bocha satyanarayana
-
విజయనగరం: కొత్త చరిత్ర
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లాలో సునామీ సృష్టించింది. అన్ని స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసి చరిత్రను తిరగరాసింది. జిల్లా అవిర్భావం తర్వాత ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలవడం ఇది రెండోసారి. 1994 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అప్పటికి ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం, పార్వతీపురం పార్లమెంట్ స్థానాలను ఎన్టీఆర్ కైవసం చేసుకున్నారు. ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టి జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. 2014 తర్వాత ఆయనపై జిల్లా వాసులు నమ్మకం పెంచుకున్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం.. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తానని పదేపదే చెప్పడం.. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేయడంతో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను నమ్మారు. దీనికితోడు గతేడాది ఆగస్టు నుంచి నవంబరు నెల వరకు జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో సాలూరు నియోజకవర్గం నుంచి విశాఖ వెళ్లిన జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ కుట్ర నుంచి బయటపడి తిరిగి జిల్లాలో అదే చిరునవ్వుతో పాదయాత్ర చేసిన జగన్ మోహన్‌రెడ్డితో ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు మహిళా సంఘాలకు పసుపు కుంకుమ, వృద్ధ్యాప్య, వికలాంగు, వితంతు పింఛన్లు పెంపు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేశారు. అంతకుముందు నిరుద్యోగ భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాని ఇవేవీ జగన్ మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయన విశ్వసనీయతను అర్థం చేసుకున్న ఓటర్లు ‘జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం’ అన్న భావనతో పోలింగ కేంద్రానికి వెళ్లడం ఇంతటి భారీ విజయం ఆ పార్టీని వరించేందుకు కారణమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్తో మంచి ఫలితాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మేనియాతో పాటు ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం ఆ పార్టీకి అద్భుత ఫలితాలు తెచ్చి పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో ఆద్యంతం జాగ్రత్తలు తీసుకుని గెలుపు గుర్రాలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. రెండు, మూడు చోట్ల పార్టీ సమన్వయకర్తలను మార్పు చేసి కూడా విజయతీరాలకు చేరే వారిని ఎంపిక చేసుకున్నారు. వారికే టికెట్లు కేటాయించి ఎన్నికల బరిలో దించడంతో సఫలీకృతులయ్యారు. మరోవైపు పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రత్య«ర్థి తెలుగుదేశంపార్టీ నాయకులకు కూడా ఊహకందని విధంగా పోల్మేనేజ్మెంట్ చేశారు. అవతల పక్షం అభ్యర్థులకు సైతం గాలం వేసి ఓట్లు సంపాదించారు. వీటితో పాటు ఎన్నికలకు రెండేళ్లు ముందు బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకుడు వైఎస్సార్సీపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. బొత్స సత్యనారాయణ తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయ ఎత్తుగడలతో తన మేనల్లుడు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సమన్వయ పటిమతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించారంటే అతిశయోక్తి కాదు. -
పవన్ మానసిక స్థితి బాగోలేదు..
-
వైఎస్సార్ సీపీకి ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కేసీఆర్‌ని టీడీపీ నెత్తినపెట్టుకోవాలని చూసిందని, చంద్రబాబును ఓటుకు కోట్లు కేసులో శిక్షించి ఉంటే నేడు పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, దానికిప్రతిగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేసీఆర్ ప్రకటించారని.. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలపై ఆలోచించాలని ప్రజలను కోరారు. హరికృష్ణ చనిపోయిన సందర్భంలో టీఆర్ఎస్తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే అన్నారు. ‘కేసీఆర్ యాగం చేస్తుంటే పిలవగానే ఎగేసుకుంటూ చంద్రబాబు స్వయంగా హాజరవుతారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కేసీఆర్‌ను పిలుస్తారు. పరిటాల శ్రీరామ్ వివాహ సందర్బంలో అటు చంద్రబాబు ఇటు కేసీఆర్‌తో కూడిన కటౌట్లు వేసింది ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మాట్లాడతారా? నిన్నటి వరకు బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలసిపోయామని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చూస్తే కేసీఆర్‌తో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మొద్ద’ని బొత్స కోరారు. కేసీఆర్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన కోసం ఏపీ మంత్రులు ఎందుకు క్యూ కట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తాను చేసిన కృషే కారణమన్న చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వొస్తుందన్నారు. లగడపాటి ఒక బ్యాంక్ కరప్ట్ అని, సర్వే పేరుతో తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. మనిషి బలహీనతతో ఆడుకోవడం లగడపాటికి అలవాటని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఉనికి లేకుండా చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రబాబు తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి పార్టీ ప్రయోజనాలకంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని, రానున్న ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. పవన్ మానసిన స్థితి బాగోలేదు.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మానసిక స్థితి బాగోలేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారో ఎవరికీ అర్థం కాదని, పవన్ మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పరిపక్వత లేనివాళ్లు పవన్‌లా మాట్లాడతారని, రాజకీయమంటే సినిమా డైలాగులు చెప్పినట్లు కాదని హితవు పలికారు. -
ఎక్కడైనా డెవలపర్లదే పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వం మరో దోపిడీకి తెర లేపిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు లాలూచీ పడ్డారని.. మన భూమి, నిదులు ఇచ్చి మరీ వాళ్లకు దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం చేసుకుంటున్న వైనంపై ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ దోపిడీని అడ్డుకునేవారందరినీ అభివృద్ధి నిరోధకులని అంటున్నారని ఆయన విమర్శించారు. సాధారణంగా భూములు ఎవరిచ్చినా డెవలపర్లే పెట్టుబడి పెడతారని, మనం వ్యక్తిగత స్థాయిలో మనకున్న భూమిని అపార్టుమెంట్లుగా కట్టడానికి డెవలప్మెంట్కు ఇచ్చినా నిధులు వాళ్లే సమకూర్చి పనులన్నీ చేసిన తర్వాత మన వాటా మనకు ఇస్తారని ఆయన చెప్పారు. కానీ సింగపూర్ కంపెనీల విషయంలో మాత్రం ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, మకీ కంపెనీ చైర్మన్ కూడా అదే విషయం చెప్పారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకత లేదని, అంతా గోప్యమని, రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆయన సుదీర్ఘంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అంతర్జాతీయ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదని, చంద్రబాబు తన తాబేదారులకు అప్పనంగా దోచిపెడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగపూర్ కంపెనీలపై విచారణ జరిపించాలని, ప్రభుత్వం లాలూచీ పడిందన్న విషయాన్ని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవినీతి విషయంలో ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎక్కడైనా డెవలపర్లదే పెట్టుబడి : బొత్స