BJP eeli nani
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి
హుజూరాబాద్/ హుజూరాబాద్ రూరల్: మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ గడ్డమీద సోనియా మాట ఇచ్చారని, పార్టీ నష్టపోయినా మాట తప్పక.. మడమ తిప్పక తెలంగాణ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. వచ్చిన తెలంగాణలో 60 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరాయో లేదో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలంగాణ కోసం కొట్లాడలేదని, సుష్మాస్వరాజ్‌ను కలిసి ఒప్పించలేదని విమర్శించారు. ఆనాడు తెలంగాణ ప్రజల బాధను చెప్పి, సుష్మాస్వరాజ్ కాళ్లకు దండం పెట్టి ఆమెను ఒప్పించింది పొన్నం ప్రభాకర్ అని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చేరింది. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ ఒక్కటే ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని రేవంత్ విమర్శించారు. అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని తొమ్మిదేళ్లు అయినా 15 పైసలు కూడా వేయలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ వచ్చాక రూ.400 సిలిండర్ రూ.1,250, రూ.50 ఉన్న డీజిల్ రూ.100 అయ్యిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిందిగా ఈటల రాజేందర్ ఇప్పటివరకు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఎప్పటిలోగా విచారణ చేయించి కేసీఆర్, కేటీఆర్‌ను జైల్లో పెడతారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పారీ్టలు ఒక్కటేనని.. కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చేందుకే వేరుగా ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాము ఓట్లు అడగమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. -
అభిమానుల పార్టీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై దశాబ్దాల తరబడి ఊహాగానాలు సాగుతుండగా, రజనీ అభిమాన సంఘాల నేత ప్రకటన ఇచ్చాడు. రజనీకాంత్ జన్మదినమైన ఈనెల 12న అభిమాన సంఘాలన్నీ రాజకీయపార్టీగా రూపాంతరం చెందుతున్నట్లు తమిళనాడు రజనీకాంత్ ప్రజా కార్మికుల సంఘం అధ్యక్షులు ఎస్ఎస్ మురుగేష్ ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సీజన్ వచ్చినపుడల్లా రజనీకోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. రజనీ సైతం నర్మగర్భంగా వ్యవహరిస్తూ సంకేతాలు ఇవ్వడమేగానీ ఏ పార్టీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించలేదు. తాజా పార్లమెంటు ఎన్నికలు, ఇటీవల జయలలిత రాజకీయ సంక్షోభ సమయంలో సైతం రజనీ ప్రసన్నం కోసం బీజేపీ బలంగా ప్రయత్నాలు చేసింది. అయితే జయ బెయిలుపై విడుదల కాగానే రజనీ ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో అన్ని పార్టీలు బిత్తరపోగా, బీజేపీ భారీమోతాదులో భంగపడింది. రజనీ రాజకీయ ప్రవేశంపై అన్ని పార్టీలు దాదాపుగా ఆశలు వదులుకున్నాయి. జన్మదినం రోజున రాజకీయ పార్టీ రజనీకాంత్ బలం, బలగమంతా ఆయన అభిమానులు, అభిమాన సంఘాలే. అటువంటిది రాష్ట్రంలోని రజనీ అభిమాన సంఘాలన్నింటినీ రాజకీయపార్టీగా మార్చబోతునట్లు తిరుపూరు జిల్లాకు చెందిన రజనీకాంత్ వీరాభిమాని మురుగేష్ ప్రకటించి సంచలనానికి తెరలేపారు. రజనీకాంత్ మహిళా సేవా సంఘాలను సైతం కలుపుకుని పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రజనీ అభిమాన సంఘాలను రాజకీయపార్టీగా మారుస్తున్నామని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నట్లు మురుగేష్ వెల్లడించారు. 12వ తేదీన పార్టీ పేరును ప్రకటించిన అనంతరం మరికొద్ది రోజుల్లో మదురై లేదా కోవైలో పార్టీ మహానాడును భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ఆయన చెప్పారు. ర జనీ అభిమాన సంఘాల అధ్యక్షులతో చర్చించిన అనంతరమే రాజకీయపార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుపూరు కేంద్రంగా పార్టీ ఆవిర్భావంపై 14 జిల్లాల్లో సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆనవాయితీ కొనసాగేనా? ప్రతి ఏడాది డిసెంబరు 12వ తేదీన రజనీకాంత్ తన జన్మదినాన్ని ఆయన అభిమానులు కోలాహలంగా జరుపుకుంటారు. ఉచితంగా పుస్తకాల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. రజనీ సైతం జన్మదినాన అభిమానులను కలుసుకోవడం ఆనవాయితీ. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అభిమానులను తన ఇంటి వద్ద ప్రత్యక్షంగా పలకరిస్తారు. ఈ ఏడాది తన జన్మదిన కానుకగా లింగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రజనీ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. లింగా విడుదలతోపాటూ రజనీ జన్మదినాన్ని కోలాహలంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో అదే రోజున రజనీ అభిమాన సంఘాలు రాజకీయ పార్టీగా మార బోతున్నట్లు వెలువడిన ప్రకటన అందరినీ అయోమయంలో పడవేసింది. రజనీ అభిమానులంతా తిరుపూరులో పార్టీ అవిర్భావ వేడుకకు హాజరవుతారా లేక చెన్నైలోని రజనీ ఇంటికి చేరుకుంటారా అనేది అగమ్యగోచరమైంది. రజనీ అభిమాన సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఆయన సోదరుడు సత్యనారాయణరావు రెండురోజుల క్రితం తిరుచ్చికి వచ్చారు. రజనీ రాజకీయ అరంగేట్రంపై ఆయనను ప్రశ్నించినవారికి ‘రజనీ రాజకీయాల్లోకి రారు, రజనీకి రాజకీయాలు సూట్ కావు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల రాజకీయపార్టీ ఆవిర్భావానికి రజనీకి ఎటువంటి సంబంధం లేదని తేలింది. మురుగేష్ చర్యలను మరో అభిమాని తీవ్రంగా తప్పుపట్టాడు. రజనీ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడం అభిమాన సంఘాల నిబంధనలకు విరుద్ధమని ఖండించారు. రజనీ పేరు, ప్రతిష్టలను మురుగేష్ అప్రతిష్టపాలు చేస్తున్నాడని చెప్పారు. రజనీ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్య తప్పదని మరో అభిమాని చేసిన హెచ్చరిక వల్ల అభిమాన సంఘాలన్నీ మురుగేష్ బాటలో పయనించడం లేదని స్పష్టమైంది. అభిమాన సంఘాలు రాజకీయపార్టీగా మారుతున్న క్రమంపై రజనీకాంత్ ఏవిధంగా స్పందిస్తారో తేలాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే. -
'సంక్షేమం'తోనే ప్రజల మద్దతు
బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ {పధాని అయ్యాక తొలిసారి పార్టీ కార్యాలయానికి.. పార్టీని గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు న్యూఢిల్లీ: ‘ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమనే పరీక్షలో పాసైతే ప్రజలు మనల్ని కొనియా డతారు. మన వెంట ఉంటారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు ఉద్బోధించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతర్ప్రవాహం, ఒకే భావధార లేకపోయినట్లయితే బీజేపీకి అఖండ విజ యం సాధ్యమయ్యేది కాదన్నారు. మోడీ ప్రధాని పద వి చేపట్టాక తొలిసారి ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలతో ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర నేతలు కూడా పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు మోడీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు గొప్పవారని, వారి కఠిన శ్రమ వల్లే ప్రధానిని అయ్యానన్నారు. ‘ప్రజలు వారి ఆకాంక్షలు నెరవేస్తామనే ఆశతో కులమతాలు, రాజకీయ సమీకరణాలకు అతీతంగా మనకు ఓటేశారు. వారి ఆకాంక్షలను నిబద్ధతతో నెరవేర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తోందని ప్రజలు విశ్వసిస్తే వారు పార్టీతో సంబంధాలను ఎన్నటికీ తెంచుకోరు’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో టోనీ బ్లెయిర్ నాయకత్వంలో లేబర్ పార్టీ, తొలి పర్యాయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం సాధించినట్లుగా బీజేపీ గెలిచిందని, దీనిపై రాజకీయ విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి, పుస్తకాలు వెలువరించాల్సిన అవసరముందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి తొలిసారి ప్రధాని అయ్యాక పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు తనకెంతో సంతోషం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సన్నాహాల కోసం కార్యకర్తలా కష్టపడ్డానన్నారు. ‘పార్టీ కార్యాలయానికి రావాలని వాజ్‌పేయిని అడగ్గా, ఎందుకని ఆయన తిరిగి అడిగారు. మీరిప్పుడు ప్రధాని, కార్యకర్తల చెంత మీరుంటే వారు సంతోషిస్తారు అని చెప్పా.. ఇప్పుడు మీరు నాకిచ్చిన గౌరవాన్ని ఊహించుకోలేపోతున్నా’ అని ఉద్వేగంగా అన్నారు. దేశ శక్తి గురించి లోకానికి తెలిసింది ప్రధానిగా తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి(సార్క్) దేశాధినేతలను ఆహ్వానించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని మోడీ పేర్కొన్నారు. తన ఈ తొలి విదేశాంగ విధాన చొరవ వల్ల భారత్ శక్తి గురించి ప్రపంచానికి సందేశం వెళ్లిందన్నారు. అందరూ ప్రశంసిస్తున్న ఈ నిర్ణయం గురించి ప్రపంచం ఇప్పటికీ మాట్లాడుకుంటోందన్నారు. మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తే అది మన దేశానికి తగిన గౌరవం ఇస్తుందన్నారు. నేడు మంత్రులతో మోడీ భేటీ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలికి ఇప్పటికే 100 రోజుల అజెండాను నిర్దేశించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. సమర్థ పరిపాలన, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం నాడు తన మంత్రివర్గ సహచరులందరితో సమావేశం కానున్నారు. పెట్టుబడుల పెంపుదల, నిర్ణీత కాల పరిమితిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పూర్తి, సహజ వనరుల సమర్థ వినియోగం తదితర పది సూత్రాల అజెండాను నిర్దేశించుకున్న మోడీ.. ఆయా అంశాలపై 44 మంది మంత్రుల నుంచి సూచనలు కోరే అవకాశముంది. ఈ సమావేశంలో చర్చకు వచ్చే ముఖ్యాంశాలు నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ఉభయసభల సమావేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగంలో ప్రతిఫలించనున్నాయి. పీఎంఓ పేజీకి 11 లక్షల లైక్‌లు ప్రధానమంత్రి కార్యాలయం ఫేస్బుక్ పేజీ ‘పీఎంఓ ఇండియా’ ఆరంభంలోనే అదరగొట్టింది. ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే దీనికి 11 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడే ప్రధాని మోడీ విధుల్లో ఉన్న ఫోటో పేజీ ముఖచిత్రంగా ఉంది. మోడీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్న ఫోటోలు, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆయనిచ్చిన సందేశాన్ని పీఎంఓ ఇందులో పోస్ట్ చేసింది. ఈ సందేశాన్ని వేలాది మంది ఇష్టపడ్డారు. -
తేల్చి చెప్పండి
మేడారం జాతర పనుల్లో లోపాలపై లోకాయుక్త ఆదేశం సాక్షి, హన్మకొండ: మేడారం జాతర సందర్భంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), ఏటూరునాగారం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పలు పనులు వివాదాస్పదంగా మారాయి. దాంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై విచారణ చేపట్టాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. జాతర సందర్భంగా చేపట్టిన అన్ని పనులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలంటూ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్‌కు, గిరిజన సంక్షేమ శాఖకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక జూలై 7లోపు సమర్పించాలని ఆదేశించింది. లోకాయుక్త కొరడా.. మేడారం జాతర సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య అధికారి నేతృత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముందు గా టెండర్లు పిలిచిన పనులను మధ్య లో రద్దు చేసి.. ఆ వెంటనే అదే పనిని శాఖ తరఫున చేస్తామని పేర్కొన్నారు. కానీ కమిషన్లు తీసుకుని తమకు అనుకూలుడైన కాంట్రాక్టరుకు పనిని అప్పగించారనే ఆరోపణలు జాతర సందర్భంగా తీవ్ర దుమారం లేపాయి. అయినప్పటికీ అధికారులు తమ తీరును మార్చుకోలేదు. సమయం తక్కువగా ఉందని, భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ పనులు చేయించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా.. తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగి (నాన్ మస్టర్ రోల్, ఎన్ఎమ్ఆర్)కు ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కేవలం పది లక్షల రూపాయల లోపు వ్యయం అయ్యే పనులనే తాత్కాలిక ఉద్యోగి చేపట్టాలి. కానీ, అక్కడ రూ.4 కోట్లకు పైగా వ్యయంతో చేసిన పనుల పర్యవేక్షణ బాధ్యతతో పాటు మెజర్మెంట్ రికార్డుల నిర్వహణ సైతం సదరు ఎన్ఆర్ఎం ఉద్యోగికే అప్పగించడం అప్పట్లో చర్చకు దారితీసింది. ఐటీడీఏ అవలంభిస్తున్న తీరుపై పత్రికల్లో వరుసగా కథనాలు సైతం వచ్చాయి. దాంతో జాతర ముగిసిన వెంటనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ‘సాక్షి’ కథనాలతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన లోకాయుక్త.. గిరిజన సంక్షేమ శాఖ తరఫున చేపట్టిన పనులపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలంటూ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణాధికారికి ఆదేశాలు జారీ చేసింది. అధికారుల్లో మొదలైన గుబులు లోకాయుక్త జోక్యంతో అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. జాతర సమయంలో రెడ్డిగూడెం, చిలకలగుట్ట దగ్గర జంపన్నవాగులో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్, మంచినీటి సరఫరా, ఆర్టీసీ బస్సు ప్రాంగంణంలో రోడ్డు నిర్మాణం, క్యూలైను వద్ద కొత్త నిర్మించిన సీసీ రోడ్డు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడ మండలాల పరిధిలోని అడవుల్లో చేపట్టినట్టు చెబుతున్న ఎడ్లబండ్ల దారుల మరమ్మతులు, నిర్మాణాలు తదితర సంబంధించి అన్ని పనులు చేపట్టిన తీరు, అందుకు చే సిన వ్యయంపై మరోసారి విచారణ జరుగనుంది. అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ముఖ్యాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా కాంట్రాక్టర్లతో కమీషన్ల వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఎన్ఎంఆర్ వర్క్ ఇన్స్పెక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఏఈ అదనపు బాధ్యతలు అప్పగించారని వినిపిస్తున్న ఆరోపణలపై కూడా ముఖ్య అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం అంటూ చేపట్టిన పనుల్లో అధికారులు తమ సౌఖ్యం కోసం చేసిన మార్పులు.. చేర్పుల ఫలితంగా ప్రజాధనం పక్కదారి పట్టిందని, ఈ అవినీతిపై కూడా విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
పొత్తు చిచ్చు
సాక్షి, ఏలూరు : ఎవరికి ఏ సీటు వస్తుందో.. ఎక్కడి నుంచి పోటీ చేయాలో.. అసలు సీటు వస్తుందో లేదో అని తెలుగుదేశం పార్టీ ఆశావహులు ఇప్పటికే మదనపడుతున్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటం వారిని కలవరపరుస్తోంది. తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయోననే భయం తెలుగు తమ్ముళ్లకు పట్టుకుంది. పొత్తుల నేపథ్యంలో బీజేపీ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక లోకసభ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం. అదే జరిగితే పదవుల కోసం పార్టీలు మారిన వారి అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ఓ వైపు ఎవరినిబడితే వారిని పార్టీలోకి ఆహ్వానించి సొంత వాళ్లకు పొగబెట్టడంతోపాటు పార్టీలో చేరిన వాళ్లనూ వంచించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో నిత్య అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు పైకి మాత్రం నిన్నటివరకూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పార్టీ అబాసు పాలవుకుండా కాపుకాశారు. కానీ అధిష్టానం పొత్తుల వైపు చూడటం నాయకుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తోంది. నమ్మినవారిని వంచించడం తమ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిసినప్పటికీ ఇన్నాళ్లూ ఆయననే నమ్ముకున్న వాళ్లు బీజేపీ పొత్తు నిర్ణయంతో కొత్త చిక్కుల్లో పడ్డారు. నిన్నమొన్నటి వరకూ సీటు తమదేననే ధీమాతో ఉన్న వారు సైతం తాజా పరిణామాలతో తలలు పట్టుకుంటున్నారు. తమ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేస్తే ఇక సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఏలూరు అసెంబ్లీ స్థానం బడేటి కోట రామారావుకు ఖరారైనట్టే. లోక్‌సభ స్థానం నుంచి మాగంటి బాబు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఏలూరులో ఏ సీటు ఇవ్వాలన్నా సమస్య జఠిలమవుతుంది. కోటగిరి శ్రీధర్ లోక్‌సభా స్థానం పోటీకి మొగ్గుచూపుతున్నారు. దీంతో మాగంటి బాబుకు కంటిమీద కునుకు కరువైందని ఆయన సన్నిహితులు అంటున్నారు. తాడేపల్లిగూడెం మరింత సమస్యాత్మకం కానుంది. ఇక్కడ ఇప్పటికే కొట్టు సత్యనారాయణ, ఈలి నాని టీడీపీలో చేరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ సీటును బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు తన్నుకుపోతే వారి గతి అధోగతే. కొవ్వూరులో తనను మించిన నాయకుడు టీడీపీలో లేరని చెప్పుకునే టీవీ రామారావు సీటుకు బీజేపీ ఎసరు పెడుతోంది. ఆ స్థానం నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ పి.శ్రీనివాస్ కంటే బి.బెనర్జీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బెనర్జీకి సీటిస్తే రామారావు దుకాణం మూసేయాల్సిందే. అసలే లేనిపోని వివాదాలతో ఇప్పటికే అటు ప్రజల్లో, ఇటు పార్టీలోనూ వ్యతిరేకత తెచ్చుకున్న ఆయనకు టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయన కలవర పడుతున్నారు. ఇలా ప్రతిచోటా టీడీపీలో ఇప్పుడు బీజేపీ పొత్తు చిచ్చు రేపుతోంది.