board of directors meeting
-
‘పేటీఎం’ మీద చర్యలపై తగ్గేది లేదు..
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రధాన లక్ష్యం కస్టమర్లు, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే తప్ప.. తాము పేటీఎంకి వ్యతిరేకమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. ఫిన్‌టెక్ రంగానికి ఆర్బీఐ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉందని, పరిశ్రమ మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని దాస్ తెలిపారు.‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీపీబీఎల్‌పై చర్యలు తీసుకున్నాం. కస్టమర్ల సందేహాల నివృత్తి కోసం ఈ వారంలోనే ఎఫ్ఏక్యూలను జారీ చేస్తాం‘ అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ భేటీలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణల వల్ల దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలంటూ పీపీబీఎల్ మీద ఆర్బీఐ ఆంక్షలు విధించడం తెలిసిందే. ఇవి ఫిబ్రవరి 29 తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే దాస్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితులపై సమీక్ష.. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 2024–25 మధ్యంతర బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెడుతున్న అంశాలను వివరించారు. ఆర్థిక రంగం నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనేది పేర్కొన్నారు. -
ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ బోర్డ్ సమీక్ష
ముంబై: భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లతో సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డు సమీక్షించింది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 605వ సమావేశం ఏక్తా నగర్ (కెవాడియా)లో గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగింది. ఎంపిక చేసిన కేంద్ర కార్యాలయ విభాగాల కార్యకలాపాలు, భారత్ బ్యాంకింగ్ ధోరణి, పురోగతిపై 2022–23 ముసాయిదా నివేదికపై కూడా బోర్డ్ సమావేశం చర్చించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన వివరించింది. ఈ సమావేశానికి కేంద్ర బోర్డు డైరెక్టర్లు సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, ఆనంద్ గోపాల్ మహీంద్రా, రవీంద్ర హెచ్ ధోలాకియా హాజరయ్యారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్ జేతో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ప్రకటన పేర్కొంది. -
ఎకానమీపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ శుక్రవారం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 590వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యల ఫలితాల అంశం కూడా సమీక్షలో చోటుచేసుకుందని ప్రకటన వివరించింది. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు మరియు టీ రబీ శంకర్లతోపాటు సెంట్రల్ బోర్డ్ ఇతర డైరెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. సతీష్ కే మరాఠే, ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది సమవేశంలో పాల్గొన్న డైరెక్టర్లలో ఉన్నారు. ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ కూడా ప్రభుత్వం తరఫున సమావేశానికి హాజరయ్యారు. -
నేడు సింగరేణి బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం
గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తిపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. ఇదే అంశంపై సింగరేణివ్యాప్తంగా ఉన్న ఏరియాల జీఎంలతో డెరైక్టర్లు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు పకడ్బందీ వ్యూహంతో సాగాలని డెరైక్టర్లు జీఎంలకు సూచించే అవకాశముంది. ఏపీ సర్వీస్‌లోకి సుతీర్థ భట్టాచార్య! సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పదవీకాలం ఈనెల 11వ తేదీతో ముగియగా ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇవ్వలేదు. గతంలో పనిచేసిన చాలామంది సీఎండీలకు పదవీకాలాన్ని పొడిగించగా సుతీర్థ భట్టాచార్య విషయంలో మాత్రం ప్రభుత్వం మిన్నకుండిపోయింది. భట్టాచార్య సైతం తన పదవీకాలం పొడిగింపు కోసం ఉత్సాహం చూపడం లేదని సమాచారం. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వీస్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణికి కొత్త సీఎండీని నియమించే అవకాశముంది.