Big Bazaar stores
-
తేలని వివాదం.. బిగ్‌బజార్‌ని స్వాధీనం చేసుకోనున్న రిలయన్స్
దేశంలోనే అతి పెద్ద వివాస్పద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్ గ్రూప్ అమ్మకం. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడులు ఉండగా.. దాన్ని రిలయన్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం వివాస్పదం కావడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లలో ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 2.3 బిలియన్ డాలర్లకు ఫ్యూచర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్ గ్రూప్‌కి 1700 అవుట్‌లెట్స్ ఉన్నాయి. సుదీర్ఘ విచారణ జరిగినా కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఫ్యూచర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న అవుట్‌లెట్స్ లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు రెండేళ్లుగా ఫ్యూచర్ ఆధీనంలో ఉన్న బిగ్‌బజార్ తదితర అవుట్లెట్ల వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఫ్యూచర్ ఆధీనంలోని 1700 అవుట్లెట్లలో ఓ 200 అవుట్లెట్లను రిలయన్స్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. వాటిని పాత పేరుతో లేదా రిలయన్స్ బ్రాండ్ కిందకు తీసుకువచ్చి వ్యాపారం పునరుద్ధరించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించారు. అయితే ప్రస్తుత వ్యహారంపై రిలయన్స్, ఫ్యూచర్, అమెజాన్లు అధికారికంగా స్పందించలేదు. తాజా అప్డేట్స్ను ముందుగా రాయిటర్స్ ప్రచురించగా ఆ తర్వాత జాతీయ మీడియాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఫ్యూచర్ వివాదానికి సంబంధించి 2022 మార్చిలో న్యాయస్థానాల్లో మరోసారి విచారణ జరగనుంది. -
బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..!
కోవిడ్-19 రాకతో భారత్‌లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. ఈ సేవలను అందించడంలో బిగ్ బాస్కెట్, ఇన్‌స్టామార్ట్, బ్లిన్క్ఇట్(గ్రోఫర్స్), జియో మార్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీ సేవలను అందించడంలో ఫ్యుచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ బిగ్ బజార్ భారీ ప్రణాళికలను సిద్ధమైన్నట్లు సమాచారం. బెంగళూరు కంపెనీతో భాగస్వామ్యం..! బిగ్ బజార్ ఆయా నగరాల్లో రెండు గంటల్లో కస్టమర్లకు గ్రాసరీ సేవలను అందిస్తోంది. మరింత వేగవంతమైన ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందించేందుకుగాను బెంగళూరుకు చెందిన ఈవెంట్ మార్కెటింగ్ టెక్నాలజీ స్టార్టప్ ఎర్సెస్ లైవ్ (Ercess Live)తో బిగ్ బజార్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్లోనే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం..ఎర్సెస్ లైవ్ ఆన్లైన్ గ్రాసరీ సేవల్లో భాగంగా బిగ్ బజార్‌కు స్ట్రాటిజిక్ వ్యూహాలను అందించనున్నట్లు సమాచారం. ఈ నెల జనవరిలో ఆన్లైన్ గ్రాసరీ సేవలను బిగ్ బజార్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణ భారత్‌లో తన కొత్త హోమ్ డెలివరీ సేవలను బిగ్ బజార్ ప్రారంభించనుంది. డంజోతో రిలయన్స్ భారీ డీల్..! దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అందుకోసం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవల్లో బిగ్ ప్లేయర్స్‌గా జియో మార్ట్, బిగ్ బాస్కెట్స్ ముందుస్థానంలో ఉన్నాయి. చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..! -
Big Bazaar: త్వరపడండి.! ప్రీ బుకింగ్‌తో 3 వేల గిఫ్ట్ ఓచర్
హైదరాబాద్: తమ రిటైల్ వినియోగదారుల కోసం మహాబచత్ ఆఫర్‌ను ముందే బుక్ చేసుకునే (ప్రీ–బుకింగ్) అవకాశాన్ని అందు బాటులోకి తెచ్చినట్లు బిగ్‌బజార్ ఓ ప్రకట నలో తెలిపింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు ఆటా, పప్పులు, బియ్యంపై ప్రీ–బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. బిగ్బ జార్ స్టోర్లలో గానీ, ఆన్లైన్లో, వెబ్‌సైట్‌పై గానీ, బిగ్‌బజార్ యాప్‌లో గానీ ప్రీ–బుక్ చేసుకోవచ్చని వివ రించింది. ప్రీ–బుక్ చేసుకున్న వినియోగదారులకు రూ. మూడు వేల విలువైన ఈజీవీ ( ఎలక్ట్రానిక్ గిఫ్ట్ ఓచర్) లభిస్తుందని తెలిపింది. అలాగే, ఈ ఏడాది మహాబచత్ ఆఫర్ ఆగస్ట్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించింది -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ రిటైల్!
బిగ్‌బజార్ రిటైల్ స్టోర్లను నిర్వహించే ఫ్యూచర్ రిటైల్‌లో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ వాటా కొనుగోలు చేయనున్నట్లు మార్కెట్లో అంచనాలు పెరిగాయి. కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్.. బిగ్‌బజార్ బ్రాండ్ హైపర్ మార్కెట్లతోపాటు.. గ్రాసరీ చైన్ ఈజీడే క్లబ్‌ను సైతం నిర్వహిస్తోంది. బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా గత వారం యూఎస్ డాలర్ బాండ్లపై వడ్డీ చెల్లింపులను మిస్ అయినట్లు తెలుస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉంది. కాగా.. జూన్ 30కల్లా ఫ్యూచర్ రిటైల్‌లో ప్రమోటర్లు తమ వాటాలో 75 శాతం వరకూ తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌లో వాటాను ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించే బాటలో చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఆర్ఐఎల్ వాటా కొనుగోలు అంశంపై మార్కెట్లో అంచనాలు పెరిగినట్లు ఈ సందర్భంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వాటా విక్రయం తదుపరి గ్రూప్‌లోని ఎఫ్ఎంసీజీ బిజినెస్సహా మిగిలిన వివిధ విభాగాలను బియానీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఫ్యూచర్ గ్రూప్, ఆర్ఐఎల్ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! షేర్ల జోరు ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలు చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెలువడుతున్న అంచనాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మరోసారి జోరందుకుంది. గత కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఆర్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో రూ. 2199 వరకూ ఎగసింది. ప్రస్తుతం 1.6 శాతం బలపడి రూ. 2181 వద్ద ట్రేడవుతోంది. ఇక మరోపక్క ఫ్యూచర్ రిటైల్ కౌంటర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 100 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. రుణ భారం పెరగడంతో కిశోర్ బియానీ గ్రూప్.. గతంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు తదితర అంశాలు కంపెనీ లిక్విడిటీ సమస్యలను పెంచుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఏడాది కాలాన్ని పరిగణిస్తే.. ఫ్యూచర్ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 74 శాతం పతనమై రూ. 11,000 కోట్ల దిగువకు చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రూప్ రుణభారం రూ. 12,000 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. -
బిగ్ బజార్ భారీ విస్తరణ
* దేశవ్యాప్తంగా 2015లో 12 స్టోర్లు * తెలుగు రాష్ట్రాల్లో 4 ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్లను విస్తరిస్తోంది. 2015లో కొత్తగా 12 ఔట్లెట్లను తెరుస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 స్టోర్లు రానున్నాయి. ఏప్రిల్‌కల్లా హైదరాబాద్ చందానగర్, రాజమండ్రిలో ఏర్పాటవుతున్నాయి. డిసెంబర్‌కల్లా హైదరాబాద్ టోలిచౌకి, గుంటూరు స్టోర్లు అందుబాటులోకి వస్తాయని ఫ్యూచర్ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు ముంబై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఫోన్లో తెలిపారు. స్టోర్లు 40-70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని వెల్లడించారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కస్టమర్లకు వినూత్న షాపింగ్ అనుభూతి కల్పించేందుకు స్టోర్ల డిజైనింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు. 24 నుంచి సబ్ సే సస్తా..: ఈ నెల 24-26 వరకు ‘చవకైన 3 రోజులు’ పేరుతో భారీ డిస్కౌంట్లను బిగ్ బజార్ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు ఏ ఉత్పత్తులపట్ల మక్కువ చూపుతున్నారో అధ్యయనం చేసి అందుబాటులో ఉంచుతున్నట్టు బిగ్ బజార్ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు. ఫ్యామిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్, మార్కెటింగ్ మేనేజర్ రితేష్‌తో కలిసి గురువారమిక్కడ ఆఫర్లను ప్రకటించారు. ఏటా జనవరిలో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. గతేడాది సేల్‌లో 1 కోటి మంది కస్టమర్లు షాపింగ్ చేశారని పేర్కొన్నారు.