birthday wishs
-
Jr NTR: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ, వెల్లువలా బర్త్‌డే విషెస్
Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ 38వ పుట్టిన రోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ సెలెబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. పలు నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు ట్విట్టర్లోె ట్రెండింగ్ అవుతోంది. ఇక మరోవైపు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ టీమ్ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. Meet my dearest @tarak9999 as the mighty and intense #KomaramBheem from #RRRMovie. He's a rebel with a cause! Happy Birthday Brother ❤️@ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/g4p9sVNFsZ — Ram Charan (@AlwaysRamCharan) May 20, 2021 Happy birthday @tarak9999. Wishing you happiness in abundance always. Take care brother! 🤗 pic.twitter.com/wXQ15THjLd — Mahesh Babu (@urstrulyMahesh) May 20, 2021 Happy birthday dear @tarak9999 🥳 Here’s wishing you a year filled with happiness and good health! ♥️ pic.twitter.com/6XL2SlybqR — Venkatesh Daggubati (@VenkyMama) May 20, 2021 Wish you a very happy birthday tarak @tarak9999. May all your dreams come true and you touch newer heights of success. Hope you recover very soon.#HappyBirthdayNTR pic.twitter.com/M8Vyj5clMy — Sai Dharam Tej (@IamSaiDharamTej) May 20, 2021 Everyone has to gets mesmerise with the Intensity in @tarak9999’s eyes!🔥🔥 Thumped as #KomaramBheem👌 Waiting to watch the Rebel on Big screen😍#HappyBirthdayNTR ❤️ https://t.co/fhHLhoOrDq — Bobby (@dirbobby) May 20, 2021 Everyone has to gets mesmerise with the Intensity in @tarak9999’s eyes!🔥🔥 Thumped as #KomaramBheem👌 Waiting to watch the Rebel on Big screen😍#HappyBirthdayNTR ❤️ https://t.co/fhHLhoOrDq — Bobby (@dirbobby) May 20, 2021 Happy Happy Birthday Dearest @tarak9999 garu ❤️ Wishing you good health and happiness always 😊#HappyBirthdayNTR pic.twitter.com/uZOzTRnUnl — Mythri Movie Makers (@MythriOfficial) May 19, 2021 -
హ్యాపీ బర్త్‌డే సీఎం కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రప తి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్ ఆదివా రం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపగా.. ప్రధాని, గవర్నర్ ట్విట్టర్లో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా జీవించా లని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలి: వైఎస్ జగన్ సీఎం కేసీఆర్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్ గారూ... మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’అని ట్వీట్ చేశారు. మొక్కలు నాటిన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రగతిభవన్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో మొక్కను నాటారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం కేసీఆర్ సతీమణి శోభతో పాటు, కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కూతురు అలేఖ్య, కుమారుడు హిమాన్షు ఒక్కో మొక్కను నాటారు. ముఖ్యమంత్రి తరఫున కేటీఆర్ మరో మొక్కను నాటారు. వీరితో ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఉన్నారు. టీఆర్ఎస్వీ రక్తదాన శిబిరం.. కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్ అలీ హాజరవ్వగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఎంపీ సంతోష్‌కుమార్ ఇందులో పాల్గొన్నారు. -
ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియమైన ప్రధానికి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకూ పోటీపడుతున్నారు. సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ప్రధాని మోదీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రధానమంత్రిని నరేంద్ర మోదీని కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన చీఫ్ జస్టిస్‌ను ప్రధాని గుమ్మంలోకి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ...ప్రధానికి బర్త్‌డే విషెస్ చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నితీష్ గడ్కరి, ఆనందీ బెన్ పటేల్, విజయ్ రూపానీ, రాజ్‌వర్థన్ సింగ్ రాథోడ్, సైనా నెహ్వాల్, విజేంద్ర సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, తమ శుభాకాంక్షలు తెలిపారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని టిమ్ కుక్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్...ఒడిశాలోని పూరి సముద్రతీరాన ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా చక్కటి సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీ చీపురు పట్టుకుని ఊడుస్తుండగా ’ఉయ్ ఆర్ కమిటెడ్ టూ స్వచ్ఛ్ భారత్’ అంటూ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని సృష్టించారు.