దొంగ అరెస్టు 30 తులాల బంగారం రికవరి
ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి నుంచి బంగారు నగలు కాజేసిన కేసులో ఆటో డ్రైవరే నిందితుడని తేలింది. గత నెల చివరి వారంలో నగరంలోని ఎల్బీనగర్ సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆటోడ్రైవర్ భూజ్యనే దొంగగా నిర్ధరించారు. సోమవారం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 30 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకొని ఆటో సీజ్ చేశారు.