booze
-
పెళ్లిళ్లలో దావత్, బరాత్ బంద్.. ఉల్లంఘిస్తే భారీ ఫైన్
పెళ్లిళ్లలో దావత్‌లు, ధూమ్‌ధామ్ డ్యాన్సుల బరాత్‌లు సర్వసాధారణం. ఇందుకు ఎవరూ అతీతులు కారు. ప్రత్యేకించి కరోనా టైంలోనూ వీటిని వీడడం లేదు జనాలు. అలాంటిది వీటిని అనవసర ఖర్చుల కింద భావించిన ఓ ఊరు.. వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని బన్స్వరా పరిధిలోని గోడీ తేజ్‌పూర్ గ్రామం. తాజాగా పెళ్లిళ్లలో మందు, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటి వల్లే వేడుకల్లో విషాదాలు, గొడవలు జరుగుతున్నాయని, అంతేకాదు వాటి వల్ల ఇరుకుటుంబాలు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి ఖర్చు చేసేది అనవసరమైన ఖర్చుగా పేర్కొంటున్నారు ఆ గ్రామ పెద్దలు. ఈ మేరకు నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఇక నుంచి వివాహ వేడుకల్లో ఈ రూల్‌ను ఉల్లంఘించిన వాళ్లకు.. మద్యం సేవిస్తే 21,000రూ., డీజే, నృత్యాలు చేస్తే 51 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరి మాజీ, ప్రస్తుత సర్పంచ్ల సమక్షంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 13 వార్డ్ మెంబర్స్, జిల్లా పరిషత్, పంచాయితీ సమితి సభ్యులు, గ్రామస్తులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. సర్వ సమాజ్ పేరుతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామస్థులందరితో రిజిస్టర్లో సంతకాలు తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన కాపీ నకలును ధన్పూర్ పోలీసులకు సైతం అందించారు. సోషల్ మీడియాలో ఈ గ్రామ నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. -
‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు
నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్‌గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్ రాల్స్.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్‌గా తాగాడు. ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్ మీద కేసు వేశాడు డానియల్ రాల్స్. ఆ రెస్టారెంట్ వల్లే తాను టూమచ్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఆ బార్ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్ ఓనర్‌తో పాటు తనకు సర్వ్ చేసిన బార్టెండర్ను నిందితులుగా పేర్కొన్నాడు. అయితే రాల్స్ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి.. న్యూసెన్స్ క్రియేట్ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాల్ని బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్‌గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్‌కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఆదేశించింది ఆండ్రూస్ కౌంటీ 109వ న్యాయస్థానం. ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు -
మద్యం దొరక్క సబ్బు తినేశాడు
పాట్నా: మద్యనిషేధం బిహార్‌లోని మందుబాబులను కలవర పెడుతోంది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) సహా రాష్ట్రంలో మద్యం(ఆల్కహాల్) విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం మంగళవారం పూర్తి నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత ఆసుపత్రుల్లో మందు బానిసల తాకిడి విపరీతంగా పెరిగింది. బుధవారం వరకు అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం మద్యం దొరక్క 750 మందికి పైగా ఆనారోగ్యం బారిన పడ్డారు. కొందరు వింత వింతగా ప్రవర్తిస్తుంటే, మరికొందరు కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేక పోతున్నారు. మద్యం దొరక్క ఏం చేయాలో అర్థం కాక ఓ వ్యక్తి సబ్బుల మీద సబ్బులు లాగించేస్తున్నాడు. దీనికి సంబంధించి వీడియో అక్కడి లోకల్ చానళ్లలో చెక్కర్లు కొడుతోంది. మందు బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 38 కొత్త డి-అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. అడిక్షన్ సెంటర్లకు వచ్చే వారిలో కొందరు వణుకుతూ, కనీసం నిలబడలేకపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో మద్యం సేవించే వారిలోనే ముఖ్యంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు తెలిపారు. -
బీరు తాగిన అమ్మాయిలకు టీసీలు
చెన్నై: పట్టపగలు.. క్లాస్ రూంలో నలుగురు అమ్మాయిలు కలిసి బీరు కొడతారని ఎప్పుడైనా ఊహించారా? ఆ స్కూలు యాజమాన్యం కూడా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. విషయం తెలియగానే ముందు షాకైనా.. తర్వాత ఆ నలుగురికీ టీసీలు ఇచ్చి ఇంటికి పంపేశారు. ఇదేదో కార్పొరేట్ స్కూల్లో.. బాగా డబ్బున్న ఆసాముల పిల్లలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. తమిళనాడు నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్‌లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వ్యవహారమిది. వీళ్లంతా 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. గోపీదాస్ ఆదేశాలతో వీళ్లకు టీసీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లాసులో నలుగురు అమ్మాయిలు తాగిన మత్తులో ఉన్నట్లు క్లాస్ టీచర్ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె ప్రధానోపాధ్యాయురాలికి చెప్పగా, వాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ.. ఆ నలుగురూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది. స్నేహితురాలి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోడానికి మొత్తం ఏడుగురు విద్యార్థినులు ఆ రోజు స్కూలుకు వచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కూల్ డ్రింకు బాటిళ్లలో బీరు నింపుకొని తీసుకొచ్చారు. అయితే, తర్వాత వాళ్లలో ముగ్గురు భయపడి.. తాగలేదు. మిగిలిన నలుగురూ తాగడంతో.. వాళ్లకు మాత్రం టీసీలు ఇచ్చి పంపేశారు.