భూదాన్‌పోచంపల్లి : బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఓ యువకుడి దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన ఆదివారం సాయంత్రం మండల శివారులోని ఓక్‌బ్రూక్ గార్డెన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాఘవేంద్రగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి గుంటి జంగయ్య కాలనీకి చెందిన వడ్డే అనిల్(20), కర్మన్ ఘాట్‌కు చెందిన బొంగరాల అనిల్‌కుమార్(25), చిలమల శ్రీనులు స్నేహితులు. ముగ్గురు కలిసి పల్సర్ బైక్‌పై వ్యక్తిగత పని మీద పోచంపల్లి వచ్చారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తున్న క్రమంలో మండల శివారులోని ఓక్‌బ్రూక్ గార్డెన్ సమీపంలోని మూలమలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న వీరి ైబైక్ అ దుపు తప్పి సమీపంలోని చెట్ల పోదల్లోకి దూ సుకెళ్లింది.
దీంతో అనిల్ ఎగిరి బండరారుుపై పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృ తిచెందాడు. బైక్ నడుపుతున్న బొంగరాల అ నిల్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా, శ్రీను స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను వెం టనే చికిత్స నిమిత్తం 108లో హైదరబాద్‌కు తరలించారు. కాగా మృతి చెందిన యువకు డు ఆటోనగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అలాగే తీవ్రంగా గాయపడిన బొంగరాల అనిల్‌కుమార్ నల్లగొండ జిల్లా చందంపేట టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడని సమాచారం. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ రాఘవేంద్రగౌడ్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Published Mon, Dec 12 2016 3:54 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement