
రెచ్చిపోయిన బొకోహరాం మిలిటెంట్లు
మైదుగురి : నైజీరియాలో బొకోహరాం మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగునే ఉన్న కామెరూన్‌లో తీవ్రవాద కార్యకలాపాలతో నిరాశ్రయులైన వారికి మైదుగురి సమీపంలో ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది.
ఇక్కడి శిబిరాల్లో సుమారు 80 వేల మంది నైజీరియా పౌరులు తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో బొకోహరాంనకు చెందిన తీవ్రవాదులు ఈ శిబిరాలపై కాల్పులు జరపటంతో ఏడుగురు చనిపోయారు. రాత్రివేళ కావటంతో అందరూ నిద్రిస్తున్నారని, అందుకే మృతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.