Bhudan
-
కబ్జా చేసి.. పట్టా భూమిలో కలిపేసి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మహేశ్వరం మండలంలోని రూ.180 కోట్ల విలువ చేసే భూదాన్ భూమి మాయమైంది. బోర్డు పేరున భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూమి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలో బోర్డులు నాటి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏళ్ల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భూదాన్ భూమి...మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 435లో 12.17 ఎకరాల భూమి ఉంది. 1955–58 పహాణీ ప్రకారం ఈ భూమి ఫకీర్ మహ్మద్ పేరున ఉంది. ఆయన దీనిని 3/1/1979న (ప్రొసీడింగ్ నంబరు: 1585/79 ) భూదాన్ బోర్డుకు దానం చేశారు. 1979–80 నుంచి 1985–86 వరకు భూదాన్ సమితి పేరున ఈ భూమి రికార్డుల్లో ఉంది.ఆ తర్వాత ఈ భూమిని ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఐదుగురు పేదలకు దానం చేసింది. ఆ తర్వాత ఈ భూమి పక్కనే ఉన్న ఓ పట్టాదారు ఆధీనంలోకి వెళ్లింది. సదరు రైతు ఈ భూదాన్ భూమిని తన పట్టా భూమిలో కలిపేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నాడు. నివేదికతో సరి...అసైన్‌దారుల ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మారడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పట్లో ఏపీ లోకాయుక్త సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని సుమోటో (కేసు నంబరు: 2585/2011)గా స్వీకరించింది. రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహేశ్వరం తహసీల్దార్ సదరు కబ్జాదారుకు రికార్డులు చూపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇందుకు ఆయన నిరాకరించడంతో 14/2/2012లో ఈ భూమిని తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని లోకాయుక్తకు కూడా నివేదించింది. ఈ భూమిలో హెచ్చరికల బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే కబ్జాదారు దీనిని కూలి్చవేయగా, తహసీల్దార్ ఫిర్యాదుతో మహేశ్వరం పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని స్వా«దీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరంబోకు..పట్టాగా మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610లలో 33.8 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. నిన్నమొన్నటి వరకు పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు ఇటీవల పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. 1996 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు పోరంబోకు/గైర్హాన్ సర్కారివిగా నమోదై ఉన్నాయి. 2012లో ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది. ఆ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడానేతలు రికార్డులు మాయం చేసి గుట్టుగా వీటిని కాజేశారు. అసలు సర్వే నంబర్లకు అనేక బై నంబర్లు సృష్టించగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఏడాదిక్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ఇటీవల పట్టా భూములుగా మారడంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందగా, ఆయన విచారణకు ఆదేశించడం కొసమెరుపు. -
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్‌కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్‌రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
‘100 ఎకరాలు దానంగా ఇచ్చారు, ఆయనది గొప్ప చరిత్ర’
‘‘వెదిరె రామచంద్రా రెడ్డిగారు ఇచ్చిన మొదటి భూదానం భారతదేశానికే కొత్త అర్థం చెప్పింది. ఆయనది గొప్ప చరిత్ర. ఆయన జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతను నాపై పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డికి ధన్యవాదాలు’’ అని దర్శకుడు నీలకంఠ అన్నారు. పోచంపల్లికి చెందిన ప్రథమ భూదాత వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం తెరపైకి రానుంది. నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. అరవింద్ రెడ్డి(రామచంద్రా రెడ్డి మనవడు) సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆచార్య వినోబా బావే 127వ జయంతి సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించింది. అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘1951లో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు రామచంద్రా రెడ్డిగారు. ఆ చరిత్ర నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు. ‘‘వినోబా భావే ఆశయాలతో పని చేశారు రామచంద్రారెడ్డి.. అందుకే వినోబా భావే జయంతి సందర్భంగా నివాళులు అర్పించాం’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. 1951సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలకు జరుగుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
భూదాన్‌పోచంపల్లి : బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఓ యువకుడి దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన ఆదివారం సాయంత్రం మండల శివారులోని ఓక్‌బ్రూక్ గార్డెన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేంద్రగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి గుంటి జంగయ్య కాలనీకి చెందిన వడ్డే అనిల్(20), కర్మన్ ఘాట్‌కు చెందిన బొంగరాల అనిల్‌కుమార్(25), చిలమల శ్రీనులు స్నేహితులు. ముగ్గురు కలిసి పల్సర్ బైక్‌పై వ్యక్తిగత పని మీద పోచంపల్లి వచ్చారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తున్న క్రమంలో మండల శివారులోని ఓక్‌బ్రూక్ గార్డెన్ సమీపంలోని మూలమలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న వీరి ైబైక్ అ దుపు తప్పి సమీపంలోని చెట్ల పోదల్లోకి దూ సుకెళ్లింది. దీంతో అనిల్ ఎగిరి బండరారుుపై పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృ తిచెందాడు. బైక్ నడుపుతున్న బొంగరాల అ నిల్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా, శ్రీను స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను వెం టనే చికిత్స నిమిత్తం 108లో హైదరబాద్‌కు తరలించారు. కాగా మృతి చెందిన యువకు డు ఆటోనగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అలాగే తీవ్రంగా గాయపడిన బొంగరాల అనిల్‌కుమార్ నల్లగొండ జిల్లా చందంపేట టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడని సమాచారం. విషయం తెలుసుకొన్న ఎస్ఐ రాఘవేంద్రగౌడ్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చేనేత నేత కార్మికులకు అండగా ఉంటాం...
భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటానికి అండగా ఉంటామని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లిలో శుక్రవారం నిర్వహించిన చేనేత శంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఐదు జిల్లాల్లో చేపట్టిన చేనేత చైతన్య బస్సుయాత్ర ద్వారా లక్ష మగ్గాలు, రెండు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు సైతం చేతి వృత్తులను కాపాడుకుంటున్నాయన్నారు. చేనేత రంగానికి బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సబ్సిడీపై ముడిసరుకులు, మగ్గాలు ఇవ్వాలని.. నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వ్యవసాయం, కులవృత్తులు బతికితేనే తెలంగాణ బతుకతదనిది పేర్కొన్నారు. ఉన్నచోట బతుకుదెరువు దొరకాలని, అది కూడా ఇజ్జత్‌గా బతుకాలన్నారు. చేనేత దినోత్సవం రోజున అధికారులు, టీవీ యాంకర్లు, ప్రజాప్రతినిధులందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చేసి.. చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు జేఏసీ తరఫున కృషి చేస్తామన్నారు. ఏ ఒక్క చేనేత కార్మికుడు నిరాశ చెందొద్దని.. వారికి జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హామీలను పట్టించుకోని ప్రభుత్వం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని భావించినా.. అది జరగలేదని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2016-17బడ్జెట్లో చేనేతకు ఒక్క రూపాయి కూడ కేటాయించకపోవడం దారుణమన్నారు. చేనేత, జౌళిశాఖను వేరు చేసి.. వేర్వేరుగా కేటాయింపులు చేస్తామని, చేనేత పాలసీని ప్రకటిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు నిధులు, హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని బీజెపీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అవసరమైతే కేంద్రమంత్రి సంతోష్‌గంగ్వార్ కలిసి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. మానవాళితోనే చేనేత పుట్టిందని, పాలకులు ఎందరూ మారిన, చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జోలపట్టయినా సరే చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్‌కు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల గోస కన్పిస్తలేదని విమర్శించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలుగా ప్రజాసమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుదామంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేస్తున్నారని ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు గానీ.. చేనేత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, అనిల్‌కుమార్, తెలంగాణ చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ కూరపాటి రమేశ్, గర్ధాస్ బాలయ్య మాట్లాడారు. కార్యక్రమానికి ముందుగా ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలిండియా హ్యాండ్లూమ్‌బోర్డు సభ్యుడు కర్నాటి ధనుంజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు గూడురు నారాయణరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, తడక యాదగిరి, కల్పనాకుమారి, కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి, భారత వాసుదేవ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, కర్నాటి శ్రీనివాస్, మాచర్ల మోహన్‌రావు, గోలి యాదగిరి, గడ్డం జగన్నాధం తదితరులు పాల్గొన్నారు. -
ఇది కిరణ్ సర్కార్ భూదాన్!
అయినకాడికి పందేరం చేస్తున్న వైనం కోట్లు విలువ చేసే భూములు కారుచౌకగా అప్పగింత సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి భూదానోద్యమానికి తెర తీశారు! రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య ముసుగు, రాజీనామా లీకులతో అందరి దృష్టినీ మళ్లిస్తూ... కీలకమైన ఫైళ్లను వేగంగా క్లియుర్ చేసేస్తున్నారు. 45 రోజులుగా సచివాలయానికి రావడమే మానేసిన ఆయన, క్యాంపు కార్యాలయం నుంచే పని కానిచ్చేస్తున్నారు. గత వారం రోజులుగానైతే వందలాది ఫైళ్లను అర్ధరాత్రి దాకా మేల్కొని మరీ పరిష్కరిస్తున్నారు. ఫైళ్లు క్లియుర్ చేరుుంచుకోవటానికి ఇదే సరైన సవుయువునీ, ‘వూట్లాడుకో-పని సాధించుకో’ తరహాలో వాటి పరిష్కారం జరిగిపోతోందని సచివాలయమంతా కోడై కూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయం నుంచి వందల సంఖ్యలో ఫైళ్లు వస్తుండటంతో పలు శాఖల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. ఫైళ్లతో పాటు సంబంధిత వ్యక్తులు కూడా జీవోల జారీకి ఆయా విభాగాల వద్ద బారులు తీరుతున్నారు. నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూముల కేటాయింపుతో పాటు ఏసీబీ, విజిలెన్స్ కేసుల ఫైళ్లు కూడా ఇప్పుడు ఒక్కసారిగా జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో రెవెన్యూ విభాగంలో జీవోల జారీ కోసం పైరవీకారులు పెద్ద ఎత్తున తిష్ట వేస్తున్నారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కాదంటున్నా సరే... ఆయా ఫైళ్లకు అటు రెవెన్యూ మంత్రి, ఇటు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తున్నారు. ఈ బాగోతానికి కొన్ని ఉదాహరణలు... రూ.35 కోట్ల భూమి.. 2 కోట్లకే!: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 141లోని డి-పట్టాలకు చెందిన 32.1 ఎకరాల అసైన్డ్ భూమిని, సర్వే నంబర్ 318లోని మూడెకరాలను ఎకరం కేవలం రూ.6 లక్షల చొప్పున కారుచౌకగా సత్యనారాయణ శీతల గిడ్డంగి ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించే ఫైలుకు కిరణ్ ఆమోదం తెలిపారు. సాక్షాత్తు భూ పరిపాలన ప్రధాన కమిషనరే (సీసీఎల్ఎ) ఈ భూమికి ఎకరా రూ.40 లక్షల ధరను సిఫార్సు చేశారు. బహిరంగ మార్కెట్లోనైతే రూ.కోటిపైనే ఉంది. అలాంటి భూమిని సీసీఎల్ఏ సిఫార్సులను కూడా కాదని రూ.6 లక్షల చొప్పున రెవెన్యూ మంత్రి సిఫార్సు చేస్తే సీఎం ఆమోదం తెలిపారు. ఫైలును జీవో జారీ కోసం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు. కానీ ఆయన జీవో జారీ చేయకుండా, నిర్ణయాన్ని పున:పరిశీలించాలంటూ ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. అతి విలువైన స్థలం.. అప్పనంగా అప్పగింత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో సర్వే నెంబర్ 129/40లోని అత్యంత విలువైన 3,665 చదరపు మీటర్ల స్థలాన్ని బ్లిట్జ్ హోటల్ యాజమాన్యానికి రియల్ ఎస్టేట్ కోసం అప్పగిస్తూ రెవెన్యూ మంత్రి, కిరణ్ నిర్ణయం తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం ప్రత్యేక ఆఫీసర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఏకంగా సీసీఎల్ఎ కూడా వద్దన్నా వారు పట్టించుకోలేదు! 2007లో ఆసియా అభివృద్ధి బ్యాంకు సమావేశాల నేపథ్యంలో హోటల్ నిర్మాణానికి పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఆ సంస్థ హోటల్ నిర్మాణం చేపట్టలేదు. తర్వాత రెసిడెన్సియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి కోరగా అధికారులు తిరస్కరించారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నారాయణగూడ ప్రాంతంలో దీపక్ మహల్ స్థలంపైనా ఇలాంటి వివాదమే వస్తే యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అధికారులు స్పెషల్ లీవ్ పిటీషన్ వేసి వాదిస్తున్నారు. బ్లిట్జ్కూ దాన్నే వర్తింపజేయాలని అధికారులు పేర్కొన్నా బడా బాబులు పట్టించుకోకుండా జీవో జారీ చేయించారు! విశాఖలోనూ... విశాఖపట్నంజిల్లా చినగదిలి మండలం కూర్మన్నపాలెం గ్రామంలోని 20 ఎకరాల అత్యంత విలువైన జాగీర్దారీ భూమిని ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఫైలుకూ కిరణ్ ఆమోదం తెలిపారు. ఇందుకు ఓ మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. జీవో జారీకి ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఇటీవలే నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఎస్ఎఫ్ఆర్ రిసార్ట్స్ సంస్థకు 431 ఎకరాల్ని అక్రవుంగా అన్ని నియువూలనుంచి మినహాయింపు ఇవ్వడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన జీవో జారీ అయ్యాక ఆ జీవోను రద్దు చేయమని కలెక్టర్, సీసీఎల్ఎ, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి కోరినా రెవెన్యూ మంత్రి, సీఎం తిరస్కరించారు. సోదరుడా... మజాకా! బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ అధీనంలోని 2.38 ఎకరాల కాందిశీకుల భూమిని జి.శ్రీనివాస్, కె.ప్రతాపరెడ్డి అనే వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. విచిత్రమేమిటంటే ఇందుకు సంబంధించిన ఫైలును అధికారులంతా తిరస్కరించడంతో కిరణ్ కూడా తొలుత తిరస్కరించారు. ఆ మేరకు జీవో కూడా జారీ అయింది. కానీ సీఎం సోదరుని ఒత్తిడితో ఫైలుకు మళ్లీ కదలిక వచ్చింది. ఆ ఫైలును రీ సర్క్యులేట్ చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ కు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యా యి. దాంతో ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది! తిమింగలాలకూ విముక్తి మెదక్‌లో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన (పరిశ్రమల) భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ పి.రామ్‌గోపాల్‌కు విచారణ నుంచి విముక్తి కల్పిస్తూ కిరణ్ నిర్ణయం తీసుకున్నారు! రామ్‌గోపాల్ ఏకంగా రూ.11 లక్షల లంచం తీసుకుంటూ 2008లో ఏసీబీకి అడ్డంగా దొరికారు. ఆయనను అరెస్టు చేయడంతో పాటు సస్పెండ్ చేశారు. కానీ ఒక ఎమ్మెల్యే పైరవీతో ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇస్తూ, కేవలం శాఖాపరమైన విచారణతో సరిపుచ్చడానికి కిరణ్ అనుమతించారు. వారం రోజులుగా ఇలాంటి మరెన్నో కేసులకు సంబంధించిన పలు ఫైళ్లను ఆయన ‘క్లియర్’ చేశారు.