bonakal
-
భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక..
సాక్షి, బోనకల్(ఖమ్మం): భర్త పరాయి మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బోనకల్లో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోనకల్‌కు చెందిన రావుట్ల శివ, సంధ్య(28)లకు 12ఏళ్ల క్రితం వివా హమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి మనస్తాపానికి గురైంది. ప్రేమించి పెళ్లాడినవాడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆలో చిస్తూ ఆవేదన చెందింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యా దు మేరకు ఎస్ఐ కొండలరావు సంఘటనా స్థలా నికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధిర సీఐ మురళి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఆర్థిక దోపిడీ నుంచి దేశాన్ని కాపాడాలి : సీతారం ఏచూరి
సాక్షి, బోనకల్: సామాజిక దౌర్జన్యం, ఆర్థిక దోపిడీ నుంచి దేశాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వెనుకబాటు తనానికి కారణం పాలకుల ఏలుబడేనన్నారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజా ఉద్యమాల ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో ఆర్థిక దోపిడీ, ధరల పెరుగుదల, రైతు ఆత్మహత్యలు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి కాంగ్రెస్, బీజేపీ విధానాలే కారణమన్నారు. పెట్టుబడిదారులు బ్యాంకుల నుండి రూ.12లక్షల కోట్లను అప్పుగా తీసుకొని... విదేశాలకు వెళ్లడం వెనుక ప్రధాని ప్రోత్సాహం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని విమర్శించారు. దళితులు, ముస్లింలు, గిరిజనులపై దౌర్జన్యాలు నానాటికి పెరిగి పోతున్నాయన్నారు. మోదీ సర్కారు కనుసన్నల్లో టీఆర్ఎస్ నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాలు విప్లవకారులకు వేదికగా ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. విప్లవ కారులకు తెలంగాణ రాష్ట్రం తీర్థయాత్ర లాంటిదన్నారు. దేశంలో మోదీ, తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్లను గద్దె దించాలన్నారు. దేశంలో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 371(డీ) ఆర్టికల్ పాలకుల నిర్లక్ష్యం వలన వెనుకబాటుతనానికి కారణమైందన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి కోట రాంబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు, నాయకులు దొండపాటి నాగేశ్వరావు, మాదినేని లక్ష్మీ, బండి పద్మ, కోట రాంబాబు, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
ట్రక్ మీద పడి వ్యక్తి మృతి
బోనకల్ (ఖమ్మం) : ట్రాక్టర్ హైడ్రాలిక్ కిందకు దించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా అది మీద పడడంతో మృతిచెందాడు. ట్రాక్టర్లో తెచ్చిన మట్టిని హైడ్రాలిక్ సాయంతో కింద పడేసిన తర్వాత హైడ్రాలిక్ అలాగే నిలిచిపోవడంతో ట్రక్ కింది భాగంలో ఉన్న ఎయిర్ పైపును సవరిస్తుండగా.. ఒక్కసారిగా ట్రక్ మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుజ్జర్లపుడి అశోక్(30) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్ర మంలో శుక్రవారం ట్రాక్టర్ మరమ్మత్తు చేస్తుండగా.. హైడ్రాలిక్ ఒక్కసారిగా కిందకు రావడంతో ట్రక్ మీద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ
బోనకల్లు (ఖమ్మం జిల్లా): బోనకల్లు మండలం తూటికుంట్లలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్ఓ జమ్మిశెట్టి నాగేశ్వరరావు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పొలానికి సంబంధించిన పాస్‌బుక్ మంజూరు చేసేందుకు వీఆర్ఓ నాగేశ్వరరావు రూ.4 వేలు లంచం డిమాండ్ చేయడంతో రైతు కన్నెపోగు వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్ఓ నాగేశ్వరరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్, బైక్ ఢీ: ఇద్దరు దుర్మరణం
బోనకల్ : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట బ్రిడ్జి వద్ద ఓ ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మంగళారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కలకోట గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ వెంగళ పుల్లయ్య (48), సిరిపురం గ్రామానికి చెందిన చావా కృష్ణప్రసాద్ (24)లు ఒకే బైక్‌పై మధిర వైపు వెళుతున్నారు. కలకోట బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలతో వారిద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. -
అన్నదాతల ఆందోళన
బోనకల్, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే దిక్కుతోచని అన్నదాత లు రోడ్డెక్కారు. సాగు నీరందించాలంటూ వైరా- జగ్గయ్యపేట జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. అయితే అదో పెద్ద నేరంగా భావించిన పోలీసులు.. రైతులను అరెస్ట్ చేసి వారిపై లాఠీలు ఝుళిపించారు. వివరాలిలా ఉన్నాయి.. నాగార్జునసాగర్ కాల్వ పరిధిలోని రాపల్లి మేజర్ కింద వైరా మండ లం అష్టగుర్తి, పాలడుగు, బోనకల్ మండలం సీతానగరం, రాపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి గ్రామాలకు చెందిన రైతుల పొలాలు సాగ వుతున్నాయి. ఖరీఫ్‌లో వరి, పత్తి సాగు చేయగా, అకాల వర్షాలతో భారీగా నష్టపోయారు. సాగర్ నిండా నీరున్నప్పటికీ రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని అధికారులు చెప్పడంతో మొక్కజొన్న, మిను ము, బొబ్బెర తదితర పంటలు వేశారు. వారబందీ విధానంతో నెలలో రెండు వారాలు నీరు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, 15 రోజులు దాటినా.. సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయి. బీబీసీకి 1300 క్యూసెక్కులకు గాను, 800-900 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తుండటంతో చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఈ విషయాన్ని ఎన్నెస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతు లు రాస్తారోకోకు దిగారు. అధికారులు వచ్చి తమకు సరైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ తాండ్ర నరేష్ అక్కడికి చేరుకుని, 20 మంది రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులపై జులుం.. రాస్తారోకో చేస్తున్న రైతులపై ఎస్ఐ నరేష్ జులుం ప్రదర్శించారు. కాల్వ వద్దకు వెళ్దామంటూ వారిని ఆటో ఎక్కించి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ రైతులను వరుసక్రమంలో నిల్చోబెట్టి లాఠీకి పనిచెప్పారు. దీంతో రైతులు నివ్వెర పొయారు. సాగునీటి కోసం వస్తే తమకీ శిక్ష ఏంటని నిశ్చేష్టులయ్యారు. జానకీపురం గ్రామ సర్పంచ్ భర్త మాలెంపాటి రామకృష్ణను ముందుగా పిలిచి చితకబాదారు. రైతు సంఘాల ఆగ్రహం.. రైతుల అరెస్ట్ విషయం తెలియగానే పలు రైతు సంఘాలు, పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, సాగునీటి కోసం రాస్తారోకో చేసిన వారిపై చేయిచేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ వారి ముందే మరోసారి రైతులపై జులుం ్రపదర్శించారు. దీంతో రైతులు, నాయకులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. అనంతరం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసుల వైఖరిని అఖిల పక్షనాయకులు పైడిపల్లి కి షోర్, తమ్మారపు వెంకటేశ్వర్లు, గాలి దుర్గారావు, బొడేపూడి చందు, చిలక వెంకటేశ్వర్లు, జంగం ఆర్లప్ప, తన్నీరు రవి, చింత లచెర్వు కోటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, చావా హనుమంతరావు, మందడపు తిరుమలరావు తదితరులు తీవ్రంగా ఖండించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
లైంగికదాడి జరిపి ఆపై అఘాయిత్యం?
బోనకల్, న్యూస్లైన్ః నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా మహిళలపై దురాగతాలకు తెరపడడం లేదు. ఖమ్మం-కృష్ణాజిల్లా సరిహద్దు ప్రాంతమైన బోనకల్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన కలకలం రేపింది. నిందితులు మహిళపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు... జిల్లా సరిహద్దులో పొలాలకు వెళ్లే డొంకరోడ్డులో మహిళ మృతదేహం పడి ఉండడం, చుట్టూ రక్తపు మడుగు ఉండడం కొందరు కూలీలు మంగళవారం ఉదయం గమనించారు. వారు వెంటనే కృష్ణాజిల్లా వత్సవాయి వీఆర్వో సురేష్‌కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో నందిగామ డీఎస్పీ చిన్నహుస్సేన్.. ఇన్చార్జి సీఐ భాస్కరరావు, చిల్లకల్లు ఎస్సై అబ్దుల్ నబీతో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ తల కుడివైపు క ణతపై బలంగా రాయితో మోదినట్లు గాయాలున్నాయని డీఎస్పీ తెలిపారు. కాగా, మృత దేహానికి దగ్గరలో మద్యం సీసాలు ఉండటాన్ని బట్టి ఆమైపై లైంగికదాడి జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు మహిళను రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం వద్దకు తీసుకువచ్చి తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించి, ఆమెపై లైంగిక దాడిచేసి ఆ తరువాత హత్యచేసి వుంటారని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతురాలు ఖమ్మం జిల్లా వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చింతకాని, మధిర మండలాలకు చెందిన మహిళ అయివుంటుందన్న కోణంలో దర్యాప్తుచేస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో కృష్ణాజిల్లా వత్సవాయి, ఖమ్మం జిల్లా బోన కల్ మండల ఆటో డ్రైవర్లను విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సంఘటన స్థలంలో ఆధారాలకోసం అన్వేషిస్తున్నారు. మృతురాలి ఫొటోను చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, బోనకల్, మధిర,చింతకాని తదితర పోలీస్స్టేషన్లలో ఉంచారు. మృతదేహాన్ని పోస్టుమార ్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్య సంఘటనతో రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని పెనుగంచిప్రోలు ఎస్ఐ ఉమా మహేశ్వరరావు, బోనకల్ ఎస్ ఐ రామకృష్ణారావు పరిశీలించారు. -
అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
బోనకల్/ టేకులపల్లి, న్యూస్‌లైన్: ఆర్థిక ఇబ్బందులు ఇద్దరు రైతులను బలితీసుకున్నాయి. సరైన దిగుబడి రాక, పండిన పంటలకూ గిట్టుబాటు ధర లేక అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు. ఉరివేసుకుని ఒకరు, పురుగుమందు తాగి మరొకరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. బోనకల్, టేకులపల్లి మండలాల్లో జరిగిన ఈ విషాద ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ (55) కు ఎకరంన్నర భూమి ఉంది. దీనికి తోడు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేయగా.. దిగుబడి సక్రమంగా రాలేదు. గత ఏడాది కూడా తన భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ వేశాడు. అయితే సాగర్ నీరు సకాలంలో అందక పంటంతా ఎండిపోయింది. ఇలా రెండు సంవత్సరాలకు కలిపి రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఇది తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఉద్దండు.. శనివారం ఉదయం రోజూలాగే పొలానికి వెళ్లి అక్కడే వేపచెట్టుకు ఉరివేసుకుని బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఉద్దం డుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబపెద్దను కోల్పోవడంతో వారు వీధిన పడ్డారు. మండల వ్యవసాయాధికారి సరిత, ఎస్సై పెద్దిరెడ్డి రామకృష్ణారావు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టేకులపల్లిలో...: టేకులపల్లి మండల కేంద్రంలోని దాస్‌తండాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండాకు చెందిన జర్పుల సీతారాం(48) ఆరు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం టేకులపల్లికి వలస వచ్చాడు. సొంత భూమి లేకపోవడంతో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేయగా.. దిగుబడి సక్రమంగా రాక భారీ నష్టం వాటిల్లింది. అంతకుముందు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడి పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణ ఖర్చుల కోసం చేసిన అప్పు.. మొత్తం రూ. 9 లక్షలకు చేరింది. దీనికి వడ్డీలు కూడా అధికం అవుతుండడంతో ఇంటిని అమ్మి కొంతమేర అప్పు తీర్చాడు. ప్రస్తుతం దాస్‌తండాలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా, ఈ ఏడాది మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి వేశాడు. ఇందుకోసం మరో రూ. రెండు లక్షలు అప్పు చేశాడు. ఇలా రుణబాధలు పెరుగుతుండడంతో తమ మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుండేదని, ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఎప్పుడూ అనేవాడని భార్య సరోజ రోదిస్తూ చెప్పింది. ఈ క్రమంలో అప్పులు తీర్చలేమనే మనోవ్యథతో ఉన్న సీతారాం.. శనివారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భర్తకు భోజనం తీసుకుని పొలానికి వెళ్లిన సరోజ సీతారాం మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. ఆర్ఐ జామ్లా, వీఆర్వో కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించారు.