BIAL
-
భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్
లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియా బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఢిల్లీ కోర్టుని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరుఫు లాయర్ సిసోడియా భార్యకు అస్వస్థతని, కొడుకు విదేశాల్లో ఉన్నాడని అందువల్ల ఆయనే తన భార్యను చూసుకోవాల్సి ఉందని కోర్టుకి తెలిపారు. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అతని బెయిల్‌ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అతను ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నాడని కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభావితం చేయగలడంటూ బెయిల్ నిరాకరించింది సీబీఐ. ఐతే సిసోడియా సీబీఐ దర్యాప్తుకు తాను సహకరిస్తానని, సోదాల్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి నేరారోపణలు లేవని సిసోడియా తరుఫు లాయర్ వాదించారు. ఇకపై అతనికి కస్టడీ అవసరం లేదని ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తరుఫు న్యాయవాది చెప్పారు. కానీ సీబీఐ మాత్రం సాక్షులను ప్రభావితం చేయగలడని, దర్యాప్తును అడ్డుకోగలడని వాదిస్తోంది. ఐతే సిసోడియ న్యాయవాది మాత్రం ఆయనపై ఆరోపించిన నేరాలకు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్షే పడుతుందని, ఇకపై ఎలాంటి జైలు శిక్ష విధించడం సమర్థనీయం కాదని కోర్టుకి విన్నవించారు. సిసోడియా 18 పోర్ట్‌ఫోలియాలను కలిగి ఉన్నాడని, అతను ఉపయోగించిన ఫోన్లు, కీలకమైన ఫైళ్లను అతను ధ్వంసం చేశాడని, ఇదేమి తెలిసీ తెలియకుండా చేసిన పని కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందేనని నొక్కి చెబుతోంది సీబీఐ. అలాగే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకు 60 రోజులు సమయం పడుతుందని, ఆయన బయటకు వస్తే దర్యాప్తు పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. (చదవండి: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..) -
ముఖమే బోర్డింగ్ పాస్!
త్వరలోనే బెంగళూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా మారనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా 2019 ప్రథమార్ధంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ని ప్రారంభించనున్నారు. ముందుగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోనున్నారు. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలవనుంది. ఈ సాంకేతికత అమలు ఒప్పందంపై పోర్చుగల్‌లోని లిస్బన్లో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘ఎయిర్‌పోర్ట్‌లో క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది సాయపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు పేపర్‌రహిత విధానం అమలే లక్ష్యంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌పాస్, పాస్‌పోర్టు, వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం ఉండదు. -
బెంగళూరు ఎయిర్‌పోర్టుకు జీవీకే గుడ్‌బై
♦ మిగిలిన 10 శాతం వాటా విక్రయం ♦ ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా 48 శాతానికి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (బీఐఏఎల్) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. బీఐఏఎల్‌లో జీవీకే వద్ద మిగిలిన 10 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు రూ.1,290 కోట్లకు విక్రయించనున్నట్టు తెలిపింది. 2017 జూలై ప్రారంభంలో ఈ లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉందని జీవీకే వెల్లడించింది. డీల్ పూర్తి కాగానే కంపెనీ బోర్డు నుంచి కో–చైర్మన్ జీవీకే రెడ్డి, ఎండీ సంజయ్ రెడ్డి తప్పుకోనున్నట్టు సమాచారం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకోవడానికి ఉపయోగించనుంది. బీఐఏఎల్‌లో 33% వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియాకు రూ.2,202 కోట్లకు విక్రయించేందుకు 2016 మార్చిలో జీవీకే ఒప్పందం కుదుర్చుకుంది. 2017 మార్చిలో ఈ డీల్ పూర్తి అయింది. అలాగే బీఐఏఎల్‌లో ఫ్లూగఫెన్ జూరిచ్ ఏజీ నుంచి 5 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ కైవసం చేసుకుంది కూడా. దీంతో కంపెనీలో ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా 38 శాతానికి చేరింది. శుక్రవారం నాటి డీల్‌తో ఈ వాటా కాస్తా 48 శాతానికి ఎగసింది. ఎయిర్‌పోర్ట్స్ రంగంపైనే..: బెంగళూరు ప్రాజెక్టు నుంచి తప్పుకున్నప్పటికీ, ఎయిర్‌పోర్ట్స్ రంగం తమ సంస్థకు కీలకమని జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తదుపరి దృష్టి ముంబై, నవీ ముంబై ఎయిర్‌పోర్టులపై ఉంటుందని చెప్పారు. ఈ రంగంలో ప్రైవేటీకరణ అవకాశాలపై ఫోకస్ చేస్తామన్నారు. కాగా, 2009 నవంబర్‌లో బీఐఏఎల్‌లో 12 శాతం వాటాను జూరిచ్ ఎయిర్‌పోర్టు నుంచి జీవీకే దక్కించుకుంది. అలాగే లార్సెన్ అండ్ టూబ్రో నుంచి 17 శాతం కొనుగోలు చేసింది. సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్ నుంచి కైవసం చేసుకున్న వాటాతో బీఐఏఎల్‌లో జీవీకే వాటా 43 శాతానికి చేరింది. ప్రస్తుతం బీఐఏఎల్‌లో అతి పెద్ద వాటాదారుగా ఫెయిర్‌ఫ్యాక్స్ నిలిచింది. బీఎస్ఈలో శుక్రవారం జీవీకే ఇన్ఫ్రా షేరు ధర 14.45% పెరిగి రూ.5.94 వద్ద క్లోజయ్యింది. -
కింగ్‌ఫిషర్, మాల్యాపై ఎఫ్ఐఆర్
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యాపై క్రిమినల్ అభియోగాల కింద బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్), ప్యాసింజర్ సర్వీసు ఫీజులు (పీఎస్ఎఫ్) చెల్లించనందుకు గాను బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ కమల్‌పంత్ తెలిపారు. బీఐఏఎల్ ఈ విషయంపై ఈ నెల 21న మేజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేయగా, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీఐఏఎల్ పోలీస్ స్టేషన్ ఈ మేరకు చర్య తీసుకున్నట్లు వివరించారు. సంస్థ వర్గాల ప్రకారం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సుమారు రూ. 208 కోట్లు బకాయిపడింది. మరోవైపు, బీఐఏఎల్ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు కాపీలు తమకి అందలేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాతృసంస్థ యూబీ గ్రూప్ తెలిపింది. ఒకవేళ దర్యాప్తు ప్రారంభమైన పక్షంలో విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని యూబీ గ్రూప్ ప్రతినిధి చె ప్పారు.