Board of Education officials
-
రేపట్నుంచి ‘సెట్స్’
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్’ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేసినందున తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీనుంచి వరుసగా ఏపీసెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఐసెట్తో ఆరంభం... ► టీసీఎస్, ఏపీ ఆన్లైన్ సంయుక్తంగా ఆన్లైన్లో ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ► ఈనెల 10వ తేదీ నుంచి ఐసెట్తో ఏపీ సెట్స్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ► ఐసెట్ 10, 11వ తేదీల్లో, ఈసెట్ 14న, ఎంసెట్ 17 నుంచి 25 వరకు, పీజీసెట్ 28న, ఎడ్‌సెట్, లాసెట్ అక్టోబర్ 1న, పీఈసెట్ అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఉంటాయి. ► సెట్ పరీక్షలకు సెంటర్లతో పాటు స్లాట్స్‌ను కూడా పెంచారు. ఐసొలేషన్ గదులు కూడా.. ► ప్రతి పరీక్ష కేంద్రాన్ని ముందుగానే శానిటైజ్ చేసి సిబ్బందికి కిట్స్ అందిస్తారు. మాస్కులు, గ్లౌజ్‌లు, స్ప్రేయింగ్ మిషన్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ► ప్రతి సెంటర్లో ఐసొలేషన్ గదులు . టెంపరేచర్ నిర్ణీత పరిమాణం కన్నా ఎక్కువగా ఉన్న వారికి ఆ గదుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ► ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మానిటరింగ్ డెస్కులు ఏర్పాటు. ► విద్యార్థులకు బార్కోడ్ హాల్ టికెట్లు జారీ చేసి సూచనలు, రోడ్ మ్యాపులను పొందుపరుస్తున్నారు. ► విద్యార్థులకోసం హెల్ప్‌లైన్ డెస్కు, ఫోన్ నంబర్లు అందుబాటులోకి. ► ప్రతి అభ్యర్థి కోవిడ్ 19పై డిక్లరేషన్ సమర్పించాలి.మాస్కులు, గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలి. -
నట్టేట ముంచిన బ్రిడ్జి
సాంకేతిక విద్యాబోర్డు విభజన...అధికారుల నిర్లక్ష్యం.. సమన్వయలోపం.. పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి జరగని అర్హత పరీక్ష.. అందని ఉన్నత సాంకేత విద్య.. వెరసి బ్రిడ్జి కోర్సు చేసిన ఐటీఐ విద్యార్థులు నట్టేట మునిగారు. ఫలితంగా ఐటీఐ బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. - ఐటీఐ విద్యార్థులకు అందని పాలిటెక్నిక్ ప్రవేశాలు - రోడ్డున పడిన పలువురు విద్యార్థులు తిరుచానూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సాంకేతిక విద్యాబోర్డు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఐటీఐ బ్రిడ్జి కోర్సు చేసిన విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. ద్వితీయ సంవత్సర పాలిటెక్నిక్ కోర్సుల్లో పది శాతం మంది ఐటీఐ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి ఏడాది బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తోంది. బ్రిడ్జి కోర్సులో అర్హత సాధించిన వారికి సాంకేతిక విద్యాబోర్డు మళ్లీ అర్హత పరీక్ష నిర్వహించి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. ఈ ఏడాది మే 16 నుంచి జూన్ 16వ తేదీ వరకు తిరుపతిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బ్రిడ్జి కోర్సు నిర్వహించారు. ఈ కోర్సుకు జిల్లా నలుమూలల నుంచి ఐటీఐ పూర్తయిన 66 మంది విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌లో ద్వితీయ సంవత్సరం ప్రవేశం పొందాలని తమ ఉద్యోగాలను వదులుకుని బ్రిడ్జి కోర్సుల్లో చేరారు. జూన్ నెల 28, 29వ తేదీల్లో పరీక్షలు కూడా రాశారు. నేడో రేపో సాంకేతిక విద్యాబోర్డు అర్హత పరీక్ష నిర్వహిస్తుందని విద్యార్థులు తలిచారు. సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అర్హత పరీక్ష నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సాంకేతిక విద్యా బోర్డు సైతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండుగా విడిపోయింది. రెండు రాష్ట్రాల సాంకేతిక విద్యా బోర్డు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో బ్రిడ్జి కోర్సులో అర్హత సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సర పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించలేదు. దీంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆశతో ఎదురుచూస్తున్న ఐటీఐ విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హత పరీక్ష నిర్వహించాలని బ్రిడ్జి కోర్సు విద్యార్థులు కోరుతున్నారు. ఉన్న ఉద్యోగం వదులుకున్నా 2013లో ఐటీఐ పూర్తి చేశాను. ఆర్థికంగా తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నందున చిన్నపాటి ఉద్యోగం చేస్తూ అండగా నిలుస్తున్నా. బ్రిడ్జి కోర్సు ద్వారా పాలిటెక్నిక్ పూర్తి చేసి మెరుగుపడాలని తలచి ఉన్న ఉద్యోగం వదులుకున్నా. అధికారులు స్పందించి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సర ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించాలి. - టీ కుమార్, శ్రీకాళహస్తి రోడ్డున పడ్డాను తంబళ్లపల్లె ఐటీఐ కళాశాలలో 2013లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌ను పూర్తి చేశా. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. బ్రిడ్జి కోర్సు ద్వారా పాలిటెక్నిక్‌లో చేరి జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నా. తీరా పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించకపోవడంతో రోడ్డున పడ్డాను. - నాగేంద్రనాయక్, మదనపల్లి నిర్లక్ష్యం తగదు గత ఏడాది ఐటీఐ పూర్తి చేశాను. బ్రిడ్జి కోర్సులో చేరి అర్హత సాధించాను. ఇప్పుడు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సర ప్రవేశానికి సాంకేతిక విద్యాబోర్డు పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో తనలాంటి నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నాం. అధికారులకు ఇంత నిర్లక్ష్యం తగదు. - టీ సదాశివయ్య, నగరి మా లోపం లేదు సాంకేతిక విద్యా బోర్డు ఆదేశాల మేరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి, పరీక్షలు జరిపాం. ఇందులో అర్హత సాధించిన విద్యార్థుల మార్కుల జాబితాను ఉన్నతాధికారులకు చేరవేశాం. పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి సాంకేతిక విద్యా బోర్డే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇందుతో తమ లోపమేదీ లేదు. - పీ.గణేష్, ప్రిన్సిపాల్, ప్రభుత్వం ఐటీఐ కళాశాల, తిరుపతి