BOFA
-
జియో, ఎయిర్టెల్ ఓకే.. వీఐఎల్పైనే సందేహం..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా సర్కిల్స్‌లో 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే సామర్థ్యాలు ఉన్నాయని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అయితే, ఆర్థిక సమస్యల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కూడా బిడ్డింగ్‌లో పాల్గొనడంపైనే అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇప్పటికే 4జీ బ్యాండ్లన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్పెక్ట్రం తీసుకోకుండా ప్రస్తుత 4జీ బ్యాండ్‌పైనే నిర్దిష్ట సర్కిళ్లలో 5జీ సేవలు అందించడం కష్టసాధ్యంగా ఉంటుందని వివరించింది. ‘స్పెక్ట్రంకు భారీగా ధర నిర్ణయించడంతో కొత్త టెల్కోలు వేలంలో పాల్గొనే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నాయి. 5జీ బిడ్డింగ్ కోసం వీఐఎల్ నిధులను ఎలా సమకూర్చుకోగలుగుతుందనే అంశంపై స్పష్ట,త లేదు‘ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో కీలకమైన కొన్ని సర్కిళ్లపైనే వీఐఎల్ దృష్టి పెట్టవచ్చని, తమకు ప్రధానమైన 3జీ, 4జీ సర్కిల్స్‌లో మాత్రమే బిడ్ చేయొచ్చని తెలిపింది. అయితే, దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రం లేకపోతే వీఐఎల్ మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. 1 లక్ష మెగాహెట్జ్ స్పెక్ట్రంను రూ. 7.5 లక్షల కోట్ల రిజర్వ్ ధరతో (30 ఏళ్లకు కేటాయిస్తే) వేలం వేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ ఏడాది జూన్ ఆఖర్లో లేదా జూలై తొలినాళ్లలో వేలం నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆగస్టు–సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు రావచ్చని అంచనా. స్పెక్ట్రం వేలం ప్రతిపాదనను కేంద్ర టెలికం శాఖ ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ తుది ఆమోదముద్ర కోసం పంపనుంది. -
స్లో రికవరీకే ఛాన్సులెక్కువ!
షేర్లలాంటి రిస్క్ ఎక్కువుండే అసెట్స్‌పై మదుపరులు బేరిష్‌గా ఉంటారని, దీంతో మార్కెట్లలో, ఎకానమీలో రికవరీ చాలా మందకొడిగా వస్తుందని బోఫాఎంఎల్ అంచనా వేసింది. కరోనా వైరస్ మరోదఫా ఉధృతి చూపే రిస్కులున్నందున ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారని బోఫా సర్వేలో తేలింది. మార్చి కనిష్ఠాల నుంచి ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా కొంతమేర కోలుకున్న సంగతి తెలిసిందే. ఎకానమీలో రికవరీ వేగంగా ఉంటుందన్న అంచనాలు ఈ పుల్‌బ్యాక్‌కు దోహదం చేశాయి. కానీ తాజాగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతూనే ఉండడం, ఆంక్షలు సడలిస్తే సంక్షోభం ముదరడం వంటివి ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లుజల్లాయి. కరోనా సెకండ్‌వేవ్ వస్తుందన్న భయమే అతిపెద్ద రిస్కని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సంక్షోభానంతరం U ఆకారపు లేదా W రికవరీ ఉంటుందని సర్వేలో 75 శాతం మంది అంచనా వేయగా, కేవలం 10 శాతం మంది మాత్రమే V ఆకార రికవరీకి ఛాన్సులున్నాయని భావించారు. మిగిలినవాళ్లు ఎటూ చెప్పలేమన్నారు. రికవరీలో మందగమనం, లేదా వృద్ధి కొంత పురోగమించి తిరిగి నేలచూపులు చూసి అనంతరం రికవరీ చెందడాన్ని వరుసగా యూ, డబ్ల్యు ఆకార రికవరీలంటారు. సంక్షోభ నేపథ్యంలో ప్రజల వద్ద నగదు నిల్వలు 5.7 శాతానికి ఎగబాకినట్లు సర్వేలో తేలింది. ఇన్వెస్టర్లు హడావుడిగా పెట్టుబడులు పెట్టేకన్నా నగదు చేతిలో ఉంచుకొని వేచిచూసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బోఫా పేర్కొంది. ఈ సర్వే యూఎస్ మార్కెట్లను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని చేసినా, ఫలితాలు అన్ని దేశాలకు వర్తించేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
వృద్ధి అంచనాలు కట్
• 7.3 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ • 7.1 శాతానికి కుదించిన బీవోఎఫ్ఎ • నోట్ల రద్దు ప్రభావమే కారణం ముంబై: నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్లు (బీవోఎఫ్ఎ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను కుదించారుు. పెద్ద నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను మోర్గాన్ స్టాన్లీ.. 7.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. అలాగే, 2017-18 అంచనాలను కూడా 7.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. 2018-19లో 7.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా డిసెంబర్ ఆఖరు దాకా నగదు లావాదేవీలు అస్తవ్యస్తమై, దేశీయంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని తెలిపింది. నల్లధనంపై పోరు పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా గృహస్తులు.. సమీప భవిష్యత్‌లో భారీ కొనుగోళ్లను నిలిపివేయొచ్చని, మధ్యకాలికంగా ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేయడం తగ్గవచ్చని వివరించింది. ’మొత్తం మీద దేశం వృద్ధి బాటలోనే ఉన్నా, పెద్ద నోట్ల రద్దు పరిణామం సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వృద్ధి రికవరీ మందకొడిగా ఉండవచ్చు’ అని తెలిపింది. మరోవైపు, విదేశాల్లో డిమాండ్ మెరుగుపడి, కమోడిటీయేతర ఉత్పత్తుల సారథ్యంలో గడిచిన నాలుగు నెలలుగా ఎగుమతులు పెరుగుతుండటం సానుకూల అంశమని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2016లో 3 శాతంగా ఉన్న ప్రపంచ దేశాల వృద్ధి 2017లో 3.4 శాతానికి పెరగవచ్చని, భారత్ నుంచి ఎగుమతులు కూడా దీనికి తోడ్పడగలవని తెలిపింది. 2017 తొలి త్రైమాసికం అనంతరం పరిస్థితులు కాస్త చక్కబడి.. ప్రైవేట్ పెట్టుబడులు మొదలైతే 2018 నుంచి ఎకానమీ పూర్తి స్థారుులో దూసుకుపోతుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 30 బేసిస్ పారుుంట్లు కట్: బీవోఎఫ్ఎ డీమానిటైజేషన్ దరిమిలా 2016-17లో భారత్ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 30 బేసిస్ పారుుంట్లు తక్కువగా 7.1 శాతం స్థారుులో మాత్రమే ఉండగలదని బీవోఎఫ్‌ఏ పేర్కొంది. అటు 2017-18లో కూడా జీడీపీ వృద్ధి 30 బేసిస్ పారుుంట్ల తగ్గుదలతో 7.3 శాతంగా ఉండగలదని వివరించింది. 2016-17లో 7.4 శాతంగాను, 2017-18లో 7.6 శాతంగాను భారత్ వృద్ధి ఉండొచ్చని బీవోఎఫ్ఎ గతంలో అంచనా వేసింది. మరోవైపు డిసెంబర్ 7న జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను 25 బేసిస్ పారుుంట్ల మేర తగ్గించవచ్చని పేర్కొంది. అరుుతే, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) అంశం ద్వారా వడ్డీ ఆదాయమేదీ రాదు కనుక ఒకవేళ ఆర్బీఐ పాలసీ రేట్లు 25 బేసిస్ పారుుంట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించలేకపోవచ్చని బీవోఎఫ్ఎ తెలిపింది. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) బాండ్లను తగు పరిమాణంలో జారీ చేసిన తర్వాత సీఆర్ఆర్ పెంపు నిర్ణయాన్ని సమీక్షిస్తామంటూ ఆర్బీఐ వెల్లడించడం సానుకూలాంశమని బీవోఎఫ్ఎ తెలిపింది.