big theft
-
జవహర్‌నగర్‌లో భారీ చోరీ
హైదరాబాద్: జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాగారం లక్ష్మీనగర్ కాలనీలోని రచ్చ సుభద్రారెడ్డి అనే మహిళ ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షల నగదు, 8 తులాల బంగారం అపహరించారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ క్రైమ్ డీసీపీ జానకి, కుషాయిగూడ ఏసీపీ రఫిక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
► రూ.4 లక్షల నగదు మాయం ► 13 సవర్ల బంగారం కూడా.. ఒంగోలు : నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధి సుందర్ నగర్లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డీఎంసీ రంగన్న ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లోని హాల్లో నిద్రిస్తుండగా ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగ బీరువాలోని రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లాడు. రంగన్న దంపతులు ముందు హాలులో నిద్రిస్తున్నారు. బాత్ రూమ్‌కు వెళ్లినప్పుడు వెనుక తలుపులు వేయటం మరిచిపోయారో ఏమోగానీ వెనుక నుంచి సులభంగా లోనికి ప్రవేశించిన దుండగుడు బెడ్రూమ్లోని దిండు కింద ఉన్న తాళాలు తీసుకొని బీరువా తెరిచాడు. బీరువాలోని బ్యాగులో కుటుంబ అవసరాలకు తెచ్చి పెట్టుకున్న నగదును అపహరించుకెళ్లాడు. నగదుతో పాటు బీరువాలోనే ఉన్న 13 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.25 వేల విలువైన వెండి వస్తువులు కూడా పట్టుకెళ్లాడు. తెల్లవారి లేచి చూసుకునే సరికి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా కూడా తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గుర్తించి ఆ సమాచారాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఇచ్చారు. దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు అతను తెచ్చుకున్న తాళాలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఎస్సైలు నాగేశ్వరరావు, సురేష్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని బీరువాపై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురంలో భారీ చోరీ
ధర్మవరం : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ధర్మవరం మండలం కేశవనగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.... స్థానికంగా నివాసముంటున్న రమేష్ ఇంట్లోకి అర్థరాత్రి దొంగలు ప్రవేశించి 75 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ. 1.65 లక్షలు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి బెడ్రూంలో నిద్రిస్తుండగా.. కిటికీలు తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు. కుమారై పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగదు, నగలు చోరికి గురికావడంతో రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్‌టీంని రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు. -
పిఠాపురంలో భారీ చోరీ
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పిఠాపురం సీతయ్యగారితోటలోని ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి బీరువాలో దాచిన రూ.51 వేల నగదు, 22 కాసుల బంగారు నగలు దోచుకెళ్లారు. బాధితులు సోమవారం ఉదయం స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.