Blue-chip shares
-
వెలుగులో పీఎస్‌యూ షేర్లు
స్వల్పంగా తగ్గిన సూచీలు ముంబై: ఇటీవల జోరుగా పెరిగిన బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో బుధవారం స్టాక్ సూచీలు స్వల్పంగా తగ్గాయి. ట్రేడింగ్ తొలిదశలో 29,000 పాయింట్ల స్థాయిని దాటి 29,067 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 52 పాయింట్ల క్షీణతతో 28,926 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో ఈ సూచీ 554 పాయింట్లు పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లు తగ్గి 8,918 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, టెక్ మహింద్రాలు 1.5-2.5 శాతం మధ్య క్షీణించాయి. గురువారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం జరగనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణ జరిగిందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బీహెచ్ఈఎల్ టాప్ పలు ప్రభుత్వ రంగ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు జోరుగా పెరిగాయి. అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలతో ఆకట్టుకున్న బీహెచ్ఈఎల్ భారీగా 15 శాతం పెరిగి రూ. 159 స్థాయికి చేరింది. పీఎస్‌యూ మెటల్ షేర్లు సెయిల్, ఎన్‌ఎండీసీలు 7 శాతంపైగా ర్యాలీ జరిపాయి. ఓఎన్జీసీ 2.9 శాతం ఎగిసింది. ఇక పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 5-7 శాతం మధ్య పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 శాతంపైగా దూసుకెళ్లింది. సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ 2.74 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 266.50 వద్ద ముగిసింది. -
ఎక్కడ సూచీలు అక్కడే..
* కొన్ని బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ * నేడు ఎస్బీఐ, ఐటీసీల ఫలితాలు ఎస్బీఐ, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడంతో గురువారం స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. ఈ రెండు కంపెనీలు నేడు(శుక్రవారం) క్యూ4 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. రేట్ల కోత ఆశలు కొనసాగుతున్నప్పటికీ, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 27,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 8,421 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో కొన్ని బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగిందని అందుకే స్టాక్ మార్కెట్ సూచీలు అక్కడక్కడే కదలాడాయని ట్రేడర్లు చెప్పారు. లాభాల స్వీకరణ: అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం, దేశీయంగా ఎలాంటి ప్రధాన ఈవెంట్లు లేకపోవడంతో లాభాల స్వీకరణ జరిగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటై ల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. లాభాల స్వీకరణ, అమెరికాలో ముఖ్యమైన ఆర్థిక గణాం కాలు వెల్లడి కానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు అక్కడక్కడే కదలాడాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి వెల్లడించారు. సెన్సెక్స్ అంచనాలు తగ్గింపు: సిటీ గ్రూప్ భారత మార్కెట్లపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతోందని సిటీ గ్రూప్ పేర్కొంది. అందుకే ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ టార్గెట్‌ను 33,000 పాయింట్ల నుంచి 32,200 పాయింట్లకు తగ్గిస్తున్నామని వివరించింది. 2016 జూన్ నాటికి సెన్సెక్స్ 35,000 పాయింట్లకు చేరుతుందని సిటీ గ్రూప్ అంచనా వేస్తోంది. ఇక నిఫ్టీ ఈ ఏడాది చివరకు 9.760కు, వచ్చే ఏడాది జూన్ కల్లా 10,600 పాయింట్లకు చేరుతుందని పేర్కొంది. -
సెన్సెక్స్ నిరోధం 29,800
మార్కెట్ పంచాంగం భారత్ స్టాక్ సూచీలు దాదాపు రికార్డుస్థాయిలో ట్రేడవుతున్న సమయంలో బడ్జెట్ వారం సమీపించింది. వాస్తవానికి బడ్జెట్ అంచనాలతో పెరిగిన బ్లూచిప్ షేర్లు ఈ మధ్య పెద్దగా లేవనే చెప్పాలి. రెండు వారాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 3.5 శాతంవరకూ పెరిగాయి. వీటి పెరుగుదలకు ప్రధాన కారణమైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐటీసీ షేర్లపై బడ్జెట్ అంచనాలేవీ లేనందున, ప్రపంచ సానుకూల ట్రెండ్‌లో భాగంగానే ఇటీవల మార్కెట్ ర్యాలీ జరిగిందని భావించవచ్చు. ఇలా అంచనాలు లేని సమయంలో వచ్చే బడ్జెట్లో మార్కెట్‌ను ఆశ్చర్యపర్చే ప్రతిపాదనను ప్రకటిస్తే, సూచీలు పరుగులు తీయవచ్చు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సాదాసీదాగా వున్నా, ఇన్వెస్టర్లు పెద్దగా నిరుత్సాహపడేదేమీ వుండదు. వారు ప్రపంచ మార్కెట్ ట్రెండ్‌వైపు దృష్టి మళ్ళించవచ్చు. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు..., ఫిబ్రవరి 20తో ముగిసిన వారం ప్రధమార్థంలో 29,523-29,083 పాయింట్ల మధ్య స్వల్పశ్రేణిలో కదిలిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 136 పాయింట్ల లాభంతో 29,231 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 29,500-600 శ్రేణిని చేరవచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే 29,800 స్థాయికి చేరవచ్చు. ఈ వారం బడ్జెట్ సందర్భంగా ర్యాలీ జరిగితే ఈ స్థాయే కీలకమైన అవరోధం. ఆపైన స్థిరపడితే క్రమేపీ 30,100 స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం 29,500-600 శ్రేణిని అధిగమించలేకపోతే 29,080 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 28,830 పాయింట్ల వద్ద ముఖ్యమైన మద్దతు లభిస్తున్నది. ఈ లోపున మద్దతులు 28,600, 28,400పాయింట్లు. నిఫ్టీ మద్దతు 8,790-అవరోధం 8,920 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,913-8,794 శ్రేణి మధ్య కదిలిన తర్వాత చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 29 పాయింట్ల స్వల్పలాభంతో 8,833 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం 8,790 పాయింట్ల స్థాయి మూడు ట్రేడింగ్ రోజుల్లో నిఫ్టీకి మద్దతునిచ్చినందున, ఈ వారం ప్రధమార్థంలో 8,790 మద్దతును కోల్పోతేనే మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయిని నిలుపుకుంటూ, నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే 8,920 పాయింట్ల నిరోధస్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే 8,966 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. అటుపైన 9,050 పాయింట్ల రికార్డుస్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి మద్దతును కోల్పోతే 8,730 స్థాయికి వేగంగా తగ్గవచ్చు. ఆ దిగువన వెనువెంటనే 8,650 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 8,595 స్థాయికి పడిపోవొచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 8,900, 9,000 స్ట్రయిక్స్ వద్ద కాల్ బిల్డప్‌తో పోలిస్తే 8,800, 8,700 స్ట్రయిక్స్ వద్ద పుట్ బిల్డప్ చాలా తక్కువ. వచ్చే వారం తొలి నాలుగురోజుల్లో చిన్న పెరుగుదలలో కూడా నిఫ్టీ నిరోధాన్ని చవిచూడవచ్చని, క్షీణత జరిగితే వేగంగా వుండవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది.