BOE
-
నేను ఆ రేసులో లేను
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని తాను భావించడంలేదని రాజన్ స్పష్టం చేశారు. షికాగో యూనివర్శిటీ ఉద్యోగంలో చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అంతేకాదు వాస్తవానికి తాను ప్రొఫెషనల్ సెంట్రల్ బ్యాంకర్ని కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్ పేరు ఇటీవల వార్తల్లో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని నివేదికలు వెలువడ్డాయి. బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనున్న ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న రఘురామ్ రాజన్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. -
మరోసారి వార్తల్లో రాజన్
-
మరోసారి వార్తల్లో రాజన్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గుర్తున్నారా? ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ అందించిన సమాచారం ప్రకారం బీఓఈ గవర్నర్ పదవి రేసులో రాజన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చికాగోకి చెందిన ఎకనామిస్ట్ , రఘురామ్ రాజన్ టాప్లిస్ట్లో ఉన్నారని నివేదించింది. ఆర్బీఐ గవర్నర్గా తనదైన ముద్ర వేసుకున్న రఘురామ్ రాజన్ బ్రెక్సిట్ కోసం దేశం సిద్ధపడుతున్న సమయంలో ప్రతిష్టాత్మక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ రేసులో..అదీ టాప్లో వుండటం విశేషం. ప్రస్తుతం బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న రఘురామ్ రాజన్ పేరు పరిశీలనలో ఉందిట. ఈ పదవిని చేపట్టటానికి అవసరమైన ప్రాసెస్ ను ప్రారంభించినట్లు యూకే ఛాన్సెలర్ ఫిలిఫ్ హమోండ్ తెలిపారని ఎఫ్టీ రిపోర్ట్ చేసింది. అంతేకాదు ఈ లిస్ట్ లో భారత్ కు చెందిన మరో వ్యక్తి స్రితి వదేరా పేరు కూడా ఉంది. -
ఒడిదుడుకులొచ్చినా... బంగారమే!!
ముంబై, న్యూయార్క్ : భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో వారంలో లాభాల స్వీకరణ జరిగింది. స్వల్పకాలికంగా ఈక్విటీ మార్కెట్లు కొంత కోలుకోవడం వంటి అంశాలూ పసిడి వెనకడుక్కు కారణమయ్యాయి. అయినా దీర్ఘకాలికంగా పసిడి ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కుదుటపడుతున్నాయనడానికి ఇంకా స్పష్టమైన సంకేతాలు ఏవీ కనిపించడం లేదన్నది నిపుణుల విశ్లేషణ. లాభాల స్వీకరణ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల పరుగులు వంటి అంశాలు గత వారం పసిడిని కొంచెం వెనక్కు నెట్టినా... ఇది స్వల్పకాలిక ధోరణేనన్నది వారి అభిప్రాయం. వారం వారీగా పసిడి అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా కొంత బలహీనపడింది. అయితే ఇది పసిడి ఇక వెనకడుగుగా భావించరాదన్నది నిపుణుల వాదన. వారంలో ధరల కదలిక... అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా)కు 17 డాలర్లు తగ్గి, 1,341 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛ త ధరలు రూ.45 చొప్పున తగ్గి, వరుసగా రూ.31,065, రూ.30,915 వద్ద ముగిశాయి. ఇక వెండి వారం వారిగా స్థిరంగా కేజీకి రూ.47,470 వద్ద ముగిసింది. -
పసిడి దిగుమతులపై ఆంక్షలు మరికొంత కాలం
న్యూఢిల్లీ: ఇరాక్, కొన్ని ఇతర దేశాల్లోని పరిణామాలు కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బంగారం దిగుమతులపై ఆంక్షలను ఇప్పుడే సడలించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. క్యాడ్ సమస్య అదుపులోకి వచ్చినప్పటికీ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ ఆదివారం మీడియాతో చెప్పారు. ‘ఇరాక్, మధ్య ప్రాచ్య దేశాల్లో సంఘర్షణలతో చమురు ధరలు ఎగిసి దిగుమతుల బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా క్యాడ్పై ఒత్తిడి పెరుగుతుంది. విదేశీ మారక ప్రవాహం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే పుత్తడి దిగుమతులపై ఆంక్షల సడలింపుపై దృష్టిసారించగలం’ అని వివరించారు. బంగారం, పెట్రోలియం దిగుమతులు పెరిగిపోవడంతో 2012-13లో కరెంటు అకౌంటు లోటు రికార్డు స్థాయిలో 8,800 కోట్ల డాలర్లకు (స్థూల జాతీయోత్పత్తిలో 4.7 శాతం) చేరింది. తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడంతో గతేడాది ఇది 3,240 కోట్ల డాలర్లకు(జీడీపీలో 1.7%) దిగివచ్చింది. కాగా స్విట్జర్లాండ్ జూన్లో భారత్కు రూ. 11,000 కోట్ల విలువైన బంగారం, వెండిలను ఎగుమతి చేసింది. స్విట్జర్లాండ్ మొత్తం ఎగుమతుల్లో (రూ.26,000 కోట్లు) ఇది 42 శాతానికి సమానమని స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది మే దిగుమతులతో పోల్చితే 33 శాతం అధికమని పేర్కొంది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే భారత్కు స్విట్జర్లాండ్ రూ.50 వేల కోట్ల విలువైన బంగారం, వెండిలను ఎగుమతి చేసింది.