరకు సంస్కృతి రంజన్ హైకోర్టుకు హాజరై... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా గణితం, కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన ఐదేళ్ల కోర్సు ప్రవేశ రుసుము మొత్తం రూ 15 వేలు చెల్లించలేకపోతున్నాను. నా తండ్రి కిడ్ని వ్యాధి కారణంగా మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతోంది’’ అని తెలిపింది. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) అంతేకాక ‘‘నేను నా పరిస్థితిని వివరిస్తూ..అడ్మిషన్ గడువు తేదిని పొడిగించండి అంటూ జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీకి చాలాసార్లు లేఖ రాసినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందువల్ల నన్ను కాలేజీలో చేర్చుకునేలా విశ్వవిద్యాలయానికి, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సీట్ల కేటాయింపు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వాలి" అని పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన దినేష్ కుమార్ సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ యూనివర్సిటిలో మూడు రోజుల్లో రిపోర్టు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అయితే ధర్మాసనం ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించడమేకాక తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా కిడ్ని మార్పిడి చేయించుకోమని సలహా సూచించింది. ఈ క్రమంలో న్యాయమూర్తి దినేశ్‌సింగ్ మాట్లాడుతూ..."అంతేకాదు మేము ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని డబ్బుని అందజేస్తాం. పైగా ఒక దళిత యువతి ఐఐటీలో ప్రవేశం పొందాలనే తన కలను సాకారం చేసుకునేందుకు తనకు న్యాయం చేయమని కోరుతూ ఈ కోర్టు ముందుకి వచ్చింది. అందువల్లే ఈ కోర్టు స్వయంగా సీటు కేటాయింపు కోసం రూ. 15,000 విరాళంగా ఇస్తోంది." అని న్యాయమూర్తి దినేశ్ సింగ్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) -
అమ్మాయిల దుస్తులపై ఆంక్షల్లేవు: బీహెచ్‌యూ
సాక్షి, న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీలో తొలి మహిళా చీఫ్ ప్రొక్టార్‌గా నియమితులైన రోయనా సింగ్ విద్యార్థినుల స్వేచ్ఛను హరించే నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. దుస్తులు, ఆల్కహాల్‌పై అమ్మాయిలకు ఎలాంటి నియంత్రణలు ఉండవని తేల్చిచెప్పారు. క్యాంపస్ మెస్‌ల్లో మాంసాహారంపై నిషేధాన్ని తోసిపుచ్చారు. ‘నేను యూరప్‌లో పుట్టా... తరచూ యూరప్, కెనడాలను సందర్శిస్తా విద్యార్థినుల వేషధారణపై నియంత్రణలు విధిస్తే నాపై నేను విధించుకున్నట్టే’ అని రోయనా సింగ్ అన్నారు. తమకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను వేసుకోలేకపోతే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేముందని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిల దుస్తులపై అబ్బాయిల కామెంట్లను నిరసిస్తూ.. అమ్మాయిలు వారికి సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే వారికి అభ్యంతరం ఎందుకని నిలదీశారు. బెనారస్ యూనివర్సిటీ ఎన్నడూ అమ్మాయిలపై నియంత్రణలు విధించలేదని, భవిష్యత్‌లోనూ విధించబోదని ఆమె పేర్కొన్నారు. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడున్న అమ్మాయిలంతా 18 ఏళ్లు పైబడిన వారేనని, వారిలో అసలు ఈ ఆలోచనలను ఎందుకు రేకెత్తించాలని అన్నారు. వర్సిటీలో ఈవ్‌టీజింగ్, రౌడీయిజం వంటి అవలక్షణాలను పారదోలేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. క్యాంపస్ అంతటా సీసీ టీవీ కెమెరాలను అమరుస్తామని చెప్పారు. -
వర్సిటీల్లో పట్టు కోల్పోతున్న బీజేపీ !
-
భూ పంపిణీయే లక్ష్యం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కొణì జర్ల: తన ఐదేళ్ల పదవి కాలంలో అర్హులైన పేద దళితులందరికీ భూమి పంపిణీ చేయాలన్నదే లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ప్రతిఫల యాత్రలో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో భూ పంపిణీలో లబ్ధిపొందిన గుబ్బగుర్తి పంచాయతీ దళితులతో చర్చించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.395 కోట్లు ఖర్చు పెట్టి 10 వేల ఎకరాల భూమి పంపిణీ చేసిందని, మరో 10 వేల ఎకరాలు సిద్ధమవుతోందని చెప్పారు. కొణిజర్ల మండలంలోనే రూ.4.46 కోట్లతో 22 మంది లబ్ధిదారులకు 65 ఎకరాల భూమి పంపిణీ జరిగిందన్నారు. ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాలలో 1(70) యాక్ట్, గోదావరి డెల్టా ప్రాంతం అధికంగా ఉండటం వల్ల భూమి దొరకడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న వారు, భూస్వాములు భూమిని అమ్మడానికి ముందుకు రావాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తే అందులో రూ.800 కోట్లను భూ పంపిణీకే కేటాయించినట్లు వివరించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్, అధికారులు, ఉద్యోగులు పిడమర్తి రవిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ శర్మ, తహసీల్దార్ జి.శ్రీలత, ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, ఆర్ఐ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.