కమిషనర్‌ ఫిర్యాదుకూ నో రెస్పాన్స్‌‌..సస్పెండ్ | ghmc commissioner suspends electrical engineer over negligence | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ ఫిర్యాదుకూ నో రెస్పాన్స్‌‌..సస్పెండ్

Published Mon, Feb 13 2017 7:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

కమిషనర్‌ ఫిర్యాదుకూ నో రెస్పాన్స్‌‌..సస్పెండ్

కమిషనర్‌ ఫిర్యాదుకూ నో రెస్పాన్స్‌‌..సస్పెండ్

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌ రెడ్డి వేటు వేశారు. వివరాల్లోకి వెళితే..ట్యాంక్‌బండ్‌పై స్ట్రీట్‌ లైట్‌ వెలగకపోవడాన్ని కమిషనర్‌ స్వయంగా గుర్తించారు. ఈనెల 10వ తేదీన ఆయన ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

విద్యుత్‌ దీపాల ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాల్సి ఉంది. అయితే, మూడు రోజులయినా విద్యుత్ శాఖాధికారులు పట్టించుకోలేదు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) రమేశ్‌ను కమిషనర్‌ సోమవారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement