birthday celebrates
-
కంగనాకు ఆ పేరైతే సరిగ్గా సరిపోయేది
కంగనా రనౌత్ అసలు పేరు వార్తలమ్మ అని పెడితే సరిపోయేది. ఒకటీ ఆమె వార్త సృష్టిస్తుంది. లేదా ఆమే వార్త అవుతుంది. ఎప్పుడూ మీడియాలో ఉన్నవాళ్లకే మార్కెట్ అని ఆమె కనిపెట్టింది. పలుచగా ఉండే శరీర స్వభావంతో ఉండే ఈ నటి బొద్దుగా ఉండే జయలలిత పాత్రను పోషించడానికి శారీరకంగా ట్రాన్స్ఫామ్ కావడం, అందుకు శ్రమ పడటం ఆమె వృత్తిగత ప్రతిభను చాటుతుంది. ఆమెను ‘న్యూసెన్స్’ అని అనేవారు కూడా ఈ టాలెంట్‌ను అంగీకరిస్తారు. కంగనా నేడు (మార్చి 23) 35వ ఏట అడుగుపెట్టనుంది. రేపు ‘తలైవి’ ట్రైలర్ కంగనా పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ‘ఈ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగి కొద్ది నెలల్లో అంత బరువూ తగ్గాను. అయితే సినిమా కోసం ఇదొక్కటే నేను ఎదుర్కొన్న సవాలు కాదు’ అని కంగనా కొన్ని సినిమా స్టిల్స్‌ను పోస్ట్ చేస్తూ వ్యాఖ్యానించింది. ఆ ఫొటోల్లో సినిమా నటిగా జయలలిత చేసిన పాత్రల్లాంటి వాటిలో కంగనా గెటప్స్ ఉన్నాయి. అచ్చు జయలలితను పోలి ఉండటంతో అటు జయలలిత అభిమానులు, ఇటు కంగనా అభిమానులు సంతోషపడుతున్నారు. కంగనా ఎంత ప్రతిభావంతురాలో వివాదాల్లో కూడా అంతే ప్రముఖురాలు. ఏదో ఒక కారణం చేత ఆమె తరచూ వార్తల్లో ఉంటుంది. ‘తలైవి’లో కంగనా రనౌత్ హృతిక్ రోషన్‌తో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత ఇతర హీరోయిన్లపై సూటిపోటి మాటలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికే వ్యాఖ్యలు... ఇవన్నీ ఆమెను న్యూస్‌లో ఉంచుతున్నాయి. అయితే న్యూస్‌లో ఉంచాల్సింది ఆమె నటనా ప్రతిభే అని ఆమె మర్చిపోతున్నట్టుంది. ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తనూ వెడ్స్ మను’, ‘క్వీన్’, ‘మణికర్ణిక’ లాంటి మంచి సినిమాల్లో ఆమె పాత్రలు వెలిగాయి. వంద కోట్ల కలెక్షన్లు సాధించడానికి హీరో అక్కర్లేదు అని నిరూపించిందామె. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలవడం సామాన్య విషయం కాదు. ఇప్పుడు నాలుగో జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లోని నటన ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కేలా చేసింది. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పద్దెనిమిదేళ్ల వయసులో డెహ్రాడూన్ నుంచి ఒంటరిగా ఢిల్లీ చేరుకుని రకరకాలుగా స్ట్రగుల్ అయి, ముంబై చేరుకుని ఒకరి అండ లేకుండా స్టార్‌గా మారిందామె. ఆమెకు రాజకీయ అభిప్రాయాలు రాజకీయ జీవితం పట్ల ఆసక్తి ఉంటే దానికి ఇంకా టైమ్ ఉందని పరిశీలకులు అనుకోవచ్చు. ఇప్పుడైతే ఆమె నుంచి ఆశిస్తున్నది గొప్ప సినిమాలే. తనలోని గొప్ప నటికి ఆమె ఎక్కువ పని చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటే వారి కోరిక సబబైనదే అనుకోవచ్చు. ‘మణికర్ణిక’లో కంగనా రనౌత్ నా అవార్డు వాళ్లది కూడా! – కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, ‘పంగా’ సినిమాల్లో నా నటనకు నేషనల్ అవార్డు వచ్చిందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. ‘మణికర్ణిక’ సినిమాను నేను డైరెక్ట్ కూడా చేశాను. జ్యూరీ మెంబర్స్‌తో పాటు చిత్రబృందం అందరికీ ధన్యవాదాలు. నా అవార్డు వీరిది కూడా. నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ అవార్డ్స్ తాజాగా ఉత్తమ నటిగా ఎంపికైన కంగనా రనౌత్ గతంలో ఉత్తమ సహాయ నటిగా (చిత్రం ‘ఫ్యాషన్’) ఒకసారి, ఉత్తమ నటిగా రెండు సార్లు (‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’) అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఆమెకిది 4వ నేషనల్ అవార్డు. ధనుష్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడం ఇది 2వ సారి. గతంలో వచ్చిన ‘ఆడుకాలమ్’కూ, ఇప్పుడు అవార్డు తెచ్చిన ‘అసురన్’కూ – రెండింటికీ దర్శకుడు వెట్రిమారన్ కావడం విశేషం. ఇక, ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కి ఇది 3వ జాతీయ అవార్డు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరంకు ఇది 2వ నేషనల్ అవార్డు. గతంలో ‘జనతా గ్యారేజ్’ (‘ప్రణామం...’ పాటకు), ఇప్పుడు ‘మహర్షి’ – ఇలా ఆయనకు జాతీయ గౌరవం తెచ్చిన రెండు చిత్రాలూ తెలుగువే కావడం విశేషం. -
ఫ్యామిలీతో చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో
మెగాస్టార్ చిరంజీవి శనివారం తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కరోనా నేపథ్యంలో బహిరంగంగా వేడుకలు నిర్వహించనప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరోకి మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొంత మంది ఫ్యాన్స్ రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాగబాబు, అల్లు అరవింద్ , కొందరు మెగా ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో కేక్ కట్ చేసి మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. (చదవండి : అన్నయ్య చేయిపట్టి పెరిగాను.. పవన్ భావోద్వేగం) ఇక చిరు బర్త్‌డేని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశారు. కరోనా వలన ఈ సారి చిరు బర్త్‌డే వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ఈ సారి తన బర్త్‌డే రోజే వినాయక చవితి కూడా రావడంతో చిరంజీవి రెండింటిని తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.(చదవండి : చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్) -
'ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం'
-
కోహ్లి భావోద్వేగ లేఖ: వాటికి సమాధానం నా దగ్గర లేదు
ఎవరి వాట్సప్ స్టేటస్లు చూసినా.. ఫేస్బుక్, ఇన్‌స్టా పేజీలు చూసినా ఒక్కటే కనిపిస్తోంది ‘హ్యాపీ బర్త్‌డే కింగ్ కోహ్లి’. టీమిండియా సారథి విరాట్ కోహ్లి మంగళవారం 31వ జన్మదిన వేడుకులు జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్ క్రీడా ప్రపంచం కోహ్లికి బర్త్‌డే విషెస్ చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటివరకు అతడు సాధించిన రికార్డులను నెమరువేసుకుంటూ.. భవిష్యత్‌లో టీమిండియాకు మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నారు. అయితే కోహ్లి తన బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ లేఖ తెగ వైరల్ అవుతోంది. ‘నా క్రికెట్ ప్రయాణం, జీవితంలో నేర్చుకున్న ఎన్నో పాఠాల గురించి పదిహేనేళ్ల కోహ్లికి వివరిస్తున్నా. మంచిగా రాయడానికి ప్రయత్నించా. చదివి చెప్పండి ఏలా ఉందో’ అంటూ కోహ్లి పేర్కొన్నాడు. ‘హాయ్ చీకు(విరాట్ కోహ్లి ముద్దు పేరు), మొదటగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్‌పై నీకు అనేక సందేహాలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ నీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పలేను. ఎందుకంటే ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ప్రతీ సర్ప్రైజ్ను ఆస్వాదించు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకో. అయితే ఈ రోజు నేను చెప్పినవి నమ్మలేకపోవచ్చు. అయితే గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఓటమి ఎదురైతే కుంగిపోకు.. ముందుకు సాగడం మర్చిపోకు.. గెలుపు సాధించేవరకు మళ్లీ మళ్లీ ప్రయత్నించు. నీ కోసం చాలా పెద్ద జీవితం వేచి చూస్తోంది. ప్రతీ ఒక్కరి జీవితంలో అభిమానించే వాళ్లు ఎంతమంది ఉంటారో విమర్శించే వాళ్లు అంతే ఉంటారు. నీ జీవితంలో కూడా అంతే. అభిమానించే వాళ్లు ఉంటారు. తిట్టే వాళ్లు ఉంటారు. అయితే ఎప్పటికీ నీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకు. ఈ రోజు మీ నాన్న ఇవ్వలేని షూస్ గురించి ఆలోచిస్తున్నావని తెలుసు. అయితే ఈ ఉదయం నీకిచ్చిన కౌగిలింత ముందు అవేమీ పనికిరావు. కొన్ని సందర్భాల్లో మీ నాన్న నీ పట్ల కఠినంగా ఉండొచ్చు. అది నీ మంచి కోసమే అని గమనించు. తల్లిదండ్రులు మనల్ని కొన్ని సార్లు అర్థం చేసుకోరని అనిపిస్తుండొచ్చు. కానీ అందరికంటే మన కుటుంబ సభ్యులే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. నువ్వు కూడా వాళ్లని అలాగే ప్రేమించి. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడుపు. మీ నాన్నని ప్రేమిస్తున్నాననే విషయాన్ని ప్రతిరోజు చెబుతుండు. చివరగా నీకు నచ్చిన, నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించు. దయా గుణంతో ఉండు. కలలు మన జీవితాల్ని ఎలా మారుస్తాయో ప్రపంచానికి చాటి చెప్పు’అంటూ కోహ్లి లేఖలో పేర్కొన్నాడు. ఇక కోహ్లి రాసిన భావోద్వేగ లేఖకు నెటిజన్లు మంత్ర ముగ్దులవుతున్నారు. ఆటతోనే కాదు మాటలతోనూ తమ మనసులను దోచుకున్నావని కామెంట్ చేస్తున్నారు. ఇక కోహ్లి బర్త్‌డే సందర్భంగా అతడికి ఐసీసీతో పాటు బీసీసీఐ స్పెషల్ విషెస్ తెలిపాయి. అంతేకాకుండా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు కోహ్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులను సాధించాలిన ఆకాంక్షిస్తున్నారు. కాగా బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విదేశాలకు పయనమైన విషయం తెలిసిందే. My journey and life's lessons explained to a 15-year old me. Well, I tried my best writing this down. Do give it a read. 😊 #NoteToSelf pic.twitter.com/qwoEiknBvA — Virat Kohli (@imVkohli) November 5, 2019 -
బేబీ ఉబర్‌కు ఉబర్ గ్రాండ్ సెలబ్రేషన్స్...
న్యూఢిల్లీ : ఉబర్ పేరు పెట్టుకుంటే.. ఇంతమొత్తంలో గిప్ట్ ఇస్తారా? గిప్ట్ ఒక్కటే కాదు. ఫైల్ స్టార్ హోటల్లో గ్రాండ్‌గా మొదటి బర్త్‌డే వేడుకలు కూడా. బేబీ బాయ్‌ను ఆశీర్వదించడానికి ఏకంగా కంపెనీ ఉబర్ కంపెనీ సీఈవో ట్రావిస్ కలానిక్ రావడం, ఆ బాబుకు 12,000 డాలర్ల స్కాలర్షిప్ ఫండ్‌ను అంటే దేశీయ కరెన్సీ విలువ ప్రకారం రూ.8.14 లక్షలను బహుమతిగా అందించడం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కాని ఇదంతా నిజం. అసలు ఎవరీ బాబు? ఉబర్ పేరే ఎందుకు పెట్టారు? గత డిసెంబర్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న బాబ్లి అనే మహిళకు ఆస్పత్రి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సేవలు అందకపోతుండటంతో ఉబర్ క్యాబ్‌ను అద్దెకు తీసుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళను మొదట క్యాబ్‌లో తీసుకెళ్లడానికి నిరాకరించిన డ్రైవర్ షానవాజ్ ఖాన్ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒప్పకున్నాడు. ట్రాఫిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్లడానికి ఆలస్యం అవుతుండటంతో, మార్గం మధ్యలోనే బాబ్లి బాబుకు జన్మనిచ్చింది. ఆ సమయంలో బాబ్లికి అవసరమైన అన్ని సేవలను డ్రైవర్ షానవాజ్ ఖాన్ అందించారు. దేవుడిలా వచ్చి తమకు ఇంత సాయం చేసినందుకు బాబ్లి కృతజ్ఞత చెప్పడంతో, బాబు క్యాబ్‌లో పుట్టాడు కాబట్టి కంపెనీ పేరును బాబుకు పెట్టుకోవాలని డ్రైవర్ జోక్ చేశాడు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బాబ్లి, తమ బాబుకు ఉబర్ అనే పేరు పెట్టుకుంది. ఆ విషయం తెలిసిన ఉబర్ కంపెనీ, బాబుకు బర్త్‌డే వేడుకలతో పాటు, స్కాలర్షిప్ను అందించింది. ఉబర్ కోసం ఉబర్ నిర్వహించిన బర్త్‌డే వేడుకల్లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్ పాల్గొన్నారు. బాబుకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఈ నగదు అందించనున్నారు. పేద ఇంట్లో పుట్టిన తమ బాబుకు కంపెనీ పేరు పెట్టుకున్నామని ఇంతమొత్తంలో నగదు అందించడంపై ఉబర్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటల్లో తమ బాబుకు పార్టీ నిర్వహించడం నిజంగా చాలా అదృష్టమని ఉబర్ తల్లి బాబ్లి పేర్కొంటోంది.