b.janardhan reddy
-
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మానవ వనరులు మెండుగా ఉన్నాయని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకం అవుతుందని అమెరికా ఎమోరి యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీశ్ ఎన్.. సేథ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘ఇండియా ఇన్ ది న్యూ వరల్డ్ ఆర్డర్, ఆపర్చునిటీస్ ఫర్ తెలంగాణ’నే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సేథ్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను భారత్‌లో ఏర్పాటు చేసుకోవడం అవసరమన్నారు. ప్రపంచీకరణలో భాగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దగ్గర ఉన్న ప్రాంతీయ వనరులను ఉపయోగించి అభివృద్ధి సాధించాలన్నారు. దేశంలో తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు, రకరకాల పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించేలా ఆన్ లైన్ విద్యను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పేదవర్గాలు ఉన్నత స్థితికి ఎదిగేందుకు స్వచ్చంధ సంస్థలను వినియోగించుకోవాలని, వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. త్వరలో హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్స్, ఐటీ సెక్టార్లలో బెంగళూరును దాటేస్తుందని అభిప్రాయపడ్డారు. మల్టీ నేషనల్ కంపెనీలు రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్ల కోసం పెట్టుబడులు పెడుతున్నాయని, త్వరలోనే హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు సంబంధించి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో విద్యలో నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఆగస్టులో హాజరు మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్ ఫిర్యాదుకూ నో రెస్పాన్స్..సస్పెండ్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారిపై జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి వేటు వేశారు. వివరాల్లోకి వెళితే..ట్యాంక్‌బండ్‌పై స్ట్రీట్ లైట్ వెలగకపోవడాన్ని కమిషనర్ స్వయంగా గుర్తించారు. ఈనెల 10వ తేదీన ఆయన ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. విద్యుత్ దీపాల ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాల్సి ఉంది. అయితే, మూడు రోజులయినా విద్యుత్ శాఖాధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) రమేశ్‌ను కమిషనర్ సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మరో పది మీ సేవలు
సాక్షి, రాజమండ్రి : ‘ఈ సువిధా’ పేరుతో మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రాల్లో జనవరి ఒకటో తేదీ నుంచి మరో పది కొత్త సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల్లో లభించే సేవల సంఖ్య 48కు పెరగనుంది. ఇప్పటి వరకూ 43 శాఖలకు చెందిన 38 రకాల సేవలను మీసేవా కేంద్రాల్లో అందిస్తున్నారు. వీటిలో 15 సేవలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పౌరులకు సంబంధించినవి ఉన్నాయి. కొత్తగా చేరుస్తున్న వాటితో 70 శాతం పుర సేవలు మీ సేవల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నా రు. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీల్లో పురపాలక శాఖ పరిధిలో 58 మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలో ఈ సేవలను పౌరులు పొందే అవకాశం ఉంది. కొత్త సర్వీసులు ఇవే... కొత్తగా చేరుస్తున్న సర్వీసులను కొన్నింటిని తక్షణ ప్రాతిపదికగా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా మరి కొన్నింటిని మాత్రం సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాత జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కొత్తగా చేరుతున్న సేవల ప్రకారం పుర పౌరులు నీటి కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మున్సిపాలిటీల్లో వ్యాపారం చేసుకునేందుకు లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. లెసైన్సుల రెన్యువల్, కొత్త భవన నిర్మాణానికి అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చును. కొత్త ఎసెస్మెంట్ కోసం అభ్యర్థన పత్రాలు దాఖలు చేయవచ్చు. ఎసెస్మెంట్ల సబ్ డివిజన్ కోసం మీసేవ ద్వారా అభ్యర్థన పత్రం దాఖలు చేయవచ్చు. పన్ను మినహాయింపు, వేకెన్సీ రెమిషన్ అభ్యర్థనలు, స్థల అనుభవ, స్వాధీన ధ్రువ పత్రాలతో పాటు ఆస్థి యాజమాన్య బదలాయింపులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అవగాహన కార్యక్రమాలు ట్రేడ్ లెసైన్సులు, భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర సేవలు అందించాలంటే మీసేవ నిర్వాహకులకు తగిన అవగాహన అవసరం అని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం మున్సిపల్ రీజియన్ల వారీగా సిబ్బందికి శిక్షణలు ఇవ్వనున్నారు. రాజమండ్రి రీజియన్ పరిధిలోకి వచ్చే ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల మీ సేవా కేంద్రాల సిబ్బందికి కొత్త సేవలపై ఈ నెల 27న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషణ్ ప్రాంగణంలో ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం కొత్తగా ప్రవేశ పెట్టిన పది సేవలు కొత్త సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తాయి. పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక శాఖ అధికారులు కొత్త సేవలకు సన్నాహాలు చేస్తున్నారు.