Bommarillu movie
-
బొమ్మరిల్లు విడుదల రోజులను గుర్తు చేసుకున్న సిద్ధార్థ
-
‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది: డైరెక్టర్
‘బొమ్మరిల్లు’.. ఈ సినిమా పేరు వినగానే మొదట గుర్తొచ్చే పాత్ర ఏంటంటే హా.. హా.. హాసిని. అంతగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం హీరోయిన్ చూట్లూ తిరిగే ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బొమ్మరిల్లు హిట్‌తో డైరెక్టర్ భాస్కర్ పేరు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌గా మారింది. అంత పెద్ద విజయం సాధించిన ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిన హాసిని పాత్రను ఎలా క్రియేట్ చేశారన్నది ఈ సందర్భంగా వివరించాడు. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఆయన మాట్లాడుతూ.. తన నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా హాసిని పాత్రను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘ఆర్య సినిమాకు పని చేస్తున్న సమయంలో ఈ మూవీ హిట్ అయితే నాతో ఓ సినిమా చేస్తానని రాజు గారు(‘దిల్’ రాజు) మాట ఇచ్చారు. మంచి కథ సిద్దం చేసి తనని కలవమని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆర్య హిట్ అయ్యింది. దీంతో ఆయనకు రెండు సార్లు స్క్రిప్ట్‌లు వివరించాను. అవి ఆయనకు నచ్చలేదు. మూడోసారి బొమ్మరిల్లు కథతో వెళ్లాను. ఈ కథ నచ్చింది కానీ, హీరోయిన్ పాత్ర అంతగా లేదు, దాని మీద మరింత వర్క్ చేసి రమ్మన్నారు. దీనికి నేను 15 రోజులు గడువు అడిగాను. హీరోయిన్ పాత్ర ఎలా తీర్చిదిద్దాలని నేను, వాసు వర్మ తెగ ఆలోచించాం. కానీ సరైన లైన్ తట్టట్లేదు. ఇలా 14 రోజులు గడిచాయి. చిరాకు వస్తుంది. 15వ రోజు వచ్చేసింది. రాత్రంతా నిద్ర లేదు’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక ‘ఆ రోజు రాత్రి నేను, వాసు చర్చించుకుంటూనే ఉన్నాం. మాటల మధ్యలో నా జీవితంలో జరిగిన సంఘటనను ఆయనకు చెప్పాను. ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములు వస్తాయని మరోసారి ఢీకొట్టి వెళ్లిందని చెప్పాను. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది అన్నారు. దీంతో ఈ పాత్రకు ఏ హీరోయిన్ కావాలని అడిగారు. జెనీలియాను తీసుకుందామని చెప్పాను. అలా హాసిని పాత్రను చాలా కష్టపడి క్రియేట్ చేశాం’ అని వివరించాడు. కాగా 9 ఆగష్టు 2006 విడుదలైన ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్ నటించాడు. ప్రకాశ్ రాజ్, జయసుధలు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
పదం పలికింది – పాట నిలిచింది
ప్రియురాలి గురించి ఎందరు ఎన్నిసార్లు వర్ణించినా అది తియ్యగానే ఉంటుంది. ఒక మామూలు మగవాడిని సైతం కవిగా మలుస్తుంది కదా ప్రేయసి! మరి ఆమెను వర్ణించే ప్రయత్నంలో అతడు కవిత్వం రాయకా తప్పదు; అతిశయాలకు పోకా తప్పదు. 2006లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రంలోని ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి’ పాటలోని ఈ పాదాలు దీనికి సాక్ష్యమిస్తాయి. ‘తీపి కన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే/ వెంటనే నీ పేరని అంటానే హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే/ నువ్వు వెళ్లే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే/ నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే’ ఈ పాటకు క్రెడిట్ కులశేఖర్/ అనంత శ్రీరామ్ అని ఇద్దరి పేర్లూ వున్నప్పటికీ, ఈ వెర్షన్ రాసింది మాత్రం తానేనని అనంత శ్రీరామ్ స్వయంగా వెల్లడించారు. అప్పటికి ఆయన పరిశ్రమకు కొత్త కావడం, అప్పటికే కులశేఖర్‌కు నిర్మాత దిల్ రాజు డబ్బులు చెల్లించి ఉండటంతో మార్కెట్ దృష్ట్యా ఇద్దరి పేర్లూ వేశారట. ‘అది దిల్ రాజు గారి విశాల హృదయానికి చిహ్నం’ అంటారు అనంత శ్రీరామ్. ‘అపుడో ఇపుడో ఎపుడో’ లైన్ ఇచ్చింది మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. పాడింది సినిమాలో నాయకుడు కూడా అయిన సిద్ధార్థ. -
కలగన్నానే నే మనసిస్తాననీ...
పాట నాతో మాట్లాడుతుంది నా తండ్రి అనంత శ్రీరామ్... మహాకవి సినారెలా తొలి సినిమాలోనే ఆ సినిమా పాటలన్నీ రాశాడు తెలుసా. 21 సంవత్సరాలకే మొదటి సినిమాలో మొత్తం పాటలు రాశాడు... అంటూ మాట కలిపింది నాతో ఓ పాట. ‘‘నువ్వు ఏ పాటవు తల్లీ - దుమ్ము దులిపిన దిల్ రాజా ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘అపుడో ఇపుడో’ పాటను’ అంటూ పరిచయం చేసుకుంది. ‘నాకు చాలా ప్రియమైన పాటవు సుమా. చెప్పమ్మా’ అన్నాను. చిత్రం బొమ్మరిల్లు - దర్శకుడు భాస్కర్. సంగీత దర్శకుడు - దేవిశ్రీ సన్నివేశం సర్వసాధారణంగా కథానాయిక గురించి నాయకుడు తలచుకునేదే. అన్ని చిత్రాల్లో ఉంటుంది. ఏ సినిమాకు ఆ పాట కొత్తగా అందించడమే రచయితకు పరీక్ష. ‘కలగన్నాను నీ గురించి మనసిచ్చాను నిను వరించి’ ఇలాంటి భావాన్ని సరికొత్తగా దర్శకుడు, సంగీత దర్శకుడు ప్రేక్షకుల మనసు ఊహల్లో తేలిపోయేలా మాటాడుకున్నట్టు రాయండి డాడీ’’ అన్నాను. చిన్నప్పటి నుండి తండ్రితో భజన గీతాలు అలవోకగా పాడుకుని - స్కూల్లో, కాలేజీలో అవసరార్థం ఆశువుగా రాయగలిగిన మా డాడీ అనంత్ శ్రీరామ్ అందుకున్నాడు ఇలా... ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ... అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ... కలవో అలవో వలవో (కలలా వచ్చి - అలలా తాకి - వలగా పట్టేసి) నా ఊహల హాసినీ... మదిలో కథలా మెదిలే నా కలల సుహాసినీ’ ‘పల్లవి చివరి వాక్యంలో ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి డాడీ’ అనగానే నవ్వుకుంటూ... ‘‘ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని - ’ పల్లవి ముగించాడు. ఇక చరణం... ప్రపంచంలో అన్నిటికన్న ఇష్టమైన శబ్దం... కోకిల రాగమో - చిలక పలుకో కాదట... ‘మన పేరు మాత్రమేనని ఒక సర్వే. అందుకే ‘తీపికన్నా ఎంతో తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే’ పై భావాన్ని అనుసరిస్తూ. హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే... నువ్వు వెళ్లే దారని అంటానే’ అని రాసి... మళ్లీ చరణంలో చివరి వాక్యాలు కొసమెరుపు కోసం ఆలోచించి ప్రేమని - ప్రేయసిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని... ‘నీలాల ఆకాశం నా నీలం ఏదంటే... నీ వాలు కళ్లలో ఉందని అంటానే’ అనటంతో తొలిచరణం ముగిసింది. ఆకాశం - కురులో కనుపాపలో నీలిమ - ఈ పోలికలు కావ్యాలు చదువుకున్న శ్రీరామ్‌కు కరతలామలకాలే కదా. రెండో చరణం హీరోవైపుగా రాశాడు. అది కూడా చాలా కొత్తగా. ఎవరైనా మనల్ని అభిమానించినప్పుడు, ప్రశంసాత్మకంగా చూసినప్పుడు, ‘భలే మంచిపని చేశానే’ అంటూ మనల్ని మనం మెచ్చుకుంటాం. ఇది సాధారణంగా మన అందరికీ అనుభవమే. అలాగే... మనం బాగా ఇష్టపడేవారు దూరమైపోతే మనల్ని మనం పోగొట్టుకున్నట్టు అనిపించడమూ అంతే. సరిగ్గా ఈ పై భావాలను గుర్తు చేయగానే నా తండ్రి అద్భుతంగా సర్వసాధారణ యువ హృదయ భావాలను చరణించాడు. ‘‘నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే.. నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటె నువ్వు నాతో మాటాడావంటే... నాతోనే నేనుంటా - నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అంటూ ముగించాడు. ‘ఓకే బై తేజా’ అంది అనంతుని అనంతమైన గీతం.