ముంబై: భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లతో సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డు సమీక్షించింది. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 605వ సమావేశం ఏక్తా నగర్ (కెవాడియా)లో గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగింది. ఎంపిక చేసిన కేంద్ర కార్యాలయ విభాగాల కార్యకలాపాలు, భారత్ బ్యాంకింగ్ ధోరణి, పురోగతిపై 2022–23 ముసాయిదా నివేదికపై కూడా బోర్డ్ సమావేశం చర్చించినట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన వివరించింది.
ఈ సమావేశానికి కేంద్ర బోర్డు డైరెక్టర్లు సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, ఆనంద్ గోపాల్ మహీంద్రా, రవీంద్ర హెచ్ ధోలాకియా హాజరయ్యారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్ జేతో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ప్రకటన పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment