జెడ్డాలో భారతీయుల పడిగాపులు
న్యూఢిల్లీ: సాంకేతికలోపం కారణంగా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 747 విమానం బుధవారం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నిలిచిపోయింది. పైలట్ హైడ్రాలిక్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యను గుర్తించడంతో విమానాన్ని జెడ్డా విమానాశ్రయంలోనే నిలిపేశారు. జెడ్డా నుంచి కోజికోడ్ రావాల్సిన ఏఐ-962 విమానంలో 350 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరంతా స్వదేశం తిరిగి వచ్చేందుకు జెడ్డాలో పడిగాపులు కాస్తున్నారు.
కొద్ది గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే గడిపిన ప్రయాణికులకు ఆ తర్వాత సమీపంలోని హోటల్లో ఎయిరిండియా అధికారులు బస ఏర్పాటు చేశారు. ప్రయాణికులను స్వదేశం తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక విమానాలు జెడ్డా బయలు దేరాయని తెలిపారు. ఈ విమానాల్లో ఒకటి గురువారం అర్థారాత్రి తర్వాత, మరో విమానం శుక్రవారం ఉదయం ప్రయాణికులతో స్వదేశానికి బయలుదేరతాయని వెల్లడించారు.