‘ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ తప్పనిసరి’
అనంతపురం అగ్రికల్చర్ : ఎరువుల దుకాణాల్లో బయోమెట్రిక్ మిషన్లు, స్వైపింగ్ యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో పెట్టుకోవాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై నుంచి డైరెక్ట్ టు బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి వస్తుండటంతో కొత్త పద్ధతిలో ఎరువుల అమ్మకాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. మొదట ఎరువులు తర్వాత విత్తనాలు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ అమ్మకాలు ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ఎరువులు డీబీటీ పద్ధతిలో విక్రయించాల్సి ఉండటంతో బయోమెట్రిక్, స్వైపింగ్ పరికరాలు మూడు రోజుల్లోగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతు ఆధార్ నెంబర్ ఆధారంగా ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు.