
గొంతులు కోసి.. కాల్పులు జరిపి భయానకంగా..
నైజీరియాకు చెందిన ముస్లిం తీవ్రవాద సంస్థ బొకో హరామ్ మరోసారి రెచ్చిపోయింది.
మైదుగురి : నైజీరియాకు చెందిన ముస్లిం తీవ్రవాద సంస్థ బొకో హరామ్ మరోసారి రెచ్చిపోయింది. గ్రామాలపై విరుచుకుపడి ఏకంగా 27మంది అమాయక పౌరులను హత్య చేసింది. ఎన్గాన్‌జయి, గుజామల గ్రామాలపై శుక్రవారం సాయంత్రం బొకోహరామ్ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
ఇందులో భాగంగా 15 మంది పౌరులను గొంతులు కోసి హతమార్చారు. మరికొందరిని చిత్రహింసలు పెట్టి కాల్పులు జరిపి తీవ్రవాదులు చంపేశారు. స్థానికుల ఇళ్లకు సైతం మంటలు పెట్టి పైశాచిక పర్వం కొనసాగించారు. ఈ దుర్ఘటన అనంతరం సైన‍్యం ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిందని అధికారులు తెలిపారు.