borraguhalu
-
బొర్రా అందాలు అమోఘం
అనంతగిరి/అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ స్టడీ ఆన్ పబ్లిక్ సెక్టార్‌పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ గన్వర్ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్‌మిశ్రా, ఓంప్రకాష్ మాతుర్, పార్లమెంట్ సెషన్స్ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు. పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్ఐలు రాము, నజీర్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్ హరి, అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు. -
అంద‘చందం’
ప్రకృతి సోయగాల కోట.. చందంపేట అరకును తలపించే మనోహర దృశ్యాలు బొర్రాగుహలను మరిపిస్తున్న గాజుబిడం గుహలు తొలిసారిగా మండలంలో రెండు ఘాట్ల ఏర్పాటు సందడి చేయనున్న పుష్కర భక్తులు చుట్టూ నల్లని కొండలు.. జాలువారే జలపాతాలు.. పరిచిన పచ్చని తివాచీలా పంట పొలాలు.. కృష్ణమ్మ పరవళ్లు.. అరకును తలపించే దేవరచర్ల అందాలు.. బొర్రా గుహలను మైమరపించే గాజుబిడం గుహలు.. ఆధ్యాత్మికతను పెంచే ఆలయాలు.. 300 ఏళ్లనాటి బృహత్కాల సమాధులు.. ఎటు చూసినా మనసును పరవశించే ప్రకృతి సోయగాలు.. మరో వైపు గిరిజనుల సంస్కృతి.. విభిన్న వంటకాలు.. వీటిని చూడాలంటే ‘చందంపేట’కు వెళ్లాల్సిందే.. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడి అందచందాలపై ఈ వారం సండేస్పెషల్లో మీకోసం.. – చందంపేట -
పర్యాటక ప్రాంతాలు కిటకిట
అరకులోయకు పర్యాటకుల తాకిడి కళకళలాడిన సందర్శిత ప్రాంతాలు అరకురూరల్/అనంతగిరి,న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. అరకులోయ, పద్మాపురం ఉద్యానవనం, బొర్రాగుహలు, అనంతగిరి, తాడిగుడ, కటికిజలపాతం, గాలికొండ వ్యూపాయింట్లలో సందర్శకుల సందడి కనిపించింది.ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఇక్కడి పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియం ఒక్కసారిగా కళకళలాడాయి. రైల్‌కమ్ రోడ్డు ప్యాకేజీ, ప్రైవేటు వాహనాలు, టూరిజం బస్సుల్లో వందలాది మంది రావడంతో అరకులోయతోపాటు పరిసర ప్రాంతాల్లో సందడి సంతరించుకుంది. వాహనాలు అధిక మొత్తంలో రావడంలో అరకులోయ టౌన్షిప్, మ్యూజి యం ఎదుట, పద్మావతి గార్డెన్‌రోడ్డుల్లో రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఒక్కరోజే మ్యూజి యంలో ప్రవేశ రుసుం ద్వారా సుమారు రూ.14 వేలు, పద్మాపురం ఉద్యానవనంలో రూ.12 వేలు ఆదాయం వచ్చినట్లు మ్యూజియం మేనేజర్ మురళీ, పద్మాపురం ఉద్యానవనం మేనేజర్ లకే బొంజుబాబు తెలిపారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనానికి మైదాన ప్రాంతాలవారు ఏజెన్సీ బాట పడుతున్నారు. బొర్రాగుహలను సుమారు 5 వేల మంది సందర్శించుకున్నారు. విద్యా సంవత్సరం ఆరంభానికి మరో పది రోజులే గడువు ఉండడం, ఏటా జూన్ మొదటి రెండు వారాల్లో పర్యాటకుల రద్దీ ఉంటుందని ఆశాఖ అధికారులే పేర్కొంటున్నారు. వారం రోజుల్లో రూ. లక్షన్నర ఆదాయం సమకూరినట్టు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు గిట్టుబాటవుతోంది.