హ్యాపీ బర్త్‌డే సీఎం కేసీఆర్‌.. | Everybodys birthday wishes to KCR | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే సీఎం కేసీఆర్‌..

Published Mon, Feb 18 2019 4:10 AM | Last Updated on Mon, Feb 18 2019 4:10 AM

Everybodys birthday wishes to KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రప తి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ నరసింహన్‌ ఆదివా రం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్వయంగా కేసీఆర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలపగా.. ప్రధాని, గవర్నర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా జీవించా లని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.

ఆయురారోగ్యాలతో ఉండాలి: వైఎస్‌ జగన్‌
సీఎం కేసీఆర్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్‌ గారూ... మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’అని ట్వీట్‌ చేశారు.  
  
మొక్కలు నాటిన కుటుంబ సభ్యులు 

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రగతిభవన్‌ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో మొక్కను నాటారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం కేసీఆర్‌ సతీమణి శోభతో పాటు, కేటీఆర్, ఆయన భార్య శైలిమ, కూతురు అలేఖ్య, కుమారుడు హిమాన్షు ఒక్కో మొక్కను నాటారు. ముఖ్యమంత్రి తరఫున కేటీఆర్‌ మరో మొక్కను నాటారు. వీరితో ఎంపీ సంతోష్‌కుమార్‌ కూడా ఉన్నారు. 

టీఆర్‌ఎస్వీ రక్తదాన శిబిరం.. 
కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమూద్‌ అలీ హాజరవ్వగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇందులో పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement