Boko Haram extremists
-
రెచ్చిపోయిన బొకోహరాం మిలిటెంట్లు
మైదుగురి : నైజీరియాలో బొకోహరాం మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగునే ఉన్న కామెరూన్లో తీవ్రవాద కార్యకలాపాలతో నిరాశ్రయులైన వారికి మైదుగురి సమీపంలో ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఇక్కడి శిబిరాల్లో సుమారు 80 వేల మంది నైజీరియా పౌరులు తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో బొకోహరాంనకు చెందిన తీవ్రవాదులు ఈ శిబిరాలపై కాల్పులు జరపటంతో ఏడుగురు చనిపోయారు. రాత్రివేళ కావటంతో అందరూ నిద్రిస్తున్నారని, అందుకే మృతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. -
గొంతులు కోసి.. కాల్పులు జరిపి భయానకంగా..
మైదుగురి : నైజీరియాకు చెందిన ముస్లిం తీవ్రవాద సంస్థ బొకో హరామ్ మరోసారి రెచ్చిపోయింది. గ్రామాలపై విరుచుకుపడి ఏకంగా 27మంది అమాయక పౌరులను హత్య చేసింది. ఎన్గాన్జయి, గుజామల గ్రామాలపై శుక్రవారం సాయంత్రం బొకోహరామ్ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా 15 మంది పౌరులను గొంతులు కోసి హతమార్చారు. మరికొందరిని చిత్రహింసలు పెట్టి కాల్పులు జరిపి తీవ్రవాదులు చంపేశారు. స్థానికుల ఇళ్లకు సైతం మంటలు పెట్టి పైశాచిక పర్వం కొనసాగించారు. ఈ దుర్ఘటన అనంతరం సైన్యం ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిందని అధికారులు తెలిపారు.