Blessing Muzarabani
-
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్‌బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండీ మెక్‌బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్‌బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్‌బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్‌ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్‌ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
ముచ్చటగా 3 మ్యాచ్‌లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగా సాగింది. వ్యక్తిగత కారణాల చేత రాయుడు సీపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన రాయుడు.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఓ మ్యాచ్‌లో (తొలి మ్యాచ్) డకౌట్ కాగా.. మిగతా రెండిటిలో 32, 15 పరుగులు చేశాడు. 3 మ్యాచ్‌ల్లో రాయుడు 15.66 సగటున 117.50 స్ట్రయిక్‌రేట్‌తో 47 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు, భారత దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 37 ఏళ్ల రాయుడు ఐపీఎల్ 2023 ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యుడిగా ఉండిన విషయం తెలిసిందే. మరోవైపు అంబటి రాయుడుతో పాటు జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలచే సీపీఎల్‌ను మధ్యలోనే వీడాడు. ఇతను కూడా రాయుడు లాగే మూడంటే మూడే మ్యాచ్‌లు ఆడాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒకే వికెట్ పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు. రాయుడు, ముజరబానీ జట్టును వీడటంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వీరికి రీప్లేస్‌మెంట్‌గా ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ స్మీడ్, బెన్నీ హోవెల్లను తమ పంచన చేర్చుకుంది. వీరిలో స్మీడ్ విధ్వంసకర బ్యాటర్ కాగా.. హోవెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఇదిలా ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఎవిన్ లెవిస్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతుంది. -
8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే!
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో జరిగిన సిరీస్‌లకు దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. చివరగా 2003-2004లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అదే విధంగా ఇరు జట్లు ముఖాముఖి తలపడి కూడా దాదాపు 8 ఏళ్ల కావస్తోంది. చివగా 2014లో ఆసీస్-దక్షిణాఫ్రికా జట్లతో ట్రై సిరీస్‌లో జింబాబ్వే తలపడింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్ 2020 ఆగస్టులో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రేండేళ్ల పాటు వాయిదా పడింది. టౌన్‌విల్లే వేదికగా ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగానే జరగనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది. జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్,), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమాని, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే' -
జింబాబ్వే స్టార్ బౌలర్‌కు బంపర్ ఆఫర్.. తొలిసారి ఐపీఎల్లో!
ఐపీఎల్-2022 సీజన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వుడ్ స్ధానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు అతడు ఐపీఎల్లో పాల్గోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ముజారబానీ భారత్‌కు బయలుదేరినట్లు జింబాబ్వేలోని భారత రాయబారి కార్యాలయం ద్రువీకరించింది. అయితే ముజారబానీని వుడ్ స్ధానంలో భర్తీ చేస్తారా లేదా నెట్ బౌలర్‌గా ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాలి. కాగా అంతకుముందు వుడ్ స్ధానాన్ని బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని భావించింది. అయితే అతడు దక్షిణాప్రికా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టులో భాగమై ఉన్నాడు. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. దీంతో అతడి స్థానంలో ముజారబానీని జట్టులో తీసుకోనున్నారు. ఇక మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్‌లో మార్చి 28 మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆర్సీబీ తరపున!