BJP President
-
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. నడ్డాను కేబినెట్లోకి తీసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. మోదీతో పాటు నడ్డా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవనుంది. ఈ పదవిని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మంత్రి పదవి ఖరారావడంతో ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని నివాసంలో జరిగిన కాబోయే మంత్రుల చాయ్ భేటీకి నడ్డా హాజరయ్యారు.ఎన్సీపీకి నో చాన్స్కేంద్ర కేబినెట్ పదవుల్లో ఎన్సీపీకి షాక్ తగిలింది. కేంద్ర కేబినెట్లో అజిత్ పవార్ వర్గానికి చాన్స్ దక్కలేదు. ఎన్సీపీ నేతప్రపూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి పదవిని ఆఫర్ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేబినెట్ మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఆఫర్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది తనను అవమానించడమేనన్నారు. -
అందరి కళ్లూ ఆయనవైపే.. ఎవరీ అరుణ్ సావో..?
రాయపూర్ (ఛత్తీస్గడ్): ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ కూడా ఒకటి. ఇక్కడ ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్ 7న తొలి దశ, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఇరు పార్టీల నుంచి మహామహులు పోటీలో ఉన్నారు. కాగా బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని లోర్మి అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం లోక్ సభ్యుడైన ఆయన బిలాస్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన ఆయన ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో లోర్మి స్థానం నుంచి పోటీ చేశారు. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో అగ్రస్థాయికి ఎదిగిన అరుణ సావో గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. బీజేపీ ఛత్తీస్‌గఢ్ చీఫ్ అరుణ్ సావో బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అటల్ శ్రీవాస్తవ్‌పై సావో 1,41,763 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లోర్మీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి థానేశ్వర్ సాహుపై పోటీ చేస్తున్నారు. 2022లోనే విష్ణు దేవ్ సాయి స్థానంలో సావో ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఇదీ నేపథ్యం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1968 నవంబర్ 25న అరుణ్ సావో జన్మించారు. ఛత్తీస్‌గఢ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన ఆ తర్వాత బిలాస్‌పూర్‌లోని హైకోర్టులో కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత అడ్వకేట్ జనరల్ కార్యాలయంలోనూ పనిచేశారు. అనతి కాలంలోనే.. 1996లో బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చాలో చేరడంతో అరుణ్ సావో రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత అనతికాలంలోనే వివిధ స్థాయిలకు ఎదిగి 2000 సంవత్సరంలోనే అదే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 2005లో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2005 నుంచి 2010 వరకు జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2010లో లోర్మి నియోజకవర్గం నుంచి చత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2013 నుంచి 2018 వరకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2019లో అరుణ్ సావో బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ లోర్మి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలిస్తే పార్టీ అధిష్టానం ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో వేచి చూడాలి. -
గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2
సాక్షి, చెన్నై: డీఎంకే అవినీతి అక్రమాలు ఫైల్స్ –2 పేరుతో ఏకంగా ఓ ట్రంక్ పెట్టెలో ఆధారాలను పెట్టి మరీ రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై బుధవారం గవర్నర్‌కు సమరి్పంచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో తొమ్మిది మంది రాష్ట్ర మంత్రుల అవినీతికి సంబంధించిన వివరాలు, మూడు ప్రాజెక్టుల్లో చోటుసుకున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు.. అవినీతి అక్రమాలు.. పేరుతో సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, డీఎంకే పార్టికి సంబంధించిన ఆస్తులు, పలువురు ఎంపీల అక్రమార్జన వివరాలను డీఎంకే ఫైల్స్ –1 పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేశారు. ఈ సమయంలో త్వరలో డీఎంకే ఫైల్స్– 2 కూడా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఫైల్స్ వ్యవహారంలో అన్నామలైపై డీఎంకే పార్టీ వర్గాలు పరువునష్టం దావా కూడా వేశాయి. ఈ పరిస్థితుల్లో ఇది వరకు మీడియా ముందు ఫైల్స్– 1ను విడుదల చేసిన అన్నామలై ఈసారి రూటు మార్చారు. డీఎంకే ఫైల్స్– 2 పేరుతో ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని పత్రాలను పెట్టి పెట్టి మరీ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో మూడు ప్రాజెక్టుల్లో రూ. 5,600 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఆ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈవిడకేనా..?
-
బీజేపీ చీఫ్‌గా మళ్లీ నడ్డాకే అవకాశం?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మరో విడత 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొనసాగింపు ద్వారా రానున్న రోజుల్లో వరుసగా జరగనున్న కీలక అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి సంస్థాగతంగా మేలు కలుగుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నడ్డా మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. బీజేపీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డ్ ఆయన పదవీ కాలం మరో విడత పొడిగిస్తూ ఈలోగానే ఒక తీర్మానం ఆమోదిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ రాష్ట్ర విభాగాల్లో సంస్థాగత ఎన్నికలు ఇంకా ప్రారంభం కానప్పటికీ, చీఫ్‌గా నడ్డా కొనసాగుతారని తెలిపాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్రాల్లోనైనా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. నడ్డాకు ముందు పార్టీ చీఫ్‌గా ఉన్న అమిత్ షాకు కూడా ఇదే విధమైన కొనసాగింపునిచ్చారు. అప్పట్లో ఎన్నికలు ముగిసిన వెంటనే సంస్థాగత ఎన్నికలు జరిగాయి. అమిత్ షా కేంద్ర కేబినెట్లో జాయిన్ కావడంతో జేపీ నడ్డా బీజేపీ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీకి విశ్వాస పాత్రుడిగా, ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో సత్సంబంధాలున్న వ్యక్తిగా నడ్డాకు పేరుంది. పార్టీని విస్తరించి వ్యూహాలను అమలు చేయగల నేతగా నడ్డా పేరు తెచ్చుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, బిహార్‌లో పార్టీ మంచి ఫలితాలను రాబట్టడం వంటివి నడ్డా హయాంలో బీజేపీ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటికీ తెలంగాణలో పార్టీ బలం గణనీయంగా పెరగడం వెనుక నడ్డా కృషి ఉందంటున్నారు. -
బండి పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ నిమగ్నం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాద యాత్రకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పార్టీ యంత్రాంగం దృష్టి పెట్టింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర ప్రచార విభాగం, ప్రచార సామాగ్రి వితరణ విభాగం, అలంకరణ విభాగాలకు చెందిన ప్రముఖ్‌లతో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్ సమావేశమయ్యారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పాద యాత్ర సాగనున్న మార్గంలో వసతి, రక్షణ, ప్రచార రథాలు, భోజన ఏర్పాట్ల కోసం స్థలాల పరిశీలనలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. మొదటిదశ యాత్రలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం ఈ సభ్యులు పర్యటించారు. పాదయాత్రలో గోల్కొండ కోట, ఆరె మైసమ్మ దేవాలయం, మొయినాబాద్ క్రాస్ రోడ్, చేవెళ్ల క్రాస్ రోడ్, వికారాబాద్, మోమి న్‌పేట, సదాశివపేట ప్రాంతాల్లో బహిరంగసభలకు అనువైన స్థలాలను పరిశీలించారు. -
బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా!
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న అధ్యక్ష పదవికి నామినేషన్లు్ల వేస్తారని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. కేవలం నడ్డా మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన 36 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సంస్థాగత ఎన్నికల్లో ఇప్పటికే 21 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయని బీజేపీ సీనియర్ నేత రాధా మోహన్ సింగ్ చెప్పారు. పార్టీ విధివిధానాల ప్రకారం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం సగం స్థానాల్లో ఎన్నికలు పూర్తయితే ఆ పార్టీ దేశ స్థాయి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ వచ్చే నెల 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా 57 స్థానాల అభ్యర్థులను పార్టీ ఢిల్లీ విభాగపు అధ్యక్షుడు మనోజ్ తివారీ శుక్రవారం విడుదల చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ మాజీ ఎమ్మల్యే కపిల్ మిశ్రాతోపాటు విజేందర్ గుప్తా, మాజీ మేయర్లు రవీందర్ గుప్తా, యోగేందర్ ఛండోలియాలకు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసేదెవరన్నది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్‌గానే మిగిలిపోయింది. జాబితాలో మొత్తం 11 మంది ఎస్సీలు కాగా, మహిళా అభ్యర్థులు నలుగురికి చోటు కల్పించారు. కపిల్ మిశ్రా మోడల్ టౌన్ నుంచి, రవీందర్ గుప్తా రోహిణి స్థానం నుంచి బరిలోకి దిగుతారని, కేజ్రీవాల్‌పై పోటీ చేసే వ్యక్తిని త్వరలో ప్రకటిస్తామని మనోజ్‌తివారీ తెలిపారు. ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. -
కేసీఆర్ పాలన ‘పైన పటారం..లోన లొటారం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆర్థికమంత్రి ప్రమేయం లేకుండా ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు. ‘సీఎం కేసీఆర్ తీరు ఆవు తోలు కప్పుకున్న పులిలా ఉందని’ వ్యాఖ్యానించారు. కడుపులో కత్తులు పెట్టుకుని.. నోట్లో చక్కెర పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పాలన ‘పైన పటారం..లోన లొటారం’ అనే రీతిలో ఉందన్నారు. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. ఆరేళ్లలో 30వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. టీఎస్పీఎస్సీ ఉనికి తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు..ఐఆర్ లేదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. -
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ ఇంకెన్నాళ్లో?
లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటిదాకా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ హర్షవర్ధన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవి వరించింది. దీంతో బాధ్యతల నిర్వహణలో ఆయన తలమునకలైపోయారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సారథి కోసం ఎదురుచూస్తున్నారు. న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు నూతన సారథి ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. శాసనసభ ఎన్నికలు ఏ సమయంలోనైనా జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో కచ్చితంగా వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నికలకు సన్నద్ధమవడం సులభమవుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల పరాజయం తర్వాత పూర్వవైభవం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు నగరంలో తమ పట్టును పెంచుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రమిస్తోంది. బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతల్లో డాక్టర్ హర ్షవర్ధన్ తలమునకలయ్యారని, అందువల్ల రాష్ట్ర శాఖ వ్యవహారాలపై ఆయన అంతగా దృష్టి సారించలేరని ఆ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ హర ్షవర్ధన్ తన పనిలో తాను నిమగ్నమయ్యారన్నారు. అందువల్ల పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించడానికి అంత సమయం ఆయనకు ఉండదన్నారు. దీంతో ఎటువంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు. కనీసం సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టలేకపోతున్నామన్నారు. బీజేపీ సాధారణంగా ఆరు సంవత్సరాలకొకసారి సభ్యత్వ కార్యక్రమం చేపడుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో ఈసారి ఐదు సంవత్సరాలకే నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెలాఖరుదాకా కొనసాగనుంది. అయితే తొలి నాలుగు రోజుల్లో ఆశించిన మేర స్పందన రాలేదు. ఇది ఆ పార్టీని కొంత నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్ర శాఖకు సరైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని ఆ పార్టీ నాయకుడొకరు వాపోయారు. మరోవైపు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజూ మొహల్లా సభలను నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ సంక్షోభం అనుకోని అవకాశంగా మారింది. ఈ సమస్యపై ప్రతిరోజూ ఆందోళనలకు దిగడం ద్వారా ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తోంది. తద్వారా శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నానాతంటాలు పడుతోంది. మరోవైపు ఈ సంక్షోభం బీజేపీకి శాపంగా పరిణమించింది. సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ సమస్యపై తమ వైఖరేమిటనే విషయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించలేని పరిస్థితి కొనసాగుతోంది. చివరికి ఈ-రిక్షాల విషయంలో కూడా వారు పెదవి విప్పలేకపోతున్నారు. ఇందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు నితిన్ గడ్కరీ వీటి క్రమబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే. ఒకవేళ ఎన్నికలు ముంచుకొస్తే ఆప్‌కు గట్టి పట్టు కలిగిన ప్రాంతాల్లో బీజేపీ తన ప్రచార పర్వాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ-రిక్షాలకు క్రమబద్ధీకరణకు సంబంధించి స్పష్టమైన హామీ లభించినట్టయితే దానిద్వారా బీజేపీ ఆ వర్గాల మద్దతు పొందే అవకాశం లభిస్తుంది. అందుకోసం కూడా విస్తృత మైన ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు మేం సిద్ధంగానే ఉన్నాం: బీజేపీ నేత రమేశ్ న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఒకవైపు అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికలకు సన్నద్ధంగానే ఉందని బీజేపీ నాయకుడు రమేశ్ బిధూరీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలొక్కటే తమకు మిగిలి ఉన్న అవకాశమన్నారు. ‘ఎన్నికలకు మా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈసారి మాకు తిరుగులేని మెజారిటీ వస్తుందనే ధీమా ఉంది’ అని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈ దక్షిణ ఢిల్లీ ఎంపీ పేర్కొన్నారు. ఎన్నికలకు మీ పార్టీ సిద్ధమేనా అని ప్రశ్నించగా ఈ విషయమై అధిష్టానం త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. భారీ పగటికలలు కంటూ శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ 49 రోజుల పాలనాకాలంలో దాని లోపాలన్నీ బయటపడ్డాయన్నారు. అందువల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఇబ్బందికరమైన ఫలితాలను చవిచూడక తప్పలేదన్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నగరంలోని మొత్తం 70 సెగ్మెంట్లకు గాను 60 స్థానాల్లో బీజేపీ ముందున్న సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికలకు ముందు డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాని సంగతి విదితమే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 33.07 శాతం ఓట్లు రాగా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 46.10 శాతానికి పెరిగింది. ఇక ఆప్ ఓటు శాతం 32.90 నుంచి 29.49 శాతానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 24.50 శాతం వాటా దక్కింది. ఇది లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి 15.10 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం ఎన్నికల బరిలోకి దిగడం ఏ పార్టీకీ ఇష్టం లేకపోయినప్పటికీ అంతకుమించి మరో మార్గం కనిపించని పరిస్థితి కొనసాగుతోంది.