పాత్రో స్మృతి చిహ్నం నిర్మిద్దాం
ఉత్తరాంధ్ర మాండలికానికి విశేష గుర్తింపు తెచ్చిన ప్రముఖ నాటక, చలనచిత్ర రచయిత బి. ఎన్. గణేశ్పాత్రో మరణం తెలుగు సాహిత్య, కళారంగాలకే తీరనిలోటు. తెలుగునాట మాండలికాలకు సాహిత్య, సాంస్కృతిక గౌరవం కల్పించడంలో పాత్రో కృషి అనన్య సామాన్యం. రావిశాస్త్రి, చాసో, కారా, పతంజలి వంటి వారు మాండలికంలో గొప్ప సాహిత్యాన్ని సృజించారు. కాగా, పాత్రో రంగస్థలంపై అదే పని చేశా రు. తెలుగు రంగస్థలిపై ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టంగట్టారు. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘అసురసంధ్య’, ‘త్రివేణి’ తదితర నాటి కలు, నాటకాలు అలాంటివే. సినిమారంగంలోనూ పాత్రో మాట తూ టాలా పేలింది. ‘మరోచరిత్ర’, ‘ఇది కథకాదు’. ‘ఆకలిరాజ్యం’, ‘చిల కమ్మ చెప్పింది’ తదితర చిత్రాల సంభాషణలు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఔత్సాహిక సాంఘిక నాటక రంగం బతికి బట్టకట్టడానికి ఒక ముఖ్య కారణం పాత్రోయే. తెలుగు నాటక, సినీ రంగాలకు విశిష్ట సేవలను అందించిన గణేశ్ పాత్రో పుట్టింది విజ యనగరం జిల్లా మార్కొండ పుట్టిలోనే అయినా, ఆయన సాహితీ, రంగస్థల ప్రస్థానం ప్రారంభమైనది విశాఖపట్టణంలోనే. కాబట్టి విశా ఖలో గణేశ్పాత్రో స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి రెండు రాష్ట్రాలలోని రంగస్థల, సినీ ప్రముఖులంతా పూనుకోవాలని విజ్ఞప్తి.
- వి. కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా