ఒంగోలు ఎక్సైజ్‌శాఖ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగింది.
బీరువాలోని బ్యాగులో కుటుంబ అవసరాలకు తెచ్చి పెట్టుకున్న నగదును అపహరించుకెళ్లాడు. నగదుతో పాటు బీరువాలోనే ఉన్న 13 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.25 వేల విలువైన వెండి వస్తువులు కూడా పట్టుకెళ్లాడు. తెల్లవారి లేచి చూసుకునే సరికి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా కూడా తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గుర్తించి ఆ సమాచారాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఇచ్చారు. దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు అతను తెచ్చుకున్న తాళాలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఎస్సైలు నాగేశ్వరరావు, సురేష్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని బీరువాపై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.