bones dumping
-
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవి శ్రద్ధా శరీర భాగాలే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ హత్యా ఘటనలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ గది నుంచి సేకరించిన రక్తం నమూనాలు శ్రద్ధవేనని తేలింది. ఎముకలు, రక్తం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు శ్రద్ధా వాకర్ తండ్రి డీఎన్ఏతో సరిపోలాయని ఆ వర్గాలు వివరించాయి. డీఎన్ఏ రిపోర్టుతోపాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక అందిందని స్పెషల్ పోలీస్ కమిషనర్(శాంతిభద్రతలు) సాగర్‌ప్రీత్ హూడా మీడియాకు తెలిపారు. అఫ్తాబ్‌కు నిపుణులు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్ష నివేదిక కూడా బుధవారం పోలీసులకు అందింది. కేసు దర్యాప్తులో ఈ నివేదికలు కీలకంగా మారాయి. శ్రద్ధావాకర్‌తో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనావాలా ఆమెను గొంతుపిసికి చంపిన అనంతరం శరీరాన్ని 35 భాగాలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడవేశాడు. -
మరో ఘోరం : అదే ఆసుపత్రిలో అస్థిపంజరాల కలకలం
సాక్షి, పట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్ ఆసుపత్రిలోమరో దిగ్భ్రాంతికరమైన పరిణామం చోటు చేసుకుంది. మెదడువాపు వ్యాధి (అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్, ఏఈఎస్) ద్వారా పసిపిల్లల మరణాలతో (శనివారానికి 108 మంది) వార్తల్లో నిలిచిన శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఎస్‌కెఎంసిహెచ్)కి సంబంధించి మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రి సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు దర్శనమివ్వడం స్థానికులను భయ భ్రాంతులకు గురిచేసింది. మృతదేహాలలో కొన్నింటిని కాల్చివేసినట్టు, మరికొన్నింటిని సగం పూడ్చినట్టుగా, ఇంకొన్నింటిని బస్తాలలో కుక్కి అక్కడ పడి వున్నాయి. ఇలా పెద్ద ఎత్తున మానవ అవశేషాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇది ఆసుపత్రికి చెందిన పోస్ట్‌మార్టం విభాగం నిర్వాకమని విమర్శలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం తరువాత మృతదేహాలను ఇలా బహిరంగం పారేసినట్టుగా తెలుస్తోందని ఆసుపత్రి కేర్ టేకర్ జనక్ పాస్వాన్ మీడియాకు చెప్పారు. ఇది నిజంగా అమానవీయమని వ్యాఖ్యానించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్కే షాహి సమగ్ర దర్యాప్తును కోరనున్నట్టు చెప్పారు. పోలీసులతో కలిసి ఎస్‌కెఎంసిహెచ్ ఆసుపత్రి దర్యాప్తు బృందం శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించింది. ఆసుపత్రికి చెందిన డాక్టర్ విపిన్ కుమార్ మాట్లాడుతూ, అస్థిపంజర అవశేషాలు కనుగొన్నమాట వాస్తవమేనని సవివరమైన సమాచారం ప్రిన్సిపాల్ నుంచి రాబట్టనున్నామని చెప్పారు. మరోవైపు ఏదైనా మృతదేహం ఒక ఆసుపత్రికి వచ్చినప్పుడు, వెంటనే సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించి, దీనికి సంబంధించి ఒక నివేదికను దాఖలు చేయాలి. అనంతరం శవాన్ని 72 గంటలు పోస్టుమార్టం గదిలో ఉంచాలి. 72 గంటల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోతే, నిర్దేశించిన విధానాన్ని అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయడం లేదా దహనం చేయడమో చేయాలని పోస్ట్‌మార్టం విభాగం డ్యూటీ అని షాహి చెప్పారు. Bihar: Human skeletal remains found behind Sri Krishna Medical College & Hospital, Muzaffarpur. 108 people have died at SKMCH due to Acute Encephalitis Syndrome (AES). pic.twitter.com/ICRcg3Be1e — ANI (@ANI) June 22, 2019 -
ఎముకల డంపింగ్‌కు యత్నం
అడ్డుకున్న ధన్వార్ వాసులు హైదరాబాద్ నుంచి వచ్చిన తొమ్మిది లారీలు తహసీల్దార్‌కు ఫిర్యాదు.. ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున జరిమానా మనూరు: పశువుల ఎముకలు, పుర్రెలను కొందరు వ్యక్తులు బుధవారం తొమ్మిది లారీల్లో మండలంలోని ధన్వార్ శివారుకు తీసుకొచ్చారు. అక్రమంగా డంపింగ్‌కు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించి వదిలేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్ట నుంచి న్యాల్కల్ మీదుగా మనూరు మండలం ధన్వార్‌కు తొమ్మిది లారీల్లో పశువుల ఎముకలు చేరుకున్నాయి. గ్రామానికి చెందిన మహ్మద్ అజీమొద్దీన్ వచ్చి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో డంపింగ్‌కు యత్నించాడు. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి డంప్‌ను అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో డంప్ చేయడానికి ఎవరు అనుమతినిచ్చారని లారీ డ్రైవర్లను నిలదీశారు. ధన్వార్‌కు చెందిన మహ్మద్ అజిమొద్దీన్ చేల్లో డంపింగ్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో స్థానికులు మనూరు తహసీల్దార్ తారాసింగ్‌కు ఫోన్లో సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు సమాచారమిచ్చి సంఘటన స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని లారీలను పరిశీలించారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు ఒక్కో లారీకి రూ.వెయ్యిచొప్పున జరిమానా విధించి లారీలను తిప్పి పంపినట్టు ఏఎస్ఐలు రఫియొద్దీన్, సదానందం తెలిపారు.