Birla institute of technology and science
-
రూ.1,500 కోట్లతో బిట్స్ మేనేజ్మెంట్ స్కూల్
న్యూఢిల్లీ: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీఐటీఎస్‌ఓఎం)ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో 120 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ మొదలుకానుంది. సెంట్రల్ ముంబైలోని పోవై తాత్కాలిక క్యాంపస్‌లో బోధనా తరగతులుంటాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.60 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది 2024 నాటికి సిద్ధమవుతుందని బిట్స్ పిలానీ చాన్సలర్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. రెండేళ్ల రెసిడెన్షియల్ బిజినెస్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అందించనున్నారు. కోర్స్ ఫీజు రూ. 24 లక్షలు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్శిటీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్ ప్రొఫెసర్లతో విద్యా బోధన ఉంటుంది. ‘‘ఎం బీఏ కంటెంట్, డెలివరీ ఫార్మాట్స్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ద్వారా వ్యాపార నమూనాలు, విధానాలు ఎలా మారుతున్నాయో, కొనుగోలుదారులు అవసరాలకు తగ్గ డిజైన్స్ ఎలా పరిష్కరించబడుతున్నాయో అలాంటి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని’’ కుమార్ మంగళం పేర్కొన్నారు. -
అడ్మిషన్స్, జాబ్స్
బిట్స్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ పీహెచ్డీ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: బయలాజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్ (కెమికల్, సివిల్, సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్), ఎకనమిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఫార్మసీ, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్. క్యాంపస్‌లు: హైదరాబాద్, పిలానీ, దుబాయి, గోవా. అర్హతలు: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 18 వెబ్సైట్: www.bitsadmission.com ది ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలోని ది ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ (ఐఎల్ఐ) ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇంటర్నెట్ ఏజ్ సైబర్ లాకాలపరిమితి: మూడు మాసాలు అర్హత: ఏదైనా డిప్లొమా/డిగ్రీ (10+2తో). కంప్యూటర్, ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15 వెబ్సైట్: http://ili.ac.in/ నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ (ఎన్ఐఏ) పీజీడీఎం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) వ్యవధి: రెండేళ్లు అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి 26 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అకడమిక్ రికార్డ్, క్యాట్-2014, సీమ్యాట్ (సెప్టెంబర్ 2014, ఫిబ్రవరి 2014), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: మార్చి 31 వెబ్సైట్: http://niapune.com ఐఐటీ, కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్, సిస్టమ్స్, మార్కెటింగ్. అర్హత: 65 శాతం మార్కులతో పదో తరగతి; ఇంటర్మీడియెట్; బీటెక్/ బీఎస్సీ ఇంజనీరింగ్/ బీఆర్క్ ఉత్తీర్ణత. క్యాట్-2014లో 85 శాతం పర్సంటైల్ సాధించాలి. ఎంపిక: క్యాట్-2014, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 13 వెబ్సైట్: www.iitk.ac.in ఎన్ఐఎఫ్టీఈఎం కేంద్ర ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి త్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ (ఎన్ఎఫ్టీఈఎం) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు: బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. వ్యవధి: నాలుగేళ్లు సీట్లు: 180 అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లతోపాటు కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ కంప్యూటర్‌సైన్స్/ బయాలజీల్లో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: జేఈఈ మెయిన్-2015 ర్యాంక్ ఆధారంగా. ఎంటెక్ కోర్సులు: ఫుడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్,ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. వ్యవధి: రెండేళ్లు అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: గేట్ స్కోర్ ఆధారంగా. పీహెచ్డీ కోర్సులు: అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సెన్సైస్, బేసిక్ అండ్ అప్లైడ్ సెన్సైస్, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్/ గేట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపిక: ఇన్స్టిట్యూట్ నిర్వహించే రీసెర్చ్ ప్రవేశపరీక్ష ద్వారా. వెబ్సైట్: www.niftem.ac.in హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ జనరల్ మేనేజర్: 8 వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 45 ఏళ్లకు మించకూడదు. చీఫ్ మేనేజర్: 13 సీనియర్ మేనేజర్ (డిజైన్): 28 వయోపరిమితి: 2014 డిసెంబర్ 3 నాటికి 48 ఏళ్లకు మించరాదు. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 3 వెబ్సైట్:www.halindia.com ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1 అర్హత: జెనెటిక్స్/ బయోటెక్నాలజీలో 55 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్: 1 అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19 వెబ్సైట్: www.osmania.ac.in రైల్‌టెల్ కార్పొరేషన్ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 8 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు, ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి. వయసు: 21 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15 వెబ్సైట్: http://railtelindia.com/ -
ప్రత్యేకం.. ప్రాక్టీస్ స్కూల్స్
ప్రైవేటు రంగంలో ఇంజనీరింగ్ విద్య అంటే ఠక్కున గుర్తొచ్చేది.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - పిలానీ. హైదరాబాద్, గోవా, పిలానీ (రాజస్థాన్), దుబాయ్‌ల్లో క్యాంపస్‌లు కలిగిన బిట్స్.. ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ విద్యకు, పరిశోధనలకు పెట్టింది పేరు. బిట్స్ పిలానీ - గోవా క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీఈ (ఆనర్స్) నాలుగో ఏడాది చదువుతున్నారు హైదరాబాద్‌కు చెందిన దీపక్. తన క్యాంపస్ విశేషాలను మనతో పంచుకుంటున్నారిలా.. యాంటీ ర్యాగింగ్ అఫిడివిట్ ఇవ్వాలి మాది హైదరాబాద్. అమ్మా, నాన్న ఇద్దరూ ఉద్యోగులే. అన్నయ్య ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు. చెల్లెలు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదువుతోంది. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 92 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 94 శాతం మార్కులు వచ్చాయి. బిట్‌శాట్‌లో ర్యాంకు సాధించి బిట్స్ పిలానీ - గోవా క్యాంపస్‌లో చేరాను.క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. విద్యార్థులంతా ఇన్స్టిట్యూట్లో చేరేటప్పుడే యాంటీ ర్యాగింగ్ అఫిడివిట్ ఇవ్వాలి. విద్యార్థులందరూ చాలా స్నేహంగా ఉంటారు. క్యాంపస్ సదుపాయాలెన్నో 180 ఎకరాల్లో విస్తరించిన క్యాంపస్‌లో ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రూమ్ కేటాయిస్తారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. కామన్ రూమ్‌లో భాగంగా టీవీ, పత్రికలు, మ్యాగజైన్లు ఉంటాయి. వార్డెన్‌గా ఒక ప్రొఫెసర్‌ను నియమిస్తారు. స్టడీస్ పరంగా ఎదురయ్యే సందేహాలను వీరిని అడగొచ్చు. తరగతి గదులు, లైబ్రరీ, లేబొరేటరీలు, షాపింగ్ కాంప్లెక్స్ అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయి. క్యాంటీన్లో అన్ని రకాల టిఫిన్స్ లభిస్తాయి. భోజనం రుచికరంగా ఉంటుంది. అన్ని ఫీజులు కలుపుకుని సెమిస్టర్‌కు రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. సెమిస్టర్ పరీక్షల్లో 9.0 సీజీపీఏ సాధించినవారికి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందిస్తారు. ఇవేకాకుండా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. వినూత్న బోధన ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉన్న సమయంలో విద్యార్థులు ఎంచుకున్న ఎలెక్టివ్స్/స్పెషలైజేషన్‌ను బట్టి క్లాసులుంటాయి. ఒక్కో పీరియడ్ 50 నిమిషాలు ఉంటుంది. ఒక రోజు పీరియడ్‌లో సంబంధిత అంశంపై లెక్చర్ ఉంటే.. మరుసటి రోజు ట్యుటోరియల్.. ఆ తర్వాత రోజు ప్రాక్టికల్స్ ఉంటాయి. లెక్చర్‌లో భాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో కూడిన బోధన ఉంటుంది. ట్యుటోరియల్‌లో ముందు రోజు చెప్పిన పాఠాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో టెస్ట్-1, టెస్ట్-2, కాంప్రహెన్సివ్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (సీజీపీఏ) విధానంలో మార్కులు కేటాయిస్తారు. నేను ఇప్పటివరకు 10 పాయింట్లకు 7.5 సీజీపీఏ సాధించాను. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎడెక్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులను కూడా పూర్తి చేశాను. నైపుణ్యాలు పెంచే ప్రాక్టీస్ స్కూల్స్ సెకండియర్ వేసవి సెలవుల్లో ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామింగ్-1 (వ్యవధి రెండు నెలలు), నాలుగో ఏడాదిలో ప్రాక్టీస్ స్కూల్ ప్రోగ్రామింగ్-2 (వ్యవధి ఆరు నెలలు) చేయాలి. ప్రాక్టీస్ స్కూల్స్‌లో భాగంగా క్విజ్, డిబేట్, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వంటివి ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన తర్వాత ఎదురయ్యే వివిధ అంశాలపై వీటిల్లో శిక్షణనిస్తారు. వీటి ద్వారా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. నేను ప్రస్తుతం ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ పొంది ఇండస్ట్రీ ఆర్క్ అనే కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. ఇంజనీరింగ్‌తోపాటు హ్యుమానిటీస్ కూడా ఇంజనీరింగ్ మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. రెండో ఏడాది నుంచి ఎన్నో ఎలక్టివ్స అందుబాటులో ఉంటాయి. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో భాగంగా మూడు హ్యుమానిటీస్ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. మ్యూజిక్, పబ్లిక్ స్పీకింగ్, భగవద్గీత, సైకాలజీ, మోరల్ పొలిటికల్ కాన్సెప్ట్స్ వంటి ఎన్నో ఎలక్టివ్స్ ఉంటాయి. నేను ఫిలాసఫీ, కాంటెంపరరీ ఇండియా, మోరల్ పొలిటికల్ కాన్సెప్ట్స్, ఎసెర్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఎంచుకున్నాను. వీటివల్ల నాలో బ్రాడ్ థింకింగ్ పెరిగింది. పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకున్నాను. తెలుగు సమితిని ఏర్పాటు చేశాం క్యాంపస్‌లో వ ందకుపైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. అందరం కలిసి తెలుగు సమితిని ఏర్పాటు చేసుకున్నాం. క్యాంపస్‌లో ఉగాది, విజయదశమి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దీపావళి వంటి పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. క్యాంపస్‌లో తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మేము బాగా చేసే పండుగ.. ఉగాది. ఆ రోజు ఉగాది పచ్చడి తయారుచేసి అందరికీ పంచుతాం. వంటవాళ్లను రప్పించి, ఆంధ్రా స్పెషల్ వంటకాలను వండించి విందు చేసుకుంటాం. అకడమిక్‌తోపాటు మరెన్నో క్యాంపస్‌లో అకడమిక్‌తోపాటు కల్చరల్ యాక్టివిటీస్‌కు పెద్దపీట వేస్తారు. డ్రామా క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫొటోగ్రఫీ క్లబ్, ఆస్ట్రానమీ క్లబ్ ఉన్నాయి. ప్రతిఏటా కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్‌లను కూడా నిర్వహిస్తారు. వీటిని విద్యార్థులే ఆర్గనైజ్ చేస్తారు. నేను ఒక క్లబ్లో సభ్యుడిగా ఉన్నాను. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకున్నాను. స్టార్టప్స్‌కు ప్రోత్సాహం క్యాంపస్‌లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూరియల్ లీడర్షిప్ ఉన్నాయి. కొత్తగా స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఇక్కడ గెడైన్స్, సూచనలు, సలహాలు అందిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కోసం కంపెనీలు, పరిశ్రమలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ కోసం స్థలం కేటాయిస్తారు. ఫ్యాక్స్, ఫోన్, ప్రింటర్, లైబ్రరీ, ఇంటర్నెట్, స్కానర్, టెలికాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పిస్తారు. గేట్‌కు దరఖాస్తు చేశా వీలు దొరికినప్పుడల్లా గోవా బీచ్‌ల్లో విహరిస్తుంటాం. ఇక్కడ ఎన్నో చూడచక్కని బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేట్‌కు దరఖాస్తు చేశాను. మంచి ర్యాంకు సాధించి ఏదో ఒక ఐఐటీలో ఎంటెక్ చేస్తాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఆఫర్ వస్తే ఉద్యోగం చేయడానికి సిద్ధమే. -
వినూత్న కోర్సులతో అవకాశాలెన్నో..
కోర్స్ కార్నర్: ఆధునిక సమాజంలో అవసరాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. కాలానుగుణంగా ఎన్నో కొత్త రంగాలు తెరపైకి వస్తున్నాయి. ఆయా రంగాల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అవసరమే. అలాంటి వనరులను సమాజానికి అందించేందుకు ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లు నూతన కోర్సులను ప్రారంభిస్తున్నాయి. మూస ధోరణిలో కాకుండా అందరికంటే భిన్నంగా ఆలోచించి ఇలాంటి వినూత్న కోర్సులను ఎంచుకుంటే మెరుగైన భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు. హైదరాబాద్‌లో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న కోర్సులు.. వాటి వివరాలు.. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ అందిస్తున్న కోర్సులు: ఎంఎస్క్యూఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్-క్వాలిటీ సర్వీస్ మేనేజ్మెంట్) అర్హత: మ్యాథ మెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ జేఆర్ఎఫ్ ఇన్ క్వాలిటీ రిలియబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ అర్హత: సంబంధిత విభాగంలోఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎంఫిల్/తత్సమానం/ఎంస్టాట్స్/ఎంఎస్సీ/ఎంఏతోపాటు మ్యాథ్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్లతో మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా డిగ్రీ లేదా బీఈ/బీటెక్. పార్ట్ టైమ్ కోర్సులు (స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్) అర్హత: డిగ్రీ/డిప్లొమా ఇన్ టెక్నాలజీ లేదా మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా డిగ్రీ. నిర్దేశించిన విధంగా పని అనుభవం ఉండాలి. ప్రవేశం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ (నిర్దేశించిన కోర్సులకు) ఆధారంగా వివరాలకు: www.isihyd.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స (బిట్స్), పిలానీ-హైదరాబాద్ కోర్సు: ఎంఎస్సీ (టెక్)-ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇది మల్టిడిసిప్లినరీ కోర్సు. ఈ రంగంలో కొత్తగా మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును రూపొందించారు. ప్రవేశం: బిట్‌శాట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.bitspilani.ac.in నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా కేంద్రం.. విమానయానం, టెలికమ్యూనికేషన్, అంతరిక్ష రంగాలకు సంబంధించిన చట్టాలు, మేనేజ్మెంట్లకు సంబంధించిన కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వివరాలు.. పీజీ కోర్సులు: ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్‌సపోర్‌ట మేనేజ్మెంట్ స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ లాస్ పీజీ డిప్లొమా కోర్సులు: ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్‌సపోర్‌ట మేనేజ్మెంట్, స్పేస్ అండ్ జీఐఎస్ లాస్ అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఆ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వివరాలకు: www.nalsar.ac.in ఐఎస్బీ- హైదరాబాద్ కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ) హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు. అర్హత: ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్/తత్సమాన డిగ్రీ. నిర్దేశించిన విధంగా పని అనుభవం. ప్రవేశం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ద్వారా... వివరాలకు: www.isb.edu/cee జేఎన్టీయూ-హైదరాబాద్ జేఎన్టీయూ-హైదరాబాద్, బీఈ/బీటెక్ కోర్సులతోపాటు మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. వివరాలు.. కోర్సులు: బీటెక్+ఎంటెక్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్+ఎంబీఏ, బీటెక్ ఈసీఈ+ఎంబీఏ, బీటెక్ సీఎస్ఈ+ఎంబీఏ, ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా. వివరాలకు: www.jntuh.ac.in/ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్. ఈ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఉంది. ఇంగ్లిష్‌తోపాటు ప్రస్తుత తరుణంలో డిమాండ్ ఉన్న విదేశీ భాషలకు సంబంధించిన కోర్సులను అందించడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. వాటి వివరాలు.. బీఏ, బీసీజే, బీఈడీ(ఇంగ్లిష్), ఎంఈడీ, ఎంఏ, ఎంసీజే, మాస్టర్ ఇన్ కంప్యుటేషన్ లింగ్విస్టిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్, పీహెచ్డీ ప్రవేశం: రాత పరీక్ష ద్వారా.వివరాలకు: www.efluniversity.ac.in అకడెమిక్, పోటీ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలనైనా మాకు మెయిల్ చేయండి. సంబంధిత నిపుణులు మీకు సమాధానాలిస్తారు. మెయిల్ ఐడీ:sakshieducation@gmail.com -
బిట్‌శాట్‌లో గెలుపు ఇలా..
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా బిట్‌శాట్! దేశంలో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ విధానంలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి ఎంత పోటీ ఉంటుందో.. అంతేస్థాయి పోటీ నెలకొన్న పరీక్ష బిట్‌శాట్. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పోటీ ఏటేటాపెరుగుతోంది. బిట్‌శాట్‌ను రాసేవారిలో మన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య అధికమే. వచ్చే నెల 14 నుంచి జూన్ 1 వరకు ఆన్లైన్ విధానంలో జరగనున్న బిట్‌శాట్‌లో విజయానికి సలహాలు.. బిట్స్-పిలానీలో సీటు.. ఉజ్వల భవితకు రూటు: బిట్స్-పిలానీలో సీటు లభిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమైనట్లేననే అభిప్రాయం ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఔత్సాహిక విద్యార్థుల్లో నెలకొంది. దాంతో బిట్‌శాట్‌కు పోటీపడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది బిట్స్-పిలానీ మూడు క్యాంపస్‌లలో(పిలానీ, గోవా, హైదరాబాద్) అందుబాటులో ఉన్న రెండు వేల సీట్ల కోసం 1.36 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో మన రాష్ట్ర విద్యార్థులు 30 నుంచి 35 శాతం మధ్యలో ఉంటారని అంచనా. మన రాష్ట్ర విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పటికీ.. చివరి నిమిషంలో పొరపాట్లు చేస్తూ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంపై ముందు నుంచీ సరైన పట్టు లేకపోవడం కాగా, రెండోది.. ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెస్ట్ టెస్ట్‌లకు భిన్నంగా బిట్‌శాట్‌లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌ల నుంచి కూడా ప్రశ్నలు అడగడం. చాలామంది విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో పట్టు సాధించడంపైనేదృష్టిపెట్టి.. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌లను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే తుది జాబితాలో చోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు ఆన్లైన్ ఆధారిత పరీక్ష విధానంపై అవగాహన పొందుతూనే.. సబ్జెక్ట్‌లలోనూ రాణించాలని నిపుణులు సూచిస్తున్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే 300కుపైగా స్కోర్ వస్తేనే బిట్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం ప్రస్తుతమున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్- ప్రిపరేషన్ ఇలా: బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష. మొత్తం నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలలో.. 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బిట్‌శాట్‌లో ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ నుంచి 45 ప్రశ్నలు; ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ నుంచి 15 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. బిట్‌శాట్‌కు నిర్దిష్ట సిలబస్ నిర్దేశించారు. దాన్ని అనుసరించి ప్రిపరేషన్ సాగించాలి. ఈ సిలబస్ ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతుల స్థాయిలో ఉంటుంది. కాబట్టి మన ఇంటర్ బోర్డ్ విద్యార్థులు తమ అకడెమిక్ సిలబస్‌లో లేని.. ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. జేఈఈ-మెయిన్ పరీక్ష కూడా ముగిసింది. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు బిట్శాట్తోపాటు సమాంతరంగా ఎదుర్కోనున్న పరీక్షలు ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్డ్. వీటిని దృష్టిలో ఉంచుకుని మూడు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ముందుకుసాగాలి. జేఈఈ-అడ్వాన్స్డ్, బిట్‌శాట్ సిలబస్ దాదాపు ఒకే మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. కానీ బిట్శాట్తోపాటు ఎంసెట్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలి. మన ఇంటర్ బోర్డు సిలబస్‌ను అనుసరించి నిర్వహించే ఎంసెట్‌లో ఉన్న అంశాలు, ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా జరిగే బిట్శాట్లోని ఉమ్మడి అంశాలను ఒకే సమయంలో పూర్తి చేసుకోవాలి. బిట్‌శాట్‌లో మాత్రమే ఉన్న టాపిక్స్‌కు ప్రతిరోజూ ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను సైతం దాదాపు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాదిరిగానే మార్పులు చేశారు. కాబట్టి ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్లపై పట్టు సాధించిన వారికి బిట్‌శాట్ సిలబస్ ఏమంత కష్టం కాదు. బిట్‌శాట్‌కు మరో నెలరోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇప్పుడు కొత్త అంశాలు, లేదా చదవని చాప్టర్స్‌పై ఎక్కువ సమయం కేటాయించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమైనవని భావిస్తే.. ఏప్రిల్ నెలాఖరు నాటికి వాటిని పూర్తి చేయాలి. ఏప్రిల్ చివరి వారం నుంచి ఆన్లైన్ పరీక్ష మొదలయ్యే వరకు రివిజన్‌కు కేటాయించడం శ్రేయస్కరం. తమ ఆన్లైన్ టెస్ట్ తేదీకి కనీసం 15 రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ఆయా సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ సులభం అవుతుంది. కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి. ఫిజిక్స్‌లో.. వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి. మ్యాథమెటిక్స్‌లో.. హైపర్బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3-డి, ఇంటెగ్రల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ పూర్తి చేయాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం రెండు గంటల చొప్పున ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా అందుబాటులోని సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను పూర్తి చేసుకోవచ్చు. బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష వివరాలు: నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలతో 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే బిట్‌శాట్‌లో విభాగాలవారీగా అడిగే ప్రశ్నల సంఖ్య బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్ ముఖ్య తేదీలు: హాల్‌టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 15, 2014 నుంచి ఏప్రిల్ 30, 2014 వరకు ఆన్లైన్ టెస్ట్ తేదీలు: మే 14, 2014 నుంచి జూన్ 1, 2014 వరకు బిట్‌శాట్ ఫలితాల వెల్లడి: మే చివరి వారం బిట్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు : మే 20, 2014 నుంచి జూన్ 30, 2014 వరకు వివరాలకు వెబ్సైట్: www.bitsadmission.com ఆన్లైన్ టెస్ట్ - అనుసరించాల్సిన వ్యూహాలు ఆన్లైన్ టెస్ట్ మూడు గంటలపాటు ఎలాంటి విరామం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇప్పటినుంచే ఆ విధానానికి అలవాటుపడేలా మాక్‌టెస్ట్‌లకు హాజరు కావాలి. కనీసం అయిదు మాక్‌టెస్ట్‌లకు హాజరై, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ద్వారా ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు. ఇప్పటికే విద్యార్థులకు తమ ఆన్లైన్ టెస్ట్ సెంటర్ సమాచారం తెలిసుంటుంది. కాబట్టి ఆ సెంటర్లో ఉండే వాతావరణాన్ని పరిశీలించి.. అలాంటి పరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు సన్నద్ధత పొందేలా వ్యవహరించాలి. విద్యార్థుల మానసిక, శారీరక అంశాల కోణంలో ఈ వ్యూహం విజయానికి ఎంతో దోహదం చేస్తుంది. ఆన్లైన్ టెస్ట్ సమయంలోనూ ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలి. మూడు గంటలపాటు నిర్వహించే పరీక్షలో ప్రథమార్థంలో ఒక్కో ప్రశ్నకు కేటాయించే సమయాన్ని ఒక నిమిషానికి పరిమితం చేయాలి. బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్‌లో సెక్షన్లవారీగా ఎలాంటి సమయ నిబంధన లేదు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా బాగా అవగాహన ఉన్న ప్రశ్నలు లేదా సెక్షన్లను సాధించాలి. మిగతా విభాగాలతో పోల్చితే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లలో అంచెలవారీ (స్టెప్‌వైజ్) సొల్యూషన్స్తోనే సమాధానాలు రాబట్టే ప్రశ్నలు ఎక్కువ. కాబట్టి ఈ రెండు విభాగాలను ముందుగా ఎంపిక చేసుకోవడం మంచిది. సెక్షన్లవారీగా ఎలాంటి నిబంధన లేకున్నప్పటికీ విద్యార్థులు స్వీయ సమయ నిబంధన విధించుకోవాలి. దీన్ని ప్రిపరేషన్ దశ నుంచే అమలు చేసుకోవాలి. మొత్తం 180 నిమిషాల్లో 30 నిమిషాలు కెమిస్ట్రీకి; 20 నిమిషాలు ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్‌కు; 40 నిమిషాలు ఫిజిక్స్‌కు; 70 నిమిషాలు మ్యాథమెటిక్స్‌కు కేటాయించడం మంచిది. మిగతా 20 నిమిషాలు తాము రాసిన సమాధానాలు సరిచూసుకోవడానికి కేటాయించాలి. బిట్‌శాట్‌లో నిర్దేశిత 180 నిమిషాల్లోపు 150 ప్రశ్నలను పూర్తిచేస్తే బోనస్ కొశ్చన్స్ పేరుతో అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రశ్నలు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి నాలుగు చొప్పున ఉంటాయి. కానీ ఈ బోనస్ కొశ్చన్స్‌ను ఎంపిక చేసుకునే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒకసారి బోనస్ కొశ్చన్స్‌ను ఎంపిక చేసుకుంటే.. అప్పటికే రాసిన 150 ప్రశ్నల సమాధానాలను సరిచూసుకునే వీలుండదు. అంతేకాకుండా ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు బోనస్ కొశ్చన్స్ కంటే ముఖ్యంగా తాము రాసిన ప్రశ్నల సమాధానాలు- కచ్చితత్వం విషయంలో శ్రద్ధ చూపడం శ్రేయస్కరం. కచ్చితంగా 100 నుంచి 120 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 300 నుంచి 360 మార్కులు సొంతం చేసుకోగలుగుతారు. బిట్స్ క్యాంపస్‌లలో కటాఫ్‌ల స్థాయికి చేరుకుంటారు. కౌన్సెలింగ్ లెటర్‌ను అందుకునే అవకాశం లభిస్తుంది. కంగారు లేకుండా.. కచ్చితత్వమే ప్రధానంగా.. బిట్‌శాట్‌లో విజయంలో కీలక పాత్ర సమయ పాలన. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి కంగారు లేకుండా సమాధానాల్లో కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఉన్నాయని వందశాతం రూఢీ చేసుకున్న తర్వాతే బోనస్ ప్రశ్నలను ఎంచుకోవాలి. బిట్‌శాట్ మెరిట్ జాబితాలో నిలిచి బిట్స్ క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే పరిశోధనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా పలు సంస్థల స్పాన్సర్‌షిప్‌తో నిర్వహిస్తున్న పరిశోధనల్లోనూ అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పరిశోధనలు, పీహెచ్డీలవైపు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే ఆకర్షితులయ్యేలా చేస్తున్నాం. తద్వారా భవిష్యత్తులో సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం వేస్తున్నాం. బిట్‌శాట్‌లో మెరిట్‌తోపాటు ఆయా డిగ్రీ ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆసక్తి, అభిరుచి మేరకు కోర్సును ఎంచుకుంటే నిత్యనూతనంగా ఉండగలుగుతారు. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు, డెరైక్టర్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్ -
ఉత్సాహంగా 10కె రన్
-
బిట్‌శాట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్ పిలానీ)లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీలో చేరేందుకు బిట్‌శాట్-2014 నోటిఫికేషన్ జారీ అయింది. బీఈ, బీ ఫార్మసీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ) కోర్సుల్లో చేరేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ వీఎస్ రావు తెలిపారు. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మే 14 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఉంటుందని.. రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. మొత్తం 2,100 సీట్ల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.